- ఎంపీడీఓల పర్యవేక్షణలోనూ నిరాశే
- 10.72 లక్షల మందికి జాబ్‌కార్డులు
- 3.88 లక్షల మంది కూలీలకే పని
- జిల్లాలో 43.61 శాతం దాటని వైనం
- 100 రోజుల పని 15,878 కుటుంబాలకే
- పనులు గుర్తించడంలోనే అసలు నిర్లక్ష్యం
- ఫలితాలు ఇవ్వని ‘ఉపాధి’ మార్పులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భరోసా ఇవ్వడం లేదు. 2014-15 ఆర్థిక సం వత్సరం ముగియడానికి మరో 26 రోజులే ఉంది. కానీ, జిల్లాలో ఉపాధిహామీ పథకం లక్ష్యం 43.61 శాతానికే పరిమితమైంది. 10.72 లక్షల మంది జాబ్‌కార్డులు పొందిన కూలీలుం టే, ఇప్పటి వరకు అధికారులు 3.88 లక్షల మందికే ఉపాధి కల్పించారు.
ఈ ఏడాది కేవలం 15,878 కుటుంబాలకే 100 రోజులు పని కల్పించగలిగారంటే ఈ పథకం ఎంతగా నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం బాధ్యతలను ఎంపీడీఓలకు బదలాయించింది. ఈ మేరకు 2014 అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విజయవంతం కోసం గ్రామ, మండల స్థాయిలలో ఎంపీడీఓలు చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించింది.
ఈఓఆర్‌డీ, సూపరింటెండెంట్ సహా 11 కేటగిరీలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విధి విధానాలను కూడా సూచిం చింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలోని 9 జిల్లాలు, 443 మండలాలలో జాబ్‌కార్డున్న ప్రతి కూలీకి కనీసం 100 రోజుల పని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె. రేమండ్ పీటర్ ఆ ఉత్తర్వులో పేర్కొనగా, జిల్లాలో మాత్రం ‘ఉపాధి’ కూలీలకు ‘హామీ’ ఇవ్వలేకపోతోంది.
తప్పని కూలీల వలసబాట
ఉపాధిహామీ చట్టం-2005 ప్రకారం నమోదు చేసుకున్న కూలీలకు కనీసం 100 రోజులపాటు పని కల్పించాలన్న నిబంధన ఉంది. అధికారులు మాత్రం లక్ష్యసాధనకు అనేక ప్రతికూల పరిస్థితులను కారణాలుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు పనులు దొరుకక మళ్లీ వలసబాట పడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇ ప్పటికే మద్నూరు, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, కోటగిరి, బాన్సువాడ తదితర మండలాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ పలువురు ప్రజాప్రతి నిధులు ఉపాధిహామీ పథకం అమలుపై ప్రశ్నలు కు రిపించారు. మంగళవారం సమీక్ష జరిపిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సైతం కొందరు ఎంపీడీఓలు, పథకం అమలు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 2014-15లో రూ. 914 కోట్ల విలువ చేసే 82,135 పనులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టు కోగా, కేవలం 26,585 పనులను గుర్తిం చి రూ.180.19 కోట్ల మేరకు కూలీలకు చెల్లించారు. జిల్లాలో 720 గ్రామపంచాయతీలుంటే, ఇంకా 120 గ్రామ పంచాయతీలలో ఉపాధిహామీ పనులే మొదలుకాలేదు. పనులు గుర్తించడంలో నిర్లక్ష్యం కారణంగా బుధవారంనాటికి ఉపాధిహామీలో పాల్గొన్న కూలీకి రోజు కు సగటున రూ.109.47కు మించడం లేదు.
ప్రోగ్రాం ఆఫీసర్లు దృష్టిసారిస్తేనే
ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో 4,48,001 కు టుంబాలకు చెందిన 10.72 లక్షల మంది కూలీలకు జా బ్‌కార్డులు అందజేసిన అధికారులు అందరికీ ఉపాధి క ల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా రూ.557.62 కోట్లు ఖర్చు చేసేం దుకు ప్రణాళిక సిద్దమైనా, ఇప్పటి వరకు అందులో 26,585 పనులపై రూ.180.19 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
అయితే, ఉపాధిహామీ పథకం అమలు కోసం నిర్వాహకుల ప్రణాళికలు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో ఆచరించడం మాత్రం సాధ్యం కావడం లేదు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఉపాధిహామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలు ఎంపీడీఓలకు అప్పగించినా, వారు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే లక్ష్యసాధన సాధ్యమనే చర్చ ఉంది. ప్రోగ్రాం ఆఫీసర్లుగా అవతారమెత్తిన ఎంపీడీఓలు కూలీలకు ఇక ముందైనా భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు.
‘ఉపాధి’కి ఏదీ హామీ!
Published Thu, Mar 5 2015 2:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement