ట్రాక్టర్ బోల్తా.. విద్యార్థి మృతి | Student killed in tractor roll over | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. విద్యార్థి మృతి

Published Fri, Aug 30 2013 4:13 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student killed in tractor roll over

తాళ్లూరు, న్యూస్‌లైన్: కరువది మేజర్ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని శివరామపురానికి చెందిన వెన్నపూస నాగిరెడ్డి పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఐఐటీ చదువుతున్నాడు. కళాశాల సెలవు కావడంతో పొలాన్ని బ్లేడుతో చదును చేసేందుకు ట్రాక్టర్‌ను కరువది మేజర్ కాలువ రోడ్డుపై నుంచి తీసుకెళుతున్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు  మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పొక్లెయిన్ సాయంతో ట్రాక్టర్‌ను బయటికి లాగారు.
 
 శోకసంద్రంలో శివరామపురం
 శ్రీనివాసరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుని మృతితో నాగిరెడ్డి దంపతులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement