ఆయుధమే లేదు..యుద్ధమెలా? | Red oak to thwart smuggling | Sakshi
Sakshi News home page

ఆయుధమే లేదు..యుద్ధమెలా?

Published Fri, Oct 17 2014 2:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఆయుధమే లేదు..యుద్ధమెలా? - Sakshi

ఆయుధమే లేదు..యుద్ధమెలా?

శేషాచలం అడవులు ఆధ్యాత్మికతకు, ఎర్రచందనం వృక్షాలకు పెట్టింది పేరు. ఇక్కడి వృక్షాలు ఎంతో విలువైనవి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు స్మగ్లర్లకు, ఎర్ర కూలీలకు స్థావరాలుగా మారాయి. ఎక్కడ చూసినా గొడ్డళ్ల చప్పుళ్లే. మోడువారిన వృక్షాలే.. తమిళ తంబీల దాటికి పోలీసులు సైతం అశువులు బాసుతున్నారు. బండలు ఎర్రబడుతున్నాయి. వీరిని కట్టడి చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అడవుల్లో సీసీ కెమెరాల నుంచి పోలీసులకు అత్యాధునిక ఆయుధాల వరకు సమకూర్చుతామని నాయకులు మాటిచ్చారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. కూంబింగ్‌కు వెళ్లిన అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం దొంగలు మారణాయుధాలతో తెగబడుతున్నారు. వారిపై ఆయుధాలు లేకుండా యుద్ధమెలా సాధ్యమో ఆ దేవుడికే తెలియాలి.      
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు.. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటనలిచ్చారు. స్మగ్లర్లు.. వారికి సహకరించే అధికారులపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైళ్లలో పెడతామని హెచ్చరిం చారు. అటవీ, పోలీసుశాఖలతో ప్ర త్యేక దళాన్ని ఏర్పాటుచేసి శేషాచలం అడవులను జల్లెడ పడతామన్నారు. ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సం స్థ) సహకారంతో శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేసి.. ఎర్రచందనం వృక్షాలను నరికివేయకుండా అ డ్డుకట్ట వేస్తామన్నారు. వృక్షాలు విస్తారంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. వాటిని అనుసంధానం చేసి నిఘా ఏర్పాటుచేస్తామని స్పష్టీకరించారు. అటవీశాఖ అధికారులకు అధునాతన ఆయుధాలను అం దిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లిం గ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌కౌం టర్లకు కూడా వెనుకాడమని సంకేతాలు పంపారు. వారి మాటలన్నీ కార్యరూపం దాల్చి ఉంటే ఒక్క ఎర్రచందనం దుంగా శేషాచలం అడువుల నుంచి బయటకు వచ్చేది కాదని అటవీశాఖ అధికారవర్గాలే చెబుతున్నారు.
 
అధికమైన స్మగ్లింగ్..

ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం కాదు కదా.. నాలుగు నెలల్లో మరింత అధికమైంది. వృక్షాలను నరకివేస్తున్న కూలీలను అడ్డుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. అటవీ అధికారుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో కూలీలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు అటవీ అధికారులు కూలీల చేతిలో హతమయ్యారు. అటవీ అధికారులను ఎర్ర కూలీలు, స్మగ్లర్లు పొట్టన పెట్టుకున్నాక పోలీసులు ఎన్‌కౌం టర్లకు తెరతీశారు. ఇప్పటిదాకా మూడు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఎర్ర కూలీలను కాల్చి చంపారు. కానీ.. ఎర్రచందనం వృక్షాల నరికివేతకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. దీనికి ప్రధాన కారణం.. శేషాచలం అడవులపై నిఘా లేకపోవడమే. శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేయించడానికి ఇప్పటికీ ఇస్రో సహకారం కోరకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. అటవీ అధికారులకు అధునాతన ఆయుధాలను అందించలేదు. కూంబింగ్‌ను దాదాపుగా నిలిపేశారు. ఫలితంగా స్మగ్లర్లు తమిళ కూలీలతో యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికివేయిస్తున్నారు.
     
చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె అడవుల్లో ఎర్రచందనం వృ క్షాలను నరుకుతున్న 75 మంది తమిళ కూలీలను అడ్డుకోవడానికి అటవీశాఖ అధికారులు మంగళవా రం రాత్రి ప్రయత్నించారు. ఆయుధాలు లేకపోవడంతో అటవీ అధికారులపై కూలీలు దాడి చేశారు.
     
రెండు రోజుల క్రితం మురకంబట్టు వద్ద శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం వృక్షాలను నరికివేయడానికి వస్తున్న తమిళ కూలీలను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చే శారు. కూలీలు పోలీసులు దాడిచేసి తప్పించుకుని శేషాచలం అడవుల్లో కి అడుగుపెట్టి యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నారు.
 
కూలీలకు అడ్డుకట్ట వేయలేరా?

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా లో జివ్వాజిమలై, పోలూరు, తిరువళ్లూరు జిల్లాలో ఆర్కే పేట, పుదుమే డు, విల్లుపురం జిల్లాలో శంకరాపురం, వేలూరు జిల్లాలో గుడియాత్తం, పేర్నంబట్టు ప్రాంతాల్లోని గిరిజనులను ఎర్రచందనం వృక్షాలను నరికి.. రవాణా చేయడానికి స్మగ్లర్లు కూలీలు గా వాడుకుంటున్నారు. ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడానికి ఏడాదిగా శేషాచలం అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ఎర్రకూలీల దా డి.. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇప్పటిదాకా ఎనిమిదిమంది కూలీలు, ఇద్ద రు అటవీశాఖ అధికారులు మృతి చెందారు. ఎర్రచందనం కూలీలను శేషాచలం అడవుల్లోకి ప్రవేశించకుండా చేసేందుకు ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లపై పోలీసులు నిఘా వే శారు. కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి.. ఎన్‌కౌంటర్ చేసిన ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లను పోలీసులే అతికించారు. ఎర్రకూలీ లుగా వస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని ెహ చ్చరించి.. గిరిజనులను చైతన్యం చేయడానికి ప్రయత్నించామని పో లీసులు చెబుతున్నారు. పోలీసులు వేసిన ఎత్తును ఎర్రదొంగలు ధనాస్త్రంతో చిత్తు చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్ లో చనిపోయిన కూలీ కుటుంబానికి రూ.పది లక్షల వంతున పరిహారం చెల్లిస్తున్నారు. గాయపడిన కూలీకి రూ.50 నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నారు. రోజువారీ కూలీ కింద రూ.ఐదు వేలను ఒక్కో కూలీకి చెల్లిస్తున్నారు. ఎర్రకూలీలు నివాసం ఉండే ప్రాంతంలో రోజువారీ కూలీగా రూ.150కి మించి ఇవ్వడం లేదు. స్మగ్లర్ల ధనాస్త్రానికి ఎర్రకూలీలు లొంగుతున్నారు. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ శేషాచలంలోకి ప్రవేశించి.. స్మగ్లర్ల కనుసైగల మేరకు ఎర్రచందనం వృక్షాలను నరికేసి, అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement