నిజాంసాగర్, న్యూస్‌లైన్: పొట్టకూటి కోసం ఉపాధి పనులు చేస్తున్న కూలీలు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. వారం రోజుల్లో చేతికందాల్సిన కూలీ డబ్బులు రెండు నెలలైనా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో రెక్కలు వంచి ఉపాధి పనులు చేస్తున్నా.. కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. జిల్లాలో 718 గ్రామపంచాయతీల కు గాను 620 పైగా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో రోజుకు 1.5 లక్షల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొం టున్నారు. గత మార్చి 2వ వారం నుంచి ఉపాధి పనులు చేస్తున్న కూలీల కు ఇంతవరకు డబ్బులు రాలేదు.
వారం వారం కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా, అధికారులు డబ్బులు మం జూరు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.కుంటుంబ పోషణ కోసం కూలీ పనులు చేస్తున్న వారికి సకాలంలో డబ్బులు అందకపోవడంతో అప్పులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీల సంఖ్యను పెంచాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేస్తున్న అధికారులు, కూలీ డబ్బుల చెల్లింపుపై శ్రద్ధ చూపడం లేదు. కూలి డబ్బుల కోసం గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల్లో, సీఎస్‌పీ కేంద్రాల ద్వారా డబ్బులు తీసుకోవాల్సిన కూలీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఉపాధి డబ్బులు పెండింగ్‌లో ఉండటంతో కూలీలు ఈజీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కూలీలకు దాదాపు 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్‌ఆర్‌ఈ జీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కొరత వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోందని ఈజీఎస్ జిల్లా అధికారుల ద్వారా తెలిసింది.
ఉపాధి కూలీ... జేబు ఖాళీ
Published Wed, Apr 30 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement