Sesacalam forests
-
ఉపాధి పేరిట శేషాచలం అడవుల్లోకి!
► గ్రామీణులే ‘ఎర్ర’ కూలీలుగా టార్గెట్ ► ఇప్పటికే పలువురిని తరలించిన వైనం ► ముందస్తు బయానా, రోజుకు రూ.500 కూలి ► కూలీల సేకరణకు ప్రత్యేక ఏజెంట్లు పలమనేరు: బెంగళూరు, చెన్నె తదితర నగరాల్లో పనులు కల్పిస్తామంటూ పలమనేరు, కుప్పం నియోజకవర్గం లోని గ్రామీణులకు మాయమాటలు చెప్పి శేషాచలం అడవుల్లో ఎర్రదుంగలు నరికివేత పనులకు వారిని ఓ ముఠా చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. పనులు లేని పలువురు నిరక్షరాస్యులను ఇప్పటికే ఈ ఊబిలోకి దించిన ట్టు సమాచారం. ఏజెంట్లు ముందుగా చెల్లించిన డబ్బును అవసరాలకు వాడుకున్న కూలీలు విధిలేక ఈ పనులకు వెళుతున్నట్టు తెలిసింది. అటవీప్రాంత గిరిజనులే టార్గెట్ పలమనేరు నియోజకవర్గంలోని మండిపేట కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాది కాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటతో పాటు పెద్దపంజాణి, వీకోట మండలాలో్లని అటవీ ప్రాంతాల సమీపంలో పలు గ్రామాలున్నాయి. ఈ గ్రామాలో్లని గిరిజనులు గతంలో అటవీ ఉత్పతు్తలను సేకరించి పొట్టపోసుకునేవారు. మరికొందరు అడవుల్లో పశువులను కాయడం, ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లేవారు. కొంతకాలంగా వీరికి ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. ఇది అవకాశంగా తీసుకున్న ఎర్రచందనం ముఠాలు వీరికి గాలం వేస్తున్నాయి. బెంగళూరులో పనులని చెప్పి... బెంగళూరులో కేబుల్ పనులు, టేకు చెట్ల కోత పనులకు కూలీలు కావాలంటూ ఏజెంట్లు నమ్మబలుకుతారు. యువకులకు ఎంపిక చేసుకుని గ్రామంలోని పెద్దమనిషి ముందు వారికి బయానాగా రూ.పదివేల దాకా అందిస్తారు. తాము చెప్పినపుడు పనికిరావాలని చెప్పి వెళ్తారు. ఈ వ్యవధిలోనే ఏజెంట్లు ఇచ్చిన సొమ్ము ఖర్చు చేసిన యువకులు తీరా ఏజెంట్లు పంపిన చోట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో కూలీలు గత కొన్నేళ్లు ఇళ్లకే రాకుండా పోయారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వ్యకు్తలు అదృశ్యవైునా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇదో ఊబి అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేందుకు కూలీలుగా వెళ్లిన యువకులు ఆ తర్వాత ఇతర పనులకు వెళ్లడం లేదు. గ్రామాల్లో తిరిగితే పోలీసులు పట్టుకుంటారని వారిని బెదిరించి, మరలా ఇవే పనుల్లో కొనసాగేలా చేస్తున్నట్టు గతంలో ఈ పనులకు వెళ్లిన వారు చెబుతున్నారు. దీనికి తోడు కూలీలకు రోజుకు రూ.500 ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేస్తుంటారని తెలిసింది. తక్కువ కాలంలోనే ఇలా ఎకు్కవ మొత్తంలో సంపాదించి, డాబుగా జీవిస్తుండడం చూసి మరికొందరు ఆకర్షితులైన ఇదే ‘ఎర్ర’బాట పడుతున్నారు. ఈ కూలీల్లో చదువుకున్న వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కూలీల కోసం ప్రత్యేక ఏజెంట్లు శేషాచలం అడవులో్లకి కూలీలను సరఫరా చేసేందుకు పలమనేరు, వీ.కోటలో పలువురు ఏజెంట్లు ఉన్నట్టు సమాచారం. స్మగ్లర్లకు కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు ఆర్సీలున్న వాహనాలను ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎర్రకూలీల వ్యవహారాన్ని గుట్టురట్టు చేయాలంటే కీలకవైున ఏజెంట్లను పట్టుకోవాల్సిన అవరసం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మరెందరో ఈ ఊబిలో కూరుకుపోవడం తథ్యమని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. -
భయమెందుకు?
తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు జంకుతున్నారు శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర పోలీసుల్ని ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ ఘటనలో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల వివరాలెందుకు ఇవ్వలేదని నిలదీత ఘటనాస్థలికి ప్రత్యేక కమిటీని పంపాలని కమిషన్ నిర్ణయం హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో తప్పు చేశామన్న భయం లేనప్పుడు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో మెజిస్టీరియల్ విచారణ చేయించకుండా రెవెన్యూ అధికారులతో ఎందుకు చేయిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్తోనే విచారణ చేయించాలన్న నిబంధనను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ శేషాచలం ఎన్కౌంటర్ ఘటనలపై గురువారం గంటన్నరకుపైగా విచారించింది. కమిషన్‌లో జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్‌లతోపాటు సభ్యుడు ఎస్సీ సిన్హా విచారణలో పాల్గొన్నారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న అటవీ-పోలీసు అధికారుల పూర్తి వివరాలు ఈ నెల 22లోపు సమర్పించాలంటూ 13న జారీచేసిన ఆదేశాలను ప్రస్తావించిన కమిషన్.. ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని తప్పుపట్టింది. ఈ ఘటనపై సంబంధిత వివరాలను ఎక్కడా వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించిందని పోలీసు విభాగం అదనపు డీజీ(లీగల్) వినయ్ రంజన్ రే, డీజీపీ కార్యాలయం ప్రధాన న్యాయసలహాదారు ఎం.నాగరఘు కమిషన్ ముందు చెప్పారు. మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పరిశీలించిన కమిషన్ తామడిగిన వివరాలివ్వడంలో న్యాయస్థానానికి అభ్యంతరం లేదని, మీరే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఘటన తెల్లవారుజామున జరిగితే ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్)ను మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎందుకు నమోదు చేయలేదు? కూలీల దాడిలో గాయపడిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆరోజు ఉదయం 11 గంటలకే.. అది కూడా ఎఫ్ఐఆర్ లేకుండానే తీసుకెళ్లారా? ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్‌స్టేషన్ పరిధి విషయంలో గందరగోళం తలెత్తినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. తర్వాత బదిలీ చేసుకునే అవకాశాన్ని ఎందుకు పట్టించుకోలేదు?’’ అని కమిషన్ పోలీసు అధికారుల్ని ప్రశ్నించింది. ఘటనాస్థలికి ప్రత్యేక కమిటీ...: శేషాచలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వారం రోజుల్లోగా కమిషన్‌ద్వారా ప్రత్యేక కమిటీని ఘటనాస్థలికి పంపాలని ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది. ఈ కమిటీ ఘటనాస్థలిని సందర్శించిన అనంతరం రెండు వారాల్లోగా నివేదిక సమర్పిస్తుందని పేర్కొంది. పోలీసు అధికారులు రెండువారాల్లోగా ఉదంతానికి సంబంధించిన జనరల్ డైరీ ఎంట్రీ, అధికారుల వాహనాల కదలికలకు సంబంధించిన లాగ్‌బుక్, మృతదేహల పోస్టుమార్టం, రీ-పోస్టుమార్టం నివేదికలు, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారుల పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు, వినియోగించిన ఆయుధాల వివరాలు, పోలీసులకైన గాయాల వివరాలు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నమోదు చేసిన 302 కేసు ఎఫ్ఐఆర్ కాపీలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై వివరిస్తూ ఆరో తేదీ అర్ధరాత్రి(ఇంటర్వెన్షన్ నైట్ ఆఫ్ 6/7) అని అదనపు డీజీ వినయ్ రంజన్రే పేర్కొనగా, మృతుల తరఫున హాజరైన స్వచ్ఛంద సంస్థ పీపుల్స్వాచ్కు చెందిన హెన్రీ టొమంగో.. ‘పోలీసు రికార్డుల ప్రకారం ఎన్కౌంటర్ ఏడో తేదీ తెల్లవారుజామున జరిగినట్లు ఉంది. ఇప్పుడు అధికారులు నోరు జారి అసలు విషయం చెప్పారు. కూలీలను ఒకచోట అదుపులోకి తీసుకుని మరోచోట చిత్రహింసలకు గురిచేసి, విచక్షణారహితంగా కాల్చి చంపారనడానికి ఇది బలాన్నిస్తోంది’’ అని ఆరోపించారు. ఎన్కౌంటర్ చేయించింది చంద్రబాబే: హెన్రీ ఏప్రిల్ 6న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తిరుపతిలో పర్యటించారు. ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఎన్కౌంటర్ చేస్తేనే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చునంటూ సీఎం వారికి సూచనలిచ్చారు. ఆ ఒత్తిడి మేరకు ఆరోతేదీ సాయంత్రం తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. హింసించి, కాల్చిచంపారు. కూలీల్ని పోలీసులు హత్య చేయడానికి ప్రధాన కారకుడు చంద్రబాబే. ఇదే అంశాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లా. చంద్రబాబు 6న తిరుపతిలో ఉన్నారో లేదో.. సంబంధిత రికార్డుల ద్వారా పరిశీలించాలని కోరా. చంద్రబాబుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలి. - హెన్రీ టొమంగో, హ్యూమన్ రైట్స్ ఫోరమ్-పీపుల్స్‌వాచ్ ప్రతినిధి ఏం చేసినా చెల్లుతుందనే.. జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఎన్హెచ్ఆర్సీ కమిషన్ 1996లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. ఏపీలో ఎన్కౌంటర్ల అంశాన్ని లేవనెత్తాం. అరెస్టు చేసి, హింసించాక పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారని చెప్పాం. మా వాదనతో ఏకీభవించిన కమిషన్.. ఎన్కౌంటర్ జరిగితే అందులో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు పెట్టి.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇదే అలుసుగా పోలీసులు ఇష్టారాజ్యంగా ఎన్కౌంటర్లు చేస్తూ మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. మానవహక్కుల్ని ఉల్లంఘించే వారికి గుణపాఠం చెప్పాలని కమిషన్‌ను కోరాం. - జీవన్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ హ్యూమన్ రైట్స్ ఫోరమ్ నిబంధనల మేరకే దర్యాప్తు ఎన్కౌంటర్ చోటుచేసుకున్నాక నిబంధనల మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు వివరాలను వెల్లడించలేం. ఇదే అంశాన్ని కమిషన్‌కు చెప్పాం. - ఆర్పీ ఠాకూర్, అదనపు డీజీ(శాంతిభద్రతలు) కాల్చిచంపారని భావించవచ్చా? ‘‘ఈ ఘటన జాతీయస్థాయిలో సంచలనమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూలీలను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీసులవైపు నుంచి స్పందన లేదంటే... మీపై వస్తున్న ఆరోపణలు నిజమేనని భావించవచ్చా?’’ అని కమిషన్ ప్రశ్నించింది. ‘‘ఈ ఘటనలో పోలీసులకైన గాయాల వివరాలెందుకు ఇవ్వలేదు? వారిలో ఒక్కరికైనా తూటా గాయాలయ్యాయా?’’ అని నిలదీసింది. మొత్తం 11 మందికి గాయాలయ్యాయని, వీరిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. తీవ్రగాయాలంటే ఏంటో వివరాలు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఎన్కౌంటర్ జరగడానికి ముందు-ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ అధికారులకు సంబంధించిన వైర్లెస్ కమ్యూనికేషన్ అంశాలనూ తమ ముందుంచాలంది. ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలానందన్, ఎం.ఇలాంగోలను తమిళనాడులో న్యాయమూర్తి సమక్షంలో 164 స్టేట్మెంట్ రికార్డుకు ప్రయత్నాలు చేయాలని పేర్కొంది. -
ఆయుధమే లేదు..యుద్ధమెలా?
శేషాచలం అడవులు ఆధ్యాత్మికతకు, ఎర్రచందనం వృక్షాలకు పెట్టింది పేరు. ఇక్కడి వృక్షాలు ఎంతో విలువైనవి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు స్మగ్లర్లకు, ఎర్ర కూలీలకు స్థావరాలుగా మారాయి. ఎక్కడ చూసినా గొడ్డళ్ల చప్పుళ్లే. మోడువారిన వృక్షాలే.. తమిళ తంబీల దాటికి పోలీసులు సైతం అశువులు బాసుతున్నారు. బండలు ఎర్రబడుతున్నాయి. వీరిని కట్టడి చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అడవుల్లో సీసీ కెమెరాల నుంచి పోలీసులకు అత్యాధునిక ఆయుధాల వరకు సమకూర్చుతామని నాయకులు మాటిచ్చారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. కూంబింగ్‌కు వెళ్లిన అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం దొంగలు మారణాయుధాలతో తెగబడుతున్నారు. వారిపై ఆయుధాలు లేకుండా యుద్ధమెలా సాధ్యమో ఆ దేవుడికే తెలియాలి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు.. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటనలిచ్చారు. స్మగ్లర్లు.. వారికి సహకరించే అధికారులపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైళ్లలో పెడతామని హెచ్చరిం చారు. అటవీ, పోలీసుశాఖలతో ప్ర త్యేక దళాన్ని ఏర్పాటుచేసి శేషాచలం అడవులను జల్లెడ పడతామన్నారు. ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సం స్థ) సహకారంతో శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేసి.. ఎర్రచందనం వృక్షాలను నరికివేయకుండా అ డ్డుకట్ట వేస్తామన్నారు. వృక్షాలు విస్తారంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. వాటిని అనుసంధానం చేసి నిఘా ఏర్పాటుచేస్తామని స్పష్టీకరించారు. అటవీశాఖ అధికారులకు అధునాతన ఆయుధాలను అం దిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లిం గ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌కౌం టర్లకు కూడా వెనుకాడమని సంకేతాలు పంపారు. వారి మాటలన్నీ కార్యరూపం దాల్చి ఉంటే ఒక్క ఎర్రచందనం దుంగా శేషాచలం అడువుల నుంచి బయటకు వచ్చేది కాదని అటవీశాఖ అధికారవర్గాలే చెబుతున్నారు. అధికమైన స్మగ్లింగ్.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం కాదు కదా.. నాలుగు నెలల్లో మరింత అధికమైంది. వృక్షాలను నరకివేస్తున్న కూలీలను అడ్డుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. అటవీ అధికారుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో కూలీలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు అటవీ అధికారులు కూలీల చేతిలో హతమయ్యారు. అటవీ అధికారులను ఎర్ర కూలీలు, స్మగ్లర్లు పొట్టన పెట్టుకున్నాక పోలీసులు ఎన్‌కౌం టర్లకు తెరతీశారు. ఇప్పటిదాకా మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఎర్ర కూలీలను కాల్చి చంపారు. కానీ.. ఎర్రచందనం వృక్షాల నరికివేతకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. దీనికి ప్రధాన కారణం.. శేషాచలం అడవులపై నిఘా లేకపోవడమే. శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేయించడానికి ఇప్పటికీ ఇస్రో సహకారం కోరకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. అటవీ అధికారులకు అధునాతన ఆయుధాలను అందించలేదు. కూంబింగ్‌ను దాదాపుగా నిలిపేశారు. ఫలితంగా స్మగ్లర్లు తమిళ కూలీలతో యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికివేయిస్తున్నారు. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె అడవుల్లో ఎర్రచందనం వృ క్షాలను నరుకుతున్న 75 మంది తమిళ కూలీలను అడ్డుకోవడానికి అటవీశాఖ అధికారులు మంగళవా రం రాత్రి ప్రయత్నించారు. ఆయుధాలు లేకపోవడంతో అటవీ అధికారులపై కూలీలు దాడి చేశారు. రెండు రోజుల క్రితం మురకంబట్టు వద్ద శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం వృక్షాలను నరికివేయడానికి వస్తున్న తమిళ కూలీలను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చే శారు. కూలీలు పోలీసులు దాడిచేసి తప్పించుకుని శేషాచలం అడవుల్లో కి అడుగుపెట్టి యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నారు. కూలీలకు అడ్డుకట్ట వేయలేరా? తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా లో జివ్వాజిమలై, పోలూరు, తిరువళ్లూరు జిల్లాలో ఆర్కే పేట, పుదుమే డు, విల్లుపురం జిల్లాలో శంకరాపురం, వేలూరు జిల్లాలో గుడియాత్తం, పేర్నంబట్టు ప్రాంతాల్లోని గిరిజనులను ఎర్రచందనం వృక్షాలను నరికి.. రవాణా చేయడానికి స్మగ్లర్లు కూలీలు గా వాడుకుంటున్నారు. ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడానికి ఏడాదిగా శేషాచలం అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎర్రకూలీల దా డి.. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇప్పటిదాకా ఎనిమిదిమంది కూలీలు, ఇద్ద రు అటవీశాఖ అధికారులు మృతి చెందారు. ఎర్రచందనం కూలీలను శేషాచలం అడవుల్లోకి ప్రవేశించకుండా చేసేందుకు ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లపై పోలీసులు నిఘా వే శారు. కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి.. ఎన్కౌంటర్ చేసిన ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లను పోలీసులే అతికించారు. ఎర్రకూలీ లుగా వస్తే ఎన్కౌంటర్ చేస్తామని ెహ చ్చరించి.. గిరిజనులను చైతన్యం చేయడానికి ప్రయత్నించామని పో లీసులు చెబుతున్నారు. పోలీసులు వేసిన ఎత్తును ఎర్రదొంగలు ధనాస్త్రంతో చిత్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన కూలీ కుటుంబానికి రూ.పది లక్షల వంతున పరిహారం చెల్లిస్తున్నారు. గాయపడిన కూలీకి రూ.50 నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నారు. రోజువారీ కూలీ కింద రూ.ఐదు వేలను ఒక్కో కూలీకి చెల్లిస్తున్నారు. ఎర్రకూలీలు నివాసం ఉండే ప్రాంతంలో రోజువారీ కూలీగా రూ.150కి మించి ఇవ్వడం లేదు. స్మగ్లర్ల ధనాస్త్రానికి ఎర్రకూలీలు లొంగుతున్నారు. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ శేషాచలంలోకి ప్రవేశించి.. స్మగ్లర్ల కనుసైగల మేరకు ఎర్రచందనం వృక్షాలను నరికేసి, అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండడం గమనార్హం. -
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఎర్ర కూలీలు మృతి
ఓబులవారిపల్లె: వైఎస్సార్ కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో బుధవారం స్పెషల్‌పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లోని నీచుగుంత ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం కూంబింగ్ ప్రారంభించారు. పోలీసులను చూడగానే ఎర్రచందనం చెట్లు నరుకుతున్న తమిళనాడు కూలీలు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను స్వల్పంగా గాయపరిచారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.