జియో ట్యాగింగ్‌లో గీసుకొండ స్టేట్‌ ఫస్ట్‌ | First State in geo-tagging gisukonda | Sakshi
Sakshi News home page

జియో ట్యాగింగ్‌లో గీసుకొండ స్టేట్‌ ఫస్ట్‌

Published Sun, Jan 1 2017 2:12 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

జియో ట్యాగింగ్‌లో గీసుకొండ స్టేట్‌ ఫస్ట్‌ - Sakshi

జియో ట్యాగింగ్‌లో గీసుకొండ స్టేట్‌ ఫస్ట్‌

ద్వితీయ స్థానంలో సంగెం మండలం
ఉద్యోగులను అభినందించిన కలెక్టర్‌


గీసుకొండ : ఉపాధి హామీ పథకంలో నాణ్యత, పారదర్శకతను చాటుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతీ పనిని  ‘భువన్‌’ యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేసే ప్రక్రియ చేపడుతున్న విషయం విదితమే. ఈ మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని గీసుకొండ మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 107.55 శాతం పనులను జియో ట్యాగ్‌ చేసి ప్రథమ స్థానంలో నిలవగా సంగెం మండలం 102.15 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఈ మేరకు హన్మకొండలో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌.. గీసుకొండ మండల అధికారులు, సిబ్బందిని అభినందించారని ఎంపీడీఓ వీరమల్ల సాయిచరణ్‌ తెలిపారు. ఉద్యోగుల కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఎంపీడీఓ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement