ఉపాధితో వ్యవసాయం
- అనుసంధానానికి ప్రతిపాదనలు
- ఎకరం సాగులో రూ.6 వేలు రైతుకు లబ్ది
విశాఖ రూరల్: వలసలు అరికట్టి, ఎక్కడివారికి అక్కడే పనులు కల్పించేందుకు 2008లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అధికారులు లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ప్రతి ఏటా కార్మికులకు జాబ్‌కార్డులు అందజేస్తూ పనులు కల్పిస్తూ వస్తున్నారు. కేవలం 2014-15 సంవత్సరంలో ఇప్పటి వరకు 2.45 లక్షల కుటుంబాలకు పనిదినాలు కల్పించి రూ.87 కోట్లు వేతనంగా చెల్లించారు.
పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల మంజూరుపై పెట్టిన దృష్టి, ఎటువంటి అభివృద్ధి పనులు చేయించాలన్న విషయంపై ప్రణాళిక మాత్రం రూపొందించడం లేదు. దీంతో ఇష్టానుసారంగా అవసరం, ఉపయోగం లేని పనులు చేయించడంతో రూ.కోట్లు వృథా అవుతున్నాయి. ఈ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో ప్రజోపయోగకరమైన వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చంటేఅతిశయోక్తి కాదు.
ఈ నేపథ్యంలో పథకంలో కొన్ని మార్పులు చేయాలన్న డిమాండ్ సర్వ త్రా వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా మూడేళ్లుగా ప్రకృతి విలయాలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకొనేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన తలెత్తింది.
త్వరలో కేంద్రానికి నివేదన : ప్రస్తుతం ఒక ఎకరంలో పంట సాగు కోసం రైతుకు రూ.14 వేలు నుంచి రూ.15 వేలు ఖర్చవుతోంది. ఇందులో ఉడుపులు నుంచి నూర్పులు వరకు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అప్పగిస్తే రైతుకు రూ.6 వేలు వరకు భారం తగ్గుతుంది. ఈ విషయంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు.
దీనిపై ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి కేంద్రానికి నివేదించాలని మంత్రి ఆలోచన చేస్తున్నారు. చిన్న, సన్నకారురైతులకు ఈ నిర్ణయం ప్రయోజ నకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అ యితే ఉపాధి హామీ పథకం లో మార్పులు చేయాలని ని ర్ణయించిన కేంద్రం ఈ ప్రతి పాదనలపై ఏ విధంగా స్పం దిస్తుందో వేచి చూడాలి.