ఏపీలో 2.55 లక్షల జాబ్‌కార్డుల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో 2.55 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాం కృపాల్ యాదవ్ తెలిపారు. తగిన తనిఖీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. వివిధ కారణాల వల్ల వీటిని అర్హత లేని జాబ్‌కార్డులుగా గుర్తించినట్టు తెలిపారు. కుటుంబం స్థానికంగా లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ కార్డులను తొలగించినట్టు తెలిపారు.