పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఎర్ర కూలీలు మృతి | Two workers killed in police firing | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఎర్ర కూలీలు మృతి

Published Thu, Aug 7 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

Two workers killed in police firing

ఓబులవారిపల్లె: వైఎస్సార్ కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో బుధవారం స్పెషల్‌పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లోని నీచుగుంత ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం కూంబింగ్ ప్రారంభించారు.

పోలీసులను చూడగానే ఎర్రచందనం చెట్లు నరుకుతున్న  తమిళనాడు కూలీలు రాళ్లు,  కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను స్వల్పంగా గాయపరిచారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement