మల్లేశం, శ్రీరాములు మృతదేహాలు
బీబీనగర్ (భువనగిరి) : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెం దారు. ఈ ఘటన మండలంలోని వెంకిర్యాల గ్రా మ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోరి పడమటిసోమవారం గ్రామానికి చెందిన దంతు మల్లేశ్ (26) వెంకిర్యాల గ్రామానికి చెందిన పహిల్వాన్‌పురం యాదయ్య వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం వెంకిర్యాల గ్రామంలోని ఎస్సీలకు చెందిన దశదినకర్మ ఉండడంతో స్నానా లు చేయడానికి ట్యాంకర్‌ను పంపిం చాలని యా దయ్యతో మాట్లాడుకున్నారు.
దీంతో యాదయ్య డ్రైవర్ మల్లేశాన్ని ట్రాక్టర్‌కు ట్యాంకర్‌ను వేసుకుని వెంకిర్యాల గ్రామ శివారులోని చె రువు కట్ట వద్ద గల శ్మశాన వాటికకు వెళ్లాలని చెప్పాడు. దీంతో మల్లేశం ట్యాంకర్‌లో నీటిని నింపుకుని తన మేనల్లుడు ఉప్పట్ల శ్రీరాంలును(18) తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పోలాల్లోకి దూసుకెళ్లి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న మల్లేశంతో పాటు శ్రీరాములుకు తీవ్ర గా యాలయ్యాయి. వారిని ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
డ్రైవింగ్ నేర్చుకుంటానని వచ్చి..
ట్రాక్టర్ డ్రైవర్ మల్లేశం మేనల్లుడైన శ్రీరాములు పడమటిసోమారంలో నివసిస్తున్నాడు. ఖాళీగా ఉండడంతో తాను కూడా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పడంతో మల్లేశం తన ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. మద్యం సేవించి అజాగ్రత్తగా మల్లేశం ట్రాక్టర్‌ను నడుపడం వల్లే ప్రమాదం చో టు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒకే గ్రా మానికి చెందిన ఇద్దరు మామా అల్లుడులు మృ తిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment