ఉపాధి కూలీలకు కొత్త జాబ్ కార్డులు
జనవరి నుంచి కార్డుల పంపిణీకి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈ జీఎస్) కూలీలకు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణ రుుంచింది. నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకో మారు కొత్త జాబ్‌కార్డు లను అందజేయాల్సి ఉన్నందున వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 56.39 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులుండగా, 1.28 కోట్ల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు.
మూడేళ్ల లో ఉపాధి పనులకు వచ్చేవారి జాబితాలను పరిశీలిస్తే 24 లక్షల కుటుంబాలకు చెందిన 40.92 లక్షల మంది మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకుంటు న్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉద్యాన పంటలకు సబ్సిడీ తదితర పథకాల కోసమే ఎక్కువమంది జాబ్‌కార్డులు తీసుకున్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరుగుతున్నా సగటు పనిదినాలు మాత్రం తక్కువగా కనిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఉపాధి పనులకు వచ్చేవారికి మాత్రమే కొత్తకార్డులను అందజేయాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు చేయాలని ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులను ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు.
మూడేళ్లలో ఒక్కరోజైనా పనికి రాకుంటే కార్డ్ కట్!
ఇప్పటికే కార్డులు పొంది మూడేళ్లలో ఒక్కరోజు కూడా ఉపాధి పనులకు వెళ్లని కుటుంబాలను కొత్త కార్డుల జాబితాలో నుంచి తొలగించాలని నిర్ణరుుంచారు. తాత్కాలిక వలసల కారణంగా ఒకేపేరుతో పలుచోట్ల జాబ్‌కార్డులు పొందినవారి పేర్లను కూడా ప్రస్తుతముంటున్న జిల్లాలో మినహా మిగతా చోట్ల తొలగించను న్నారు. ప్రస్తుతం పనులకు వస్తున్న వారితోపాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన పేద యువతీ, యువకులకు, ఆయా గ్రామాలకు కొత్తగా వచ్చిన కోడళ్లకు, శాశ్వతంగా వలస వచ్చిన కుటుంబాలకు కొత్తకార్డులను జారీ చేయనున్నారు. అర్హులైన కూలీలందరికీ జాబ్‌కార్డులిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.