job cards
-
‘ఉపాధి’లో గోల్మాల్ : జాబ్ కార్డులపై దీపికా, జాక్వెలిన్ ఫోటోలు
భోపాల్ : జాతీయ ఉపాథి హామీ పథకానికి సంబంధించి మధ్యప్రదేశ్‌లో మరో గోల్మాల్ చోటుచేసుకుంది. జిర్న్యా జిల్లా పిపర్‌ఖేడా నకా పంచాయితీలో సర్పంచ్, కార్యదర్శి కలిసి బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటోలతో పథకం లబ్ధిదారుల పేరిట నకిలీ జాబ్ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ఆయా ఖాతాల నుంచి డబ్బు తీసుకునేందుకు నకిలీ జాబ్ కార్డులను ఉపయోగించారు. మోనూ దూబే జాబ్ కార్డుపై దీపికా పడుకోన్ ఫోటోను ఉపయోగించారు. మోనూ దూబే పనికి వెళ్లకపోయినా ఆయన పేరుతో నకిలీ జాబ్ కార్డు ఉపయోగించి 30 వేల రూపాయలను డ్రా చేశారు. ప్రతినెలా ఈ నిర్వాకం యదేచ్ఛగా సాగించారు. ఇక సోను అనే మరో లబ్ధిదారు పేరిట జాబ్ కార్డుపై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో ఉపయోగించారు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడంతో అక్రమ వ్యవహారం గుట్టు రట్టయింది. జాతీయ ఉపాథి హామీ పథకం కింద తమకు ఎలాంటి పనులు రాకపోయినా సర్పంచ్, కార్యదర్శి, ఉపాథి హామీ అసిస్టెంట్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని కార్మికులు వాపోయారు. నకిలీ జాబ్ కార్డులు సృష్టించి ఆయా ఖాతాల నుంచి సొమ్మును మాయం చేసిన ఘటనపై జిల్లా పంచాయితీ సీఈవో గౌరవ్ బెనల్ విచారణకు ఆదేశించారు. చదవండి : ఒంటరి మహిళపై సామూహిక లైంగిక దాడి -
బ్లూఫ్రాగ్.. ఫ్రాడ్
ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం నిబంధనలకు విరుద్ధం. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ ఉపాధి హామీ పథకం) డేటా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సర్వర్లలో ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకం. గత ప్రభుత్వంలో దీనిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితమైన బ్లూఫ్రాగ్ కంపెనీకి ఉపాధి హామీ పథకం డేటాను, యాప్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. పర్యవసానంగా సదరు కంపెనీకి గత ప్రభుత్వం నుంచి భారీగా ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఉపాధి హామీ కూలీల డేటా మొదలుకుని యాప్ ద్వారా తీసుకునే హాజరు, చెల్లింపుల వరకు అంతా వారి పర్యవేక్షణలోనే జరుగుతోంది. ప్రైవేట్‌ది కావడంతో తరచూ సమస్యలు వస్తుండడంతో యాప్ నిర్వహణే ఇబ్బందిగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని 46 మండలాల్లో 3,92,410 జాబ్ కార్డులున్నాయి. వీటి ఆధారంగా ఉపాధి హామీ పనులు కూలీలకు కేటాయిస్తుంటారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న 661 మండలాల్లో 61,48,411 మందికి ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులున్నాయి. ఈ క్రమంలో ఏటా వీరిలో కొందరికి ఉపాధి హామీ పనులు ఆయా మండలాల్లోని గ్రామాల్లో కేటాయిస్తుంటారు. సగటున ఒక్క రోజుకు ఒక్కొకరికి కూలి రూ.200 వరకు ఇస్తుంటారు. రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధి హామీ కూలీల నిర్వహణ, ఇతర వివరాలు నమోదు చేసే యాప్ తయారీ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఈ క్రమంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పర్యవేక్షించిన పంచాయతీ రాజ్ శాఖలోని వివిధ పథకాలు, యాప్స్ తయారీ బాధ్యతలు అప్పగించిన బ్లూఫ్రాగ్ కంపెనీకే దీనిని అప్పగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన బాధ్యత, నిర్వహణ అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు, జాబ్ కార్డుల జారీ, ఉపాధి కూలీల హాజరు ఇలా అన్నింటినీ ప్రైవేట్ కంపెనీ యాప్ ద్వారానే నిర్వహించేలా డిజైన్ చేశారు. దీనికి బ్లూఫ్రాగ్‌తో పాటు టీసీఎస్ జాయింట్ వెంచర్‌గా కేటాయించారు. దీనిలో బ్లూఫ్రాగ్ కంపెనీ ఉపాధి హామీ పథకం కోసం తొమ్మిది రకాల సేవలకు గానూ 15 యాప్స్‌ను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి యాప్స్ తయారీ కోసం బిల్లులు తీసుకున్నారు. ఈ క్రమంలో డేటా అంతా బ్లూఫ్రాగ్ సర్వర్ల ద్వారా మెయింటెనెన్స్ చేస్తూ సర్వర్‌లో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో టీసీఎస్‌కు డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి జాబ్ కార్డు వివరాలు బ్లూఫ్రాగ్‌తో పాటు టీసీఎస్ వద్ద ఉంటాయి. పథకం అమలుకు సంబంధించి యూజర్ రిజిస్ట్రేషన్, వర్క్ డిమాండ్ రిజిస్ట్రేషన్, పని కేటాయింపు, పని నిర్వహణ, హాజరు నమోదు, హాజరును పరిశీలించిడం, పని విలువ, దాని పరిశీలన, తదితర సేవల కోసం 15 రకాల యాప్స్‌ను సిద్ధం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో డ్వామా అధికారులు ఉపాధి హామీ వివరాలు యాప్‌లో నమోదులో సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఒక రోజు ముందు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం రెండు మూడు గంటలు కసరత్తు చేస్తే కానీ వివరాలు నమోదు కాకపోవడం తదితర ఇబ్బందులు ఉన్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. విలువైన ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. కర్ణాటక. తమిళనాడు, కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. సర్వర్ల, యాప్ నిర్వహణ అన్ని ఎన్‌ఐసీనే చూసుకుంటుంది. దానికి సంబంధించిన యాక్సెస్ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్వర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఉపాధి హామీ డేటాను సదరు ప్రైవేట్ సంస్థలు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునేలా యాక్సెస్ కంపెనీకి మాత్రమే ఉంది. ప్రభుత్వానికి యాక్సెస్ లేదు. అలాగే డేటా వేరే వారికి బదలాయించడం చట్టరీత్యా నేరం. మన రాష్ట్రంలో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో డేటా టీసీఎస్‌కు ఆటోమెటిక్‌గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారు. దీనిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకుని ఎన్ఐసీకి అప్పగిస్తే ఖజానాకు భారం తగ్గడంతో పాటు డేటా అంతా ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదిక ఇటీవల కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు డ్వామా అధికారులతో సమీక్ష నిర్వహించిన లోపాలపై చర్చించిన క్రమంలో విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కలెక్టర్ పంచాయతీ రాజ్ కమిషనర్‌కు దీనిపై సమగ్ర నివేదిక పంపారు. యాప్‌లోని ఇబ్బందులు మొదలుకుని అన్ని అంశాలపై సమగ్ర నివేదిక పంపారు. -
ఉపాధి పేరుతో స్వాహా!
పిఠాపురం: ఎప్పుడూ కూలికి వెళ్లని గృహిణి పేరున వేల రూపాయలు బ్యాంకు అక్కౌంటులో జమవుతున్నాయి ... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా పనులు చేయకుండానే ఉపాధి కూలీలుగా రికార్డుల్లో నమోదవుతూ బ్యాంకు అకౌంట్లలో వేలకువేల రూపాయలు జమవుతున్నాయి. జాబ్ కార్డు ఉండి కూడా సంవత్సరాల తరబడి పని లేక అధికారుల చుట్టూ తిరుగుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నా వారికి పని కల్పించడం లేదు. పని చేసి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మరెందరో రోదన. స్నేహాన్ని బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కావల్సిన వారికి జాబ్ కార్డులు ఇప్పించి వారి పేరున రూ.కోటికిపైగా దోపిడీ చేసినా ఆ విషయం సామాజిక తనిఖీల్లో బయటపడినా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. బహిరంగంగా అవినీతికి పాల్పడినా అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడం... ఏ ఒక్క అధికారీ చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుండడంతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరిలో అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో ఇలా అక్రమాలు చోటుచేసుకున్నా తనిఖీలకు వచ్చిన కేంద్ర బృందానికి మాత్రం అధికారులు అరచేతిలో స్వర్గం చూపించారు. బాగా చేసిన పనుల వద్దకు తీసుకువెళ్లి చూపించి అహో అనిపించారన్న విమర్శలున్నాయి. సామాజిక తనిఖీలలోనూ మసిపూసి మారేడుకాయ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఇదిగో అవినీతి : కొత్తపల్లి మండలం కొమరగిరిలో 1139 జాబ్ కార్డులున్నాయి. ఈ ఏడాది 366 పనులు నిర్వహించగా రూ.1,07,17, 157 గ్రూపులకు చెందిన 1806 మంది కూలీలకు 37,255 పని దినాలు కల్పించినట్టు రికార్డుల్లో రాసి వేతనాలుగా చెల్లించారు. ∙సన్నిబోయిన కృష్ణ కుమార్. ఈయన ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. కానీ ఇతని పేరున ఉపాధి కూలీ జాబ్ కార్డు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన పేరున బ్యాంకు అక్కౌంటు నంబరు 32500283855 (ఎస్బీఐ కొమరగిరి)లో ఉపాధి కూలీగా సుమారు రూ.30 వేల సొమ్ము జమయింది. ∙కొమరగిరి శివారు ఆనందనగరానికి చెందిన బర్రె శిరీష. ఈమె వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తోంది. ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 33541674172 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ. 25 వేలు జమ చేశారు. ∙పిఠాపురంలోని ఓ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్న సాకా ప్రేమ సూర్యావతికి ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 31942977225 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ.40 వేలు జమ చేశారు. ఎప్పుడు కూలికి వెళ్లని గృహిణి కె.ఝాన్సీరాణి ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 20128460793 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ.20 వేలు జమ చేశారు. ∙గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న నక్కా లోవ ప్రసాద్ ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆయన అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 3273997893 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు సుమారు రూ.15 వేలు జమ చేశారు. ఇవి కొన్ని మాత్రమే ఇలాంటివి కొమరగిరిలో కోకొల్లలు. ఎవరి పేరున జాబ్‌కార్డు ఉందో ఎంతమందికి ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉపాధి పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాబ్ కార్డుల్లోనూ మాయాజాలం... కొందరు ఉద్యోగులు, ఆటో వాలాలు, గృహిణులు తదితరుల పేరున జాబ్‌కార్డులు సృష్టించి వారి ఖాతాలకు ఉపాధి నిధులు మళ్లించి వాటిని ఆయా కార్డు హోల్డర్ల ద్వారానే నిధులు డ్రా చేయించి స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఉపాధి హామీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతో తమకు నమ్మకమైన వ్యక్తులు బంధువులు, స్నేహితులకు జాబ్‌కార్డులు ఇప్పిస్తున్నారు. వారి ఖాతాలకు ఉపాధి పని చేసినట్లుగా కూలీ డబ్బులు వేయించి వారి సహకారంతో డ్రా చేసుకుంటున్నట్లు ఒక ఆటో డ్రైవరు ఉన్నతాధికారుల సమక్షంలో నిజాలను బయటపెట్టినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో సంబంధితాధికారులు నోరు మెదపడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. -
మైనర్లకు ‘ఉపాధి’ జాబ్ కార్డులు!
పశ్చిమగోదావరి, దెందులూరు : కండ్రిగ నరసింహపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కేఎన్.పురం కమ్యూనిటీ హాలులో ఉపాధి హామీ పథకం ఏపీడీ వరప్రసాద్ విచారణ చేశారు. కలెక్టర్ భాస్కర్‌కు ‘మీ కోసం’ కార్యక్రమంలో గ్రామస్తులు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని మైనర్లకు ఉపాధి కూలీలుగా గుర్తింపు కార్డులు (జాబ్ కార్డులు), ఉద్యోగులకు మస్తర్లు, పనికి వెళ్లని వారికి మస్తర్లు వేసి పేదలకు అందాల్సిన ఉపాధి హామీ నగదు అనర్హులకు, పనిచేయని వారికి ఇస్తున్నారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ ఏపీడీ వరప్రసాద్‌ను విచారణ నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం వరప్రసాద్, ఎంపీడీఓ ఆర్. శ్రీదేవి, ఈసీ శ్రీనివాస్‌లు విచారణ నిర్వహించారు. అయితే విచారణపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారు లేకుండా విచారణ చేశారని, వారు ఉంటే విచారణలో మరిన్ని ఆధారాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చేవని తెలిపారు. నోటీసు లేకుండా ఏకపక్షంగా విచారణ జరిగినట్టే భావిస్తున్నామని చెప్పారు. మైనర్లకు జాబ్‌కార్డులు ఇచ్చి, ఉద్యోగస్తులు మస్తర్లు వేస్తూ పేదలకు అందాల్సిన ప్రభుత్వ సొమ్మును దిగమింగుతున్నారని మండిపడ్డారు. -
ఏపీలో 2.55 లక్షల జాబ్‌కార్డుల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో 2.55 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాం కృపాల్ యాదవ్ తెలిపారు. తగిన తనిఖీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. వివిధ కారణాల వల్ల వీటిని అర్హత లేని జాబ్కార్డులుగా గుర్తించినట్టు తెలిపారు. కుటుంబం స్థానికంగా లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ కార్డులను తొలగించినట్టు తెలిపారు. -
పని చేస్తేనే ఉపాధి కార్డులు
జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులు3.32 లక్షలు • వినియోగంలో ఉన్నవి 1.28 లక్షలు • ప్రభుత్వ నిర్ణయంతో రద్దయ్యేవి సుమారు 2 లక్షలు • 15 రోజుల్లో కొత్త కార్డులు ఖమ్మం మయూరిసెంటర్ : ఉపాధి హామీ పథకంలో ఇక నుంచి పనిచేసే వారికే జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిచేయని వారి కార్డులను తొలగించనుంది. అర్హులందరికీ పని కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు పదిహేను రోజుల్లో కొత్త కార్డులు ఇవ్వనుంది. జాబ్‌కార్డు పొందినవారిలో సగం మంది పనులకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో పనిచేసేవారికే జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 3.32 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 1.28 లక్షల కార్డులు మాత్రమే అత్యధిక పనులు చేసిన జాబితాలో ఉన్నాయి. మొత్తం 7.75 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకోగా 2.28 లక్షల మంది మాత్రమే ఉపాధి పనికి హాజరవుతున్నారు. దీంతో ఉపాధి పనిని వినియోగించుకునేవారికి కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 2 లక్షల కార్డులు రద్దు కానున్నాయి. పథకాల కోసమే కార్డులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేందుకే జిల్లాలో జాబ్ కార్డులను ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో రాయితీ కల్పిస్తుండడంతో పాటు టాయిలెట్ల నిర్మాణం, ఇంకుడు గుంటలు, పొలంలో నాటేందుకు టేకు మొక్కలు వంటివి కార్డుదారులకు అందిస్తున్నారు. దీంతో చాలా మంది వీటికోసం కార్డులు తీసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న పనికి వెళ్ళడం లేదు. కొందరు ఒకరిపై కార్డు తీసుకొని ఇంకొకరు పనికి వెళ్తున్నారు. వీటన్నింటికి చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులను రద్దు చేసి ప్రభుత్వం నూతన కార్డులు ఇవ్వనుంది. మూడు రకాలుగా ఆదివాసీలకు గ్రీన్‌కార్డు, వికలాంగులకు లైట్‌బ్లూ, సాధారాణ కూలీలకు బ్లూ కార్డులు ఇవ్వనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న పని రోజుల్లో సగానికి పైగా పని దినాలు ఉపయోగించుకుంటేనే కార్డులు ఇవ్వనున్నారు. జాబ్‌కార్డులు రాగానే పనులు ప్రారంభించేందుకు యంత్రాం గం ప్రణాళికలు రూపొందించింది. అర్హులకు మాత్రమే కార్డులు ఉపాధి పథకాన్ని వినియోగించుకుని పని చేసే కూలీలకు మాత్రమే జాబ్‌కార్డులు అంది స్తాం. 2015–16 సంవత్సరంలో 45 లక్షల పనిదినాలకు 43.5 లక్షల పని దినాల పని జరిగింది. ప్రతి కూలికీ వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని వారి కార్డులను రద్దు చేస్తాం. – మురళీధర్‌రావు, డీఆర్డీఓ పని చేసేవారికి ఇస్తేనే ప్రయోజనం పని చేసేవారికే జాబ్‌కార్డు విధానం మంచిది. ఈ నిర్ణయంతో అర్హులకు కార్డుతో పాటు 100 రోజుల పని లభిస్తుంది. కూలీలు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకొని అవకాశం ఉంటుంది. నూతన విధానాలతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. – మరికంటి నరేష్, ఉపాధి మేట్ -
ఉపాధి కూలీలకు కొత్త జాబ్ కార్డులు
జనవరి నుంచి కార్డుల పంపిణీకి సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈ జీఎస్) కూలీలకు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణ రుుంచింది. నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకో మారు కొత్త జాబ్‌కార్డు లను అందజేయాల్సి ఉన్నందున వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 56.39 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులుండగా, 1.28 కోట్ల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. మూడేళ్ల లో ఉపాధి పనులకు వచ్చేవారి జాబితాలను పరిశీలిస్తే 24 లక్షల కుటుంబాలకు చెందిన 40.92 లక్షల మంది మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకుంటు న్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉద్యాన పంటలకు సబ్సిడీ తదితర పథకాల కోసమే ఎక్కువమంది జాబ్‌కార్డులు తీసుకున్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరుగుతున్నా సగటు పనిదినాలు మాత్రం తక్కువగా కనిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఉపాధి పనులకు వచ్చేవారికి మాత్రమే కొత్తకార్డులను అందజేయాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు చేయాలని ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులను ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. మూడేళ్లలో ఒక్కరోజైనా పనికి రాకుంటే కార్డ్ కట్! ఇప్పటికే కార్డులు పొంది మూడేళ్లలో ఒక్కరోజు కూడా ఉపాధి పనులకు వెళ్లని కుటుంబాలను కొత్త కార్డుల జాబితాలో నుంచి తొలగించాలని నిర్ణరుుంచారు. తాత్కాలిక వలసల కారణంగా ఒకేపేరుతో పలుచోట్ల జాబ్‌కార్డులు పొందినవారి పేర్లను కూడా ప్రస్తుతముంటున్న జిల్లాలో మినహా మిగతా చోట్ల తొలగించను న్నారు. ప్రస్తుతం పనులకు వస్తున్న వారితోపాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన పేద యువతీ, యువకులకు, ఆయా గ్రామాలకు కొత్తగా వచ్చిన కోడళ్లకు, శాశ్వతంగా వలస వచ్చిన కుటుంబాలకు కొత్తకార్డులను జారీ చేయనున్నారు. అర్హులైన కూలీలందరికీ జాబ్కార్డులిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉపాధి కల్పన
కార్యరూపం దాల్చని వందరోజుల ఉపాధి పని ఉస్సూరంటూ వలస బాట విశాఖపట్నం జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నాయి. వంద రోజుల పని కల్పన కలగా మారుతోంది. ఉపాధికి వెళ్త్తే చేతి నిండా కూలి దక్కుతుందన్న నమ్మకం లేదు. బోలెడు పని దినాలు కల్పిస్తున్నా పది శాతం మందికి కూడా వంద రోజుల పనిదొరకడం లేదు. దీంతో కూలీలు వలస బాటపడుతున్నారు. జిల్లాలో 5.98 లక్షల జాబ్‌కార్డులుండగా,వాటి పరిధిలో 13.56 లక్షల కూలీలు న్నారు.యాక్టివ్‌జాబ్‌కార్డులు 3.44 లక్షలుంటే దాంట్లో క్రమం తప్పకుండా పనులకు వచ్చే కూలీలు 6.52 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2015-16లో అక్టోబర్ నెలాఖరు నాటికి కోటి 74 లక్షల పనిదినాలు కల్పించాల్సిఉండగా ఇప్పటివరకు కోటి 57 లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లాలో ఈ ఏడాది ఒక కూలీ సరాసరిన రూ.129.43లకు మించి దక్కలేదు. జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి సరాసరిన 53.48 రోజులు మాత్రమే పని కల్పించగలిగారు. వందరోజుల పనిదినాలు దక్కింది 35,361 మందికి మాత్రమే. వేతనాలు, మెటీరియల్ రూపంలో ఇప్పటి వరకు రూ. 250.25 కోట్లు ఖర్చుచేశారు. గతేడాది ఇదేసమయానికి కోటి 98లక్షల 74వేల పని దినాలు కల్పించారు. వందరోజుల పని కల్పన కూడా కూలీలకు కలగానేమారుతోంది. గత ఆర్ధిక సంవత్సరంలో 60,744 మందికి వంద రోజులు పని కల్పిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 35,361మందికి మాత్రమే కల్పించారు. కుటుంబానికి 2012-13లో 70.78 రోజుల పని .. 2013-14లో 65.31 రోజుల పని కల్పించారు. గత ఆర్ధిక సంవత్సరంలో 64.61 రోజులు.. ఈ ఏడాది ఇప్పటి వరకు 53 రోజులు మాత్రమే పని కల్పించారు. గతేడాదితో పోలిస్తే పనులు వేగం తగ్గిన మాట వాస్తమేనని, గడువున్నందున లక్ష్యానికి మించి పనులు కల్పిస్తామని డ్వామా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉపాధి‘లో జిల్లా ఫస్ట్
రికార్డు స్థాయిలో పనుల కల్పన కూలీలకు 1.91కోట్ల పనిదినాలు విశాఖపట్నం : ఉపాధి హామీ అమలులో జిల్లా దూసుకెళ్తోంది. పనుల కల్పనలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఉపాధి కూలీలకు 1.8 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని ఏకంగా కోటి 91 లక్షల 95 వేల 614 పనిదినాలు కల్పించి జిల్లా నీటియాజమాన్య సంస్థ రికార్డు సృష్టించింది. ఉపాధి పనుల కల్పన కోసం రాష్ర్టంలో ఏ జిల్లాలోనూ ఖర్చుచేయని రీతిలో 301 కోట్ల 87లక్షల 79వేలు ఖర్చు చేశామని డ్వామా పీడీ ఆర్.శ్రీరాముల నాయుడు బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ స్థాయిలో పనులు కల్పించడం, ఉపాధి పనుల కోసం ఒకే ఏడాదిలో 300 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఇదే తొలిసారన్నారు. వీటిలో కూలీలకు వేతనాల రూపంలోనే అత్యధికంగా 231కోట్ల 61లక్షల 39వేలు చెల్లించగా, మెటీరియల్ అండ్ స్కిల్డ్ కోసం 54 కోట్ల 44 లక్షలు, కంటింజెంట్ ఖర్చుల కింద రూ.15.81కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో 4,68,141 కుటుంబా లకు జాబ్‌కార్డులు జారీచేయగా, 38,032 శ్రమశక్తి సంఘాల పరిధిలో 6,72,944 మంది కూలీలున్నారని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 30,063 శ్రమశక్తి సంఘాల్లోని 3,02, 551 కుటుంబాల పరిధిలోని 5లక్షల 43వేల 39 మందికి రికార్డుస్థాయిలో ఏకంగా కోటి 91 లక్షల 95వేల 614 పనిదినాలు కల్పించామన్నారు. 2లక్షల 58 వేల 321 మంది పురుషులుకాగా, 2లక్షల 84వేల 718 మంది మహిళా కూలీలు పనులు పొందారన్నారు. వీరిలో 29,186 మంది ఎస్సీలుకాగా, 2 లక్షల 52వేల 715 మంది ఎస్టీలు, లక్షా 66 వేల 127మంది బీసీలు ఉన్నారన్నారు. ఇంకా 14.49కోట్ల విలువైన పనులను 66,617 మంది కూలీలు చేస్తున్నారని తెలిపారు. 50,257 మంది కూలీలకు ఏడాదిలో 100 రోజుల పైబడి పనులు కల్పించామన్నారు. వీరికి అదనంగా మరో 50రోజుల ఉపాధి పొందారన్నారు. -
‘ఉపాధి’కి ఏదీ హామీ!
- ఎంపీడీఓల పర్యవేక్షణలోనూ నిరాశే - 10.72 లక్షల మందికి జాబ్‌కార్డులు - 3.88 లక్షల మంది కూలీలకే పని - జిల్లాలో 43.61 శాతం దాటని వైనం - 100 రోజుల పని 15,878 కుటుంబాలకే - పనులు గుర్తించడంలోనే అసలు నిర్లక్ష్యం - ఫలితాలు ఇవ్వని ‘ఉపాధి’ మార్పులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భరోసా ఇవ్వడం లేదు. 2014-15 ఆర్థిక సం వత్సరం ముగియడానికి మరో 26 రోజులే ఉంది. కానీ, జిల్లాలో ఉపాధిహామీ పథకం లక్ష్యం 43.61 శాతానికే పరిమితమైంది. 10.72 లక్షల మంది జాబ్‌కార్డులు పొందిన కూలీలుం టే, ఇప్పటి వరకు అధికారులు 3.88 లక్షల మందికే ఉపాధి కల్పించారు. ఈ ఏడాది కేవలం 15,878 కుటుంబాలకే 100 రోజులు పని కల్పించగలిగారంటే ఈ పథకం ఎంతగా నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం బాధ్యతలను ఎంపీడీఓలకు బదలాయించింది. ఈ మేరకు 2014 అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విజయవంతం కోసం గ్రామ, మండల స్థాయిలలో ఎంపీడీఓలు చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించింది. ఈఓఆర్డీ, సూపరింటెండెంట్ సహా 11 కేటగిరీలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విధి విధానాలను కూడా సూచిం చింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలోని 9 జిల్లాలు, 443 మండలాలలో జాబ్‌కార్డున్న ప్రతి కూలీకి కనీసం 100 రోజుల పని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె. రేమండ్ పీటర్ ఆ ఉత్తర్వులో పేర్కొనగా, జిల్లాలో మాత్రం ‘ఉపాధి’ కూలీలకు ‘హామీ’ ఇవ్వలేకపోతోంది. తప్పని కూలీల వలసబాట ఉపాధిహామీ చట్టం-2005 ప్రకారం నమోదు చేసుకున్న కూలీలకు కనీసం 100 రోజులపాటు పని కల్పించాలన్న నిబంధన ఉంది. అధికారులు మాత్రం లక్ష్యసాధనకు అనేక ప్రతికూల పరిస్థితులను కారణాలుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు పనులు దొరుకక మళ్లీ వలసబాట పడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇ ప్పటికే మద్నూరు, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, కోటగిరి, బాన్సువాడ తదితర మండలాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ పలువురు ప్రజాప్రతి నిధులు ఉపాధిహామీ పథకం అమలుపై ప్రశ్నలు కు రిపించారు. మంగళవారం సమీక్ష జరిపిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సైతం కొందరు ఎంపీడీఓలు, పథకం అమలు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 2014-15లో రూ. 914 కోట్ల విలువ చేసే 82,135 పనులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టు కోగా, కేవలం 26,585 పనులను గుర్తిం చి రూ.180.19 కోట్ల మేరకు కూలీలకు చెల్లించారు. జిల్లాలో 720 గ్రామపంచాయతీలుంటే, ఇంకా 120 గ్రామ పంచాయతీలలో ఉపాధిహామీ పనులే మొదలుకాలేదు. పనులు గుర్తించడంలో నిర్లక్ష్యం కారణంగా బుధవారంనాటికి ఉపాధిహామీలో పాల్గొన్న కూలీకి రోజు కు సగటున రూ.109.47కు మించడం లేదు. ప్రోగ్రాం ఆఫీసర్లు దృష్టిసారిస్తేనే ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో 4,48,001 కు టుంబాలకు చెందిన 10.72 లక్షల మంది కూలీలకు జా బ్కార్డులు అందజేసిన అధికారులు అందరికీ ఉపాధి క ల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా రూ.557.62 కోట్లు ఖర్చు చేసేం దుకు ప్రణాళిక సిద్దమైనా, ఇప్పటి వరకు అందులో 26,585 పనులపై రూ.180.19 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఉపాధిహామీ పథకం అమలు కోసం నిర్వాహకుల ప్రణాళికలు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో ఆచరించడం మాత్రం సాధ్యం కావడం లేదు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఉపాధిహామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలు ఎంపీడీఓలకు అప్పగించినా, వారు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే లక్ష్యసాధన సాధ్యమనే చర్చ ఉంది. ప్రోగ్రాం ఆఫీసర్లుగా అవతారమెత్తిన ఎంపీడీఓలు కూలీలకు ఇక ముందైనా భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
నీరసించిన ఉపాధి
సీజన్ ముగుస్తున్నా ఊపందుకోని పనులు పనుల్లేక అల్లాడుతున్న కూలీలు డిసెంబర్-ఫిబ్రవరి మధ్య గతేడాది 39.36 లక్షల పనిదినాలు, 3.73 లక్షల మందికి పనులు ఈ ఏడాది అదే సీజన్లో 8.24 లక్షల పనిదినాలు, 90 వేల మందికే పనులు పేరుకుపోయిన రూ.3.5 కోట్ల బకాయిలు అడిగిన వారికల్లా ఉపాధి కల్పించాలన్న ఆశయంతో ప్రారంభించిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అడిగినవారికి దేవుడెరుగు.. అసలు పనుల కల్పనే ఆశించినస్థాయిలో జరగడం లేదు. పనుల్లేక ఉపాధి కూలీలు అల్లాడి పోతున్నారు. ఒక పక్క ఉపాధి పనుల్లేక..మరోపక్క వ్యవసాయ పనుల్లేక వలసబాట పట్టే పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నం: ఉపాధి హామీ పథకం గ్రామీణ జిల్లాలోని 39 మండలాల్లో అమలవుతోంది. ఈ పథకం కింద 4,69,090 జాబ్‌కార్డులు జారీచేశారు. జిల్లాలో 31,503 శ్రమ శక్తి సంఘాలు (ఎస్ఎస్ఎస్) ఉండగా వాటిపరిధిలో 6,74,809 మంది కూలీలున్నారు. ఏటా డిసెంబర్లో ఉపాధి పనులు ప్రారంభమవుతుంటాయి. సరాసరిన నాలుగులక్షల మంది కూలీలకు డిసెంబర్ -మార్చి లోపు ఏటా 70 లక్షలకు పైగా పనిదినాలు కల్పిస్తుంటారు. వీరికి వేతనాల కింద సుమారు 75 కోట్ల వరకు చెల్లిస్తుంటారు. కానీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 20 వరకు చూస్తే ఇప్పటి వరకు కేవలం 90,056 మంది కూలీలకు 8,24,006 పనిదినాలు మాత్రమే కల్పించగలిగారు. అదే గతేడాది(2013-14)లో ఇదే సీజన్లో డిసెంబర్- ఫిబ్రవరిల మధ్య 3,73,466మంది కూలీలకు 39.36లక్షల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.39.57కోట్లు చెల్లించారు. కానీ ఈ ఏడాది ఇదే సీజన్లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు రూ.9.31కోట్లు మాత్రమే. జనవరి నుంచి పనిచేసిన సుమారు 35 వేల మంది కూలీలకు రూ.3.50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో... 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇదే సీజన్లో నెల వారీగా చూస్తే డిసెంబర్లో 50,527మంది కూలీలకు 6,59,180 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనం కింద రూ.6 కోట్ల 65 లక్షల 90 వేలు చెల్లించారు. జనవరిలో 1,19,688 మంది కూలీలకు 12,29,429 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.11 కోట్ల 26లక్షల 77వేలు చెల్లించారు. ఇక ఫిబ్రవరిలో 2,03, 251 మంది కూలీలకు ఏకంగా 20,48,232 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ. 21కోట్ల 64లక్షల 36వేలు చెల్లించారు. ఇక ఆర్ధిక సంవత్సరం ముగింపు నెల మార్చిలో 77,217 పనుల కల్పన ద్వారా 2,76,694 మంది కూలీలకు ఆ సీజన్లోనే అత్యధికంగా 31లక్షల 90వేల 422 పనిదినాలు కల్పించారు. ఈమేరకు వీరికి వేతనాల రూపంలో ఏకంగా రూ.35 కోట్ల 19 లక్షల 49 వేలు చెల్లించారు. కానరాని పనుల జాడ 2014-15 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 20,564 మంది కూలీలకు 2,28,833 పనిదినాలుకల్పించారు. వీరికి వేతనాల కింద రూ.2కోట్ల 50లక్షల 14వేలు చెల్లించాల్సి ఉంది. జనవరిలో 29,859 మంది కూలీలకు 3,07,618 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల రూపంలో రూ.3 కోట్ల 35 లక్షల 19 వేలు చెల్లించాల్సి ఉంది. ఇక ఫిబ్రవరిలో 39,634 మంది కూలీలకు 2,87,555 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.3 కోట్ల 46 లక్షల 44 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా గ త మూడు నెలల్లో రూ.9 కోట్ల 31 లక్షల 77 వేలు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.5.85 కోట్లు మాత్రమే చెల్లించారు. గతేడాది మార్చి వరకు చూస్తే పనులు చేసిన 6,50,160 మంది కూలీలకు ఏకంగా 71 లక్షల 27 వేల 263 పనిదినాలు కల్పించగలిగారు. ఈ లెక్కన వేతనాల కింద ఏకంగా రూ.74.76 కోట్లు చెల్లించారు. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 90,056 మందికి 8,24,006 పనిదినాలు కల్పించగలిగారు. మరో 40రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున గతేడాది స్థాయిలో పనులు కల్పించడం సాధ్యమయ్యే పని కాదని అధికారులే అంగీకరిస్తు న్నారు. -
‘ఉపాధి’..ఉఫ్..!
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీల పాలిట వరంగా మారింది. కరువు జిల్లాగా పేరొందిన పాలమూరులో ఆపన్నహస్తంగా ఉంది. నిత్యం పొట్ట చేతబట్టుకుని వలసలతో సతమతమయ్యే వారికి ఈ పథకం సాంత్వన చేకూర్చింది. అయితే.. ఇప్పటికే నిరాసక్తితో ఉన్న కేంద్రం త్వరలో ఈ పథకానికి మంగళం పాడే అవకాశం కనిపిస్తోంది. పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ(ఐపీపీఈ) పేరుతో పథకాన్ని కేవలం పది మండలాలకే కుదించింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇదే పద్ధతిని పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఉపాధి ఊసేలేకుండా పోతుంది. సాక్షి, మహబూబ్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో ఎంతోమంది పేదకూలీలకు ఆసరా ఇచ్చింది. ఈ పథకాన్ని ఆపివేస్తే వలసలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలో మొత్తం 8,79,534 కుటుంబాలు జాబ్‌కార్డులు పొందాయి. అయితే వీటిలో క్రియాశీలంగా మాత్రం 2,77,595 కుటుంబాలు మాత్రమే పనిచేస్తున్నాయి. సుమారు 4,80,420 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరికి సరాసరిగా రూ.100.61 కూలీ అందుతుంది. అయితే ఇంత పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చుతున్న ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేవలం కొన్ని మండలాలకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ (ఐపీపీఈ) కింద జిల్లాలో కేవలం పది మండలాలకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో మొత్తం 64 మండలాలు ఉండగా, వాటిలో పదింటికి మాత్రమే చోటు దక్కింది. దీంతో మిగిలినచోట్ల అమలు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఉపాధిహామీలో చోటుదక్కిన పది మండలాల్లో కూడా కొత్త మార్గదర్శకాలు వెలువడ్డాయి. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా పనులు చేయడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టింది. ఉద్యోగులపై వేటు జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల జిల్లాలో వివిధస్థాయిలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కూలీలను, మేట్లను పర్యవే క్షించడం కోసం గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 800మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిని పర్యవేక్షించడం కోసం మండలస్థాయిలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు 271మంది ఉన్నారు. అలాగే అప్పిలేట్ ప్రోగ్రాం అధికారులు 53మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 39మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 136 మంది, ఏపీడీలు 12 మంది పనిచేస్తున్నారు. ఉపాధిహామీని కేంద్రం కుదిస్తే వీరి భవిష్యత్ గందరగోళంలో పడనుంది. ఇదిలా ఉండగా, ఉపాధిహామీ పథకం పట్ల కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. పథకం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా ప్రజాధనం దుర్వినియోగమవుతుందని అభిప్రాయపడుతుంది. అంతేకాదు ఈ పథకం వల్ల పెద్దఎత్తున అవినీతి కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని, శాశ్వతంగా ఎలాంటి పనులూ జరగడం లేదని భావిస్తోంది. అలాగే ఈ పథకం కారణంగా వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని కేంద్రం అంచనాకొచ్చింది. అందులో భాగంగా దీన్ని కుదించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది. ఫలితంగా జిల్లాలో ఐపీపీఈ కింద కేవలం పది మండలాలకు కుదించారు. -
‘ఉపాధి’.. ఇక పకడ్బందీ
ఆన్లైన్లోనే కూలీ డబ్బు చెల్లింపు - బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం - 62 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి - అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా చర్యలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. కూలీల రెక్కల కష్టం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం కింద పనిచేసే వారి కూలీ డబ్బును ఇకనుంచి నేరుగా వారికే చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆన్లైన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాబోతున్నారు. మే నెల నుంచే ప్రయోగాత్మకంగా జిల్లాలో చేపట్టిన ఈ విధానం దాదాపు విజయవంతం కావడంతో ఇక పూర్తి స్థాయిలో ఉపాధి వేతనాలను నేరుగా కూలీల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ వికాస బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. ఉపాధి కూలీల జాబ్‌కార్డులు, ఆధార్ వివరాలు సేకరించి ఆన్లైన్లో అనుసంధానం చేయాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించడంతో పనులు చకచక జరిగిపోతున్నాయి.. 5.57 లక్షల జాబ్‌కార్డులు... మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది జిల్లాలో 87,741 పనులకు గాను దాదాపు రూ. 88 కోట్ల నిధులు మంజారు అయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 5.57లక్షల పైగా జాబ్‌కార్డులున్నాయి. వీరికి చట్ట ప్రకారం ఏటా 100 పనిదినాలను కల్పించాల్సి ఉంటుంది. కూలీలకు ప్రస్తుతం రోజుకు రూ.169 చెల్లిస్తున్నారు. ఈ కార్డుల ద్వారా పనిచేసే కూలీలకు వేతనాలను ప్రస్తుతం నగదు రూపంలో నేరుగా చెల్లిస్తున్నారు. గతంలో ప్రైవేటు సంస్థల ద్వారా పోస్టాఫీసు నుంచి కూలీ డబ్బు చెల్లించేవారు. దీంతో వేతనాలను చెల్లించే క్రమంలో అక్రమాలు జరుగుతున్నుట్ల పలుచోట్ల ఫిర్యాదులు అందాయి. ఉపాధి హామీ పథకంపై జరిపిన సామాజిక తనిఖీల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కూలీల వేతనాలను ప్రభుత్వ సిబ్బంది ద్వారా కాకుండా నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో వేసి అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జాబ్‌కార్డులున్న వ్యక్తుల ఆధార్ వివరాలను స్థానిక యంత్రాంగం సేకరించింది. ఈ వివరాలను ఆన్లైన్లో అనుసంధానిస్తున్నారు. 62 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి.. ఇప్పటివరకు దాదాపు 62 శాతం ఆన్లైన్ అనుసంధానం పూర్తయిందని డ్వామా పీడీ రవీందర్ తెలిపారు. మిగిలిన 38 శాతం కూలీల ఆధార్, బ్యాంకు అకౌంట్ల వివరాల సేకరణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 7.58 లక్షల మంది కూలీలుండగా, వారిలో 4.52 లక్షల మంది ఆధార్ వివరాలను అనుసంధానం చేశారు. అందులో 6.55 లక్షల మంది బ్యాంకు అకౌంట్లను కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆధార్ అనుసంధానం కాని కూలీల వివరాలు సేకరించి వారికి ఆధార్ కార్డులను ఇప్పంచే పనిలో అధికారులున్నారు. అన్ని పథకాలకూ ఆన్లైన్ చెల్లింపులే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న అన్ని సంక్షేమ పథకాలకు నగదు చెల్లింపులను రద్దు చేసి ఆన్లైన్ చెల్లింపులు చేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి, ఇందిరా క్రాంతి పథం సిబ్బందికి, నీటి యాజమాన్య సంస్థ పీడీ ద్వారా చేసే చెల్లింపులను కూడా ఆన్లైన్లోనే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు లేదా మూడు నెలల్లో దాదాపు అన్ని సంక్షేమ పథకాల చెల్లింపులను ఆన్లైన్లోనే చేస్తామని, మ్యానువల్ చెల్లింపులకు చెక్ పెడతామని అధికారులు చెబుతున్నారు. -
రికవరీకి నో ‘హామీ’
ఖమ్మం : వలసల నివారణ, అడిగిన ప్రతి కూలీకి పని కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాల్సిన ఉపాధి హామీ పథకం జిల్లాలో అక్రమాల పుట్టగా మారింది. వాటర్‌షెడ్ పనుల్లో కోట్ల రూపాయల కుంభకోణంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. వాటిపై ఇప్పటి వరకు నిజానిజాలు నిగ్గు తేల్చలేదనే ఆరోపణలు ఉన్నాయి. పథకం ప్రారభం నుంచి నేటి వరకు ఈజీఎస్‌లో జరిగిన అవకతవకలపై నిర్వహించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్)లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని వెల్లడైంది. అయినా వాటిని రికవరీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రయత్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నామమాత్రంగా ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై గ్రామసభలు కూడా నిర్వహించడం లేదని, పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టిస్తూ, కోట్ల రూపాయలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రికవరీకి నోచని రూ. 2.49 కోట్లు... జిల్లాలో 5, 82,759 జాబ్ కార్డులు ఉండగా వీటి ద్వారా 14,41,083 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. పథకం ప్రారంభమైన 2010 నుంచి ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్నారు. ఇందులో కింది నుంచిపైస్థాయి అధికారుల చేతివాటంతో కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేటతెల్లమైంది. 2010 నుంచి ఈ సంవత్సరం వరకు ఈ అక్రమాలపై ఏడు సార్లు సోషల్ అడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ ద్వారా జిల్లాలో 3,14,00,739 రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. అయితే, వాటిని రికవరీ చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొదటి విడత తనిఖీల్లో రూ. 15 లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు తేలగా, అందులో రూ. 13 లక్షలు రికవరీ చేశారు. అదే రెండో విడతలో రూ. 59 లక్షలు దుర్వినియోగం కాగా, ఇందులో కేవలం రూ. 20 లక్షలు, మూడో విడతలో రూ. 26 లక్షలకు రూ.13 లక్షలు, నాలుగో విడతలో రూ. 28 లక్షలకు రూ. 6 లక్షలు మాత్రమ రికవరీ చేశారు. ఐదో విడతలో అత్యధికంగా రూ.1.23 కోట్లు దుర్వినియోగం కాగా, ఇందులో రూ.8.17 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. దీన్నిబట్టి చూస్తే ఉన్నతాధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే జిల్లాలో జరిగిన అక్రమాలలో అక్కడి ఉద్యోగులతోపాటు పలువురు నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని, అందుకోసమే రికవరీ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు రికవరీ పేరిట పలు ప్రాంతాల్లో ఉద్యోగులను వేధిస్తూ వారి వద్దనుంచి అధికారులు ముడుపులు వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఉపాధితో వ్యవసాయం
అనుసంధానానికి ప్రతిపాదనలు ఎకరం సాగులో రూ.6 వేలు రైతుకు లబ్ది విశాఖ రూరల్: వలసలు అరికట్టి, ఎక్కడివారికి అక్కడే పనులు కల్పించేందుకు 2008లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అధికారులు లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ప్రతి ఏటా కార్మికులకు జాబ్‌కార్డులు అందజేస్తూ పనులు కల్పిస్తూ వస్తున్నారు. కేవలం 2014-15 సంవత్సరంలో ఇప్పటి వరకు 2.45 లక్షల కుటుంబాలకు పనిదినాలు కల్పించి రూ.87 కోట్లు వేతనంగా చెల్లించారు. పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల మంజూరుపై పెట్టిన దృష్టి, ఎటువంటి అభివృద్ధి పనులు చేయించాలన్న విషయంపై ప్రణాళిక మాత్రం రూపొందించడం లేదు. దీంతో ఇష్టానుసారంగా అవసరం, ఉపయోగం లేని పనులు చేయించడంతో రూ.కోట్లు వృథా అవుతున్నాయి. ఈ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో ప్రజోపయోగకరమైన వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చంటేఅతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పథకంలో కొన్ని మార్పులు చేయాలన్న డిమాండ్ సర్వ త్రా వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా మూడేళ్లుగా ప్రకృతి విలయాలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకొనేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన తలెత్తింది. త్వరలో కేంద్రానికి నివేదన : ప్రస్తుతం ఒక ఎకరంలో పంట సాగు కోసం రైతుకు రూ.14 వేలు నుంచి రూ.15 వేలు ఖర్చవుతోంది. ఇందులో ఉడుపులు నుంచి నూర్పులు వరకు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అప్పగిస్తే రైతుకు రూ.6 వేలు వరకు భారం తగ్గుతుంది. ఈ విషయంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. దీనిపై ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి కేంద్రానికి నివేదించాలని మంత్రి ఆలోచన చేస్తున్నారు. చిన్న, సన్నకారురైతులకు ఈ నిర్ణయం ప్రయోజ నకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అ యితే ఉపాధి హామీ పథకం లో మార్పులు చేయాలని ని ర్ణయించిన కేంద్రం ఈ ప్రతి పాదనలపై ఏ విధంగా స్పం దిస్తుందో వేచి చూడాలి. -
ఉపాధి పనులు కల్పించండి
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: జిల్లా వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి. షడ్రక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 8.50లక్షల జాబ్ కార్డులు ఉంటే 50వేల మందికి కూడా ఉపాధి పనులు చూపించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులు చేస్తే వేతనం త్వరగా రాదనే భావన కూలీల్లో ఉందన్నారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకు చేసిన పనుల బిల్లులు రూ.20కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బేతంచెర్ల కో ఆర్డినేటర్ రూ.15లక్షల డ్రా చేసుకొని స్వాహా చేసి, ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆరోపించారు. అయినప్పటికీ డ్వామా పీడీ మౌనంగా ఉండడం విచారకరమన్నారు. అనంతరం ఆసంఘం జిల్లా ప్రధాక కార్యదర్శి ఎం. నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 23 మంది ఉపాధి కూలీలు వడదెబ్బకు మృతి చెందారని, ముందస్తుగా మెడికల్ కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరిగాయని వెల్లడిచారు. ఈ సమస్యలపై ఈనెల 26వ తేదిన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. -
‘ఉపాధి’కి ఆధార్ లింకు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉపాధి హామీ పథకం కూలీలపై ఆధార్ పిడుగు పడింది. ఇప్పటికే బయోమెట్రిక్ విధానం ద్వారా కూలీలకు డబ్బులు చెల్లిస్తుండగా.. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామీ జాబ్‌కార్డుకు ఆధార్ నంబరును అనుసంధానం చేస్తోంది. ఇక నుంచి జాబ్‌కార్డుకు ఆధార్ నంబరు అ నుసంధానమై ఉంటేనే కూలీలకు డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. లేదంటే అంతే సంగతులు. కూలీ చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ విధానమని ప్రభుత్వం చెబుతున్నా.. పని ఎక్కడ దొరక్కుండా పోతుందోనని కూలీ లు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ నం బరు అనుసంధానాన్ని ముడిపెట్టడంతో.. అనుసంధానం కాని కూలీల డబ్బులు త్వరలో నిలిచిపోనున్నాయి. అతి త్వరలో ఆధార్ అనుసంధానమైన కూలీ లకే డబ్బు చెల్లింపులు చేయనుంది. జిల్లాలో 11.87 లక్షల కూలీలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో 5,35,120 జాబ్‌కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. వీటి ద్వారా 11లక్షల 87 వేల 180 మంది కూలీలు పనులు చేస్తున్నారు. గతంలో మాన్యువల్ విధానం ద్వారా కూలీలకు చెల్లింపులు జరిగేవి. ఆ సమయంలో కూలీలు పనులకు హాజరు కాకున్నా వారి పేరిట సిబ్బంది డబ్బులు డ్రా చేశారన్న ఆరోపణలు పెద్దయెత్తున వచ్చాయి. తద్వారా నిధులు పక్కాదారి పడుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం మాన్యువల్ చెల్లింపుల స్థానంలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో కూలీల వేలి ముద్రల ఆధారంగా డబ్బులు చెల్లిస్తున్నారు. జాబ్‌కార్డులకు ఆధార్ నం బర్ అనుసంధానం చేయడం ద్వారా చెల్లింపుల్లో అక్రమాలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని ప్రభుత్వం భావి స్తోంది. కొద్ది రోజుల నుంచే అనుసంధానం ప్రారంభించా రు. ఇప్పటివరకు ఆరు లక్షల మంది కూలీల ఆధార్ నంబరు(యూఐడీ)తో అనుసంధానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో ఐదు లక్షలకు పైగా కూలీలకు చెందిన ఆధా ర్ నంబర్లు అనుసంధానం కావాల్సి ఉంది. సాంకేతిక, ఇతర కారణాల వల్ల ఇప్పటికీ ఆధార్‌కార్డులు రానివారు ఉన్నారు. ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధార్‌పై అవగాహన లేక ఫొటో దిగని వారూ ఉన్నారు. దాదాపు లక్షన్నర మంది కూలీలు ఆధార్‌కార్డులు కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఆధార్‌కార్డులు రాక నంబరు అనుసంధానం కాకుంటే పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. భారం తగ్గించుకోవడానికేనా..? వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత కోసమే నూతన విధానమని చెబుతున్నప్పటికీ ఖాజానాపై భారం తగ్గించుకోవచ్చనే భావనతోనే ప్రభుత్వం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు అరికట్టడం మంచిదే అయినప్పటికీ జిల్లాలో పూర్తి స్థాయిలో ఆధార్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా ఆధార్‌తో జాబ్‌కార్డులకు ముడిపెట్టడమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూలీలందరికీ ఆధార్ కార్డులు అందజేశాక ఈ విధానాన్ని అమలు చేస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదని కూలీలు అంటున్నారు. లక్షల మంది ఉపాధిపై ప్రభావం చూపే ఆధార్ అనుసంధానం వాయిదా వేయడం గానీ పూర్తిగా తొలగించడం గానీ చేయాలని కూలీలు కోరుతున్నారు. -
పరికరాల సరఫరాలో తీవ్రజాప్యం
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : పనికి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 5.10 లక్షల మంది జాబ్ కార్డులు కలిగిన కూలీలు ఉన్నారు. వారిలో రోజుకు 40 వేల నుంచి 60 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరు పనులు చేసేందుకు గడ్డపారలు, చెలగపారలు అవసరమవుతాయి. వీటితో పాటు పని ప్రదేశంలో షామియానాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి. వీటిని పూర్తిస్థాయిలో అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(సీఆర్డీ) అధికారులు హైదరాబాద్‌లో టెండర్లు నిర్వహించారు. అయితే కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి పది నెలలు కావస్తున్నా వాటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడంలో విఫలమయ్యారు. జిల్లాలో జరుగుతున్న పనులకు సుమారు 50 వేల గడ్డపారలు అవసరమవుతాయి. అందులో భాగంగా దగదర్తి, కావలి, కలిగిరి మండలాల్లో కేవలం 4,800 గడ్డపారలు సరఫరా చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు గడ్డపారలు సరఫరా చేయాలని సీఆర్డీ అధికారులు ఉత్తర్వులు జారీ చేసి నెలలు కావస్తున్నా ఫలితం కరువైంది. ఒక జిల్లాకు పరికరాలు సరఫరా చేయగా వచ్చిన నగదుతో మరో జిల్లాకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పరికరాల సరఫరాలో తీవ్రజాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కూలీలే గడ్డపారలు, చెలగపారలను బాడుగకు తెచ్చుకుని పనులు చేస్తున్నారు. మరోవైపు పనిచేసే ప్రదేశంలో కూలీలు సేద తీరేందుకు షామియానాలు అవసరం. రెండేళ్ల కిందట సరఫరా చేసిన షామియానాలు పూర్తిగా దెబ్బతినడంతో కూలీలు ఎండలో ఇబ్బంది పడుతున్నారు. చర్యలు తీసుకుంటాం : గడ్డపారలను త్వరగా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పనిచేసే ప్రాంతంలో అన్ని పరికరాలను అందుబాటులో ఉండేలా చూస్తాం. గత నెలలో కొన్ని మండలాల్లో షామియానాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ సరఫరా చేశాం. కూలీలు పరికరాలను బాడుగకు తెచ్చుకున్నా నగదు చెల్లిస్తున్నాం. కూలీలు ఇబ్బంది పడకుండా చూస్తున్నాం. - ఎం. గౌతమి, డ్వామా పీడీ -
కూలీకి హామీ ఏది?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఉపాధిహామీ పథకం గాడి తప్పింది. జూలై ఆరంభం నుంచి ఏ ఒక్క కూలీకి వేతనం చెల్లించలేదు. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు పని చేసి డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికారులు మొహం చాటేస్తున్నారు. తమకేం తెలియదని... ప్రభుత్వం నుంచే విడుదల కావడం లేదని దాటవేస్తున్నారు. ఉన్న ఊళ్లోనే పని చేసుకుని బతుకుదామని ఉపాధిహామీ పథకాన్ని నమ్మకుంటే చివరికి చేతిలో చిల్లిగవ్వలేకుండా పోతోందని, ఇంట్లో బియ్యానికి డబ్బులు దొరకడం లేదని కూలీలు వాపోతున్నారు. ఈ పథకం పని కల్పించడం సంగతి ఎలా ఉన్నా వేతనం చెల్లింపులో మాత్రం హామీ ఇవ్వడం లేదని అంటున్నారు. జిల్లాలో 6.85 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 2 లక్షల 54 వేల 189 కుటుంబాల్లోని 4 లక్షల 19 వేల 358 మందికి ఇప్పటివరకు ‘ఉపాధి’ సమకూర్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఇప్పటివరకు 30 వేల కుటుంబాలకు మాత్రమే వందరోజుల పని కల్పించినట్లు పేర్కొంటున్నారు. ఇలా ఉపాధి కల్పించడంలోనే జిల్లా పరిస్థితి అధ్వానంగా ఉండగా... పనిచేసిన వారికి వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వేతనాల చెల్లింపులో పరిస్థితి దారుణంగానే ఉంది. నిబంధనల ప్రకారం ఉపాధిహామీ వేతన చెల్లింపులు ప్రతీ మూడు రోజులకు ఇవ్వా లి. వారానికోసారి ఇస్తున్నారు. లెక్కలు కాలేదని పంపిణీ చేసే ఏజెన్సీలు క్యాష్ హాలీడే వంటి కారణాలతో వారానికోసారి చెల్లింపులు జరిపే వి. జూలై 6 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక్క పైసా చెల్లింపులు జరపలేదు. దీంతో కూలీలకు ఇవ్వాల్సిన వేతనం మొత్తం ఇప్పటికే రూ.15 కోట్లకు చేరుకుంది. వర్షాకాలం కావడంతో అసలే ఉపాధిహామీ పనులు తక్కువగా జరుగుతున్నాయి. ఉపాధిహామీ పనుల్లో భాగంగా చెట్ల పెంపకం కోసం గుంతలు తీసిన కూలీలకు చెల్లింపులు లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.4,500లు చెల్లింపులు జరగడం లేదు. ఉపాధిహామీలో ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగినట్లు చూపిస్తున్నా కూలీల ఖాతాలకు మాత్రం జమ కావడంలేదు. చేసిన పనికి వేతన చెల్లింపులు అసలే లేకపోవడం పేద కుటుంబాలకు ఇబ్బందిగా మారుతోంది. నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కూడా చేతిలో డబ్బులు లేక కూలీల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.