సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో పాటు చిన్నారి ఉన్నారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది.(కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం)
బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ వలసకూలీలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి కూడా పోయే వీలు లేక వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురి మృతదేహలు గుర్తించారు. (తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు: ఐఎండీ హెచ్చరిక)
వరంగల్ జిల్లాలో వలస కూలీల ఆత్మహత్య
Published Thu, May 21 2020 6:17 PM | Last Updated on Thu, May 21 2020 7:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment