ఉపాధి పేరిట శేషాచలం అడవుల్లోకి!
► గ్రామీణులే ‘ఎర్ర’ కూలీలుగా టార్గెట్
► ఇప్పటికే పలువురిని తరలించిన వైనం
► ముందస్తు బయానా, రోజుకు రూ.500 కూలి
► కూలీల సేకరణకు ప్రత్యేక ఏజెంట్లు
పలమనేరు: బెంగళూరు, చెన్నె తదితర నగరాల్లో పనులు కల్పిస్తామంటూ పలమనేరు, కుప్పం నియోజకవర్గం లోని గ్రామీణులకు మాయమాటలు చెప్పి శేషాచలం అడవుల్లో ఎర్రదుంగలు నరికివేత పనులకు వారిని ఓ ముఠా చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. పనులు లేని పలువురు నిరక్షరాస్యులను ఇప్పటికే ఈ ఊబిలోకి దించిన ట్టు సమాచారం. ఏజెంట్లు ముందుగా చెల్లించిన డబ్బును అవసరాలకు వాడుకున్న కూలీలు విధిలేక ఈ పనులకు వెళుతున్నట్టు తెలిసింది.
అటవీప్రాంత గిరిజనులే టార్గెట్
పలమనేరు నియోజకవర్గంలోని మండిపేట కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాది కాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటతో పాటు పెద్దపంజాణి, వీకోట మండలాలో్లని అటవీ ప్రాంతాల సమీపంలో పలు గ్రామాలున్నాయి. ఈ గ్రామాలో్లని గిరిజనులు గతంలో అటవీ ఉత్పతు్తలను సేకరించి పొట్టపోసుకునేవారు. మరికొందరు అడవుల్లో పశువులను కాయడం, ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లేవారు. కొంతకాలంగా వీరికి ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. ఇది అవకాశంగా తీసుకున్న ఎర్రచందనం ముఠాలు వీరికి గాలం వేస్తున్నాయి.
బెంగళూరులో పనులని చెప్పి...
బెంగళూరులో కేబుల్ పనులు, టేకు చెట్ల కోత పనులకు కూలీలు కావాలంటూ ఏజెంట్లు నమ్మబలుకుతారు. యువకులకు ఎంపిక చేసుకుని గ్రామంలోని పెద్దమనిషి ముందు వారికి బయానాగా రూ.పదివేల దాకా అందిస్తారు. తాము చెప్పినపుడు పనికిరావాలని చెప్పి వెళ్తారు. ఈ వ్యవధిలోనే ఏజెంట్లు ఇచ్చిన సొమ్ము ఖర్చు చేసిన యువకులు తీరా ఏజెంట్లు పంపిన చోట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో కూలీలు గత కొన్నేళ్లు ఇళ్లకే రాకుండా పోయారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వ్యకు్తలు అదృశ్యవైునా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.
ఇదో ఊబి
అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేందుకు కూలీలుగా వెళ్లిన యువకులు ఆ తర్వాత ఇతర పనులకు వెళ్లడం లేదు. గ్రామాల్లో తిరిగితే పోలీసులు పట్టుకుంటారని వారిని బెదిరించి, మరలా ఇవే పనుల్లో కొనసాగేలా చేస్తున్నట్టు గతంలో ఈ పనులకు వెళ్లిన వారు చెబుతున్నారు. దీనికి తోడు కూలీలకు రోజుకు రూ.500 ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేస్తుంటారని తెలిసింది. తక్కువ కాలంలోనే ఇలా ఎకు్కవ మొత్తంలో సంపాదించి, డాబుగా జీవిస్తుండడం చూసి మరికొందరు ఆకర్షితులైన ఇదే ‘ఎర్ర’బాట పడుతున్నారు. ఈ కూలీల్లో చదువుకున్న వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కూలీల కోసం ప్రత్యేక ఏజెంట్లు
శేషాచలం అడవులో్లకి కూలీలను సరఫరా చేసేందుకు పలమనేరు, వీ.కోటలో పలువురు ఏజెంట్లు ఉన్నట్టు సమాచారం. స్మగ్లర్లకు కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు ఆర్‌సీలున్న వాహనాలను ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎర్రకూలీల వ్యవహారాన్ని గుట్టురట్టు చేయాలంటే కీలకవైున ఏజెంట్లను పట్టుకోవాల్సిన అవరసం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మరెందరో ఈ ఊబిలో కూరుకుపోవడం తథ్యమని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.