Geesukonda
-
కైటెక్స్ వాస్తు కోసం భూ సర్వే
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు. పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు. ‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’ కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు. -
మొదటి జీతం.. పేదలకు అంకితం
గీసుకొండ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా నియామకమైన వలపదాసు అనూష ఇటీవల విధుల్లో చేరింది. ఆమె మొదటి నెల వేతనాన్ని పేదల ఆకలి తీర్చడానికి వెచ్చించి ఆదర్శంగా నిలిచింది. ఆకలితో అలమటిస్తున్న వంద మంది నిరుపేదలు, భిక్షమెత్తుకునే వారికి భోజనం అందజేసింది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన అనూష తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తల్లి బీడీలు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. అనూష పేదరికంలో బతుకుతూనే ఎంఏ బీఈడీ వరకు చదువుకుని ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. పేదవారికి సాయం చేయా లానే సంకల్పంతో మొదటి వేతనంతో ఆహారం సమకూర్చానని, రానున్న రోజుల్లో తన శక్తి మేరకు సాయపడతానని అనూష చెబుతోంది. ఆమె పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పలువురు అభినందిస్తున్నారు. -
తొమ్మిది హత్యల కేసు : సంజయ్‌కు ఉరిశిక్ష
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రల్లో సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్ న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్యను కప్పి పుచ్చుకునేందుకు మరో 9మందిని హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు వెలువడింది. కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్డులో నేరారోపణ పత్రము దాఖలు చేశారు. కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. తీర్పును వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసినందుకు పోలీసులను అభినందించారు. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్‌కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు మే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు మే 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు. తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి కోర్పుకు అప్పగించారు. దీంతో నిందితుడు సంజయ్‌కు ఉరిశిక్ష ఖరారైంది. -
9 హత్యల కేసు; కోర్టుకు నిందితుడు
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్‌లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్ రీకన్‌స్ట్రక్టషన్ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్‌ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్‌కుమార్‌పై సీన్ రీ కన్స్ట్రక్షన్) -
9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?
సాక్షి, వరంగల్ రూరల్: గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భా గంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల్లో చిక్కిన నిందితుడు తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో మాత్రం తాత్సారం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే 60 మాత్రలా? కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు, జలుబు మాత్రలు కూడా విక్రయించకూడదని మెడికల్ షాపుల నిర్వాహకులను రాష్ట్ర, జిల్లా అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఔషధ దుకాణాల నిర్వాహకులు తమ తీరును మార్చుకోవడం లేదని ఈ ఘటనలో వెల్లడైంది. గొర్రెకుంట ఘటనలో నిందితుడు ఉపయోగించిన 60 నిద్రమాత్రలు ఒక్క దుకాణంలోనే కొనుగోలు చేశాడా.. లేదంటే పలు షాపుల్లో తీసుకున్నాడా అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ విషయంపై డ్రగ్ కంట్రోల్ అధికారుల వివరణ కోరగా హంతకుడు ఉపయోగించిన నిద్రమాత్రల బ్యాచ్ నెంబర్‌ను తమకు తెలియజేస్తే ఏ షాపులో ఔషధాలు కొనుగోలు చేశాడనేది తేలేతుతుందని చెబుతున్నారు. బ్యాచ్ నంబర్ వివరాలు తెలపాలని పోలీసులను సైతం కోరామని స్పష్టం చేస్తున్నారు. విచారణలో చెప్పలేదా.. పోలీసుల విచారణలో హంతకుడు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన ఔషధ దుకాణం పేరు వెల్లడించలేదా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. హత్య జరిగిన తీరును పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో వెల్లడించినా ఔషధ దుకాణాల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. దీంతో అసలు మతలబు ఏమిటనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులు ఈ అంశంపై పెదవి విప్పకపోగా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాత్రం మాత్రల బ్యాచ్ నంబర్ కోసం పోలీసులను అడిగామని చెప్పడం గమనార్హం. చదవండి: 9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిళ్లు డేగకళ్లతో నిఘా గీసుకొండ: గొర్రెకుంట శివారులోని బావిలో తొమ్మిది మందిని, అంతకు ముందు ఓ మహిళను హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ పోలీసు కస్టడీ కొనసాగుతోంది. కేసు విషయంలో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆయనను పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆరు రోజుల కస్టడీ ఈనెల 4వ తేదీతో ముగియనుండగా అదేరోజు కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. ఈమేరకు ఘటనా స్థలమైన బావి, బార్దాన్ గోదాంతో పాటు సంజయ్‌కుమార్ యాదవ్ తిరిగిన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనను తీసుకెళ్లి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈక్రమంలో ఆయనను అనునిత్యం గమనిస్తూ ఆరుగురు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఉదయం పూట విచారణకు తీసుకెళ్తే పారిపోయే అవకాశముందని భావిస్తూ కేవలం రాత్రివేళ బందోబస్తు నడుమ విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. వారితో ఎలా ఉండేవాడు? హత్యకు గురైన మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ మూడేళ్ల కుమారుడు బబ్లూ ఏడుస్తుండగా గొంతు నులిమి హత్య చేసి బావిలో వేసినట్లు తేలిన విషయం విదితమే. ఇదేక్రమంలో గ్రేటర్ పరిధి 4వ డివిజన్ స్తంభంపెల్లి పరిధిలోని ఆదర్శ నగర్లో సంజయ్‌కుమార్ యాదవ్ అద్దెకు ఉన్న ఇంటి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో మంగళవారం విచారణ జరిపినట్లు సమాచారం. మక్సూద్ ఆలం భార్య నిషా అక్క కూతురు రఫీకాతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తె, ఇద్దరు కుమారులతో అద్దె ఇంటిలో నివాసమున్నట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. అయితే, పిల్లలతో ఎలా ఉండేవాడు, రఫీకాను ఎలా తీసుకెళ్లి నిడదవోలు వద్ద రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడనే విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ తర్వాత మంగళవారం రాత్రి సంజయ్‌ను గీసుకొండ పోలీస్ స్టేషన్లోనే ఉంచినట్లు సమాచారం. -
సంజయ్‌కుమార్‌పై సీన్ రీ కన్స్ట్రక్షన్
గీసుకొండ (పరకాల): వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావి వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ పోలీసుల విచారణలో విస్మయపరిచే విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ను ఆరు రోజులపాటు విచారణ నిమిత్తం పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆది, సోమవారాల్లో ఘటనాస్థలం, గోదాముల ప్రాంతంతోపాటు గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ ఆదర్శనగర్‌లో అతను అద్దెకు ఉంటున్న ప్రాంతం, నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు విస్మయపరిచే నిజాలు వెల్లడవుతున్నాయని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. (రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?) ఇలా చేశాడు..! సంజయ్‌కుమార్ తొమ్మిది మందికి నిద్రమాత్రలు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కరిని గోనె సంచిలో బావి వద్దకు తీసుకెళ్లి ప్రాణం ఉండగానే అందులో పడేసినట్లు పోలీసులు ఇటీవల వెల్లడించారు. అయితే ఇంకా మరికొన్ని అంశాలు సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా తెలుస్తున్నట్లు సమాచారం. మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ మూడేళ్ల కుమారుడు ‘బబ్లూ’ను బతికి ఉండగానే గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. బబ్లూ ఊపిరాడక చనిపోయాడని, అతనికి ఎక్కువ మోతాదులో విషం ఎక్కలేదని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని పోస్టు మార్టంలో గుర్తించినట్లు వైద్యులు వెల్లడించిన విషయం విదితమే. మే 21న రాత్రి గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో 9 మందికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు.. బయటకు వచ్చి కొంతదూరం కాలినడకన అక్కడక్కడా తిరిగాడని, ఆ తర్వాత తన జాడ పోలీసు జాగిలాలు గుర్తించకుండా పలుచోట్ల కాళ్లు కడుకున్నాడని, సైకిల్‌పై వరంగల్ చౌరస్తా, ఇంతెజార్గంజ్ ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం సంజయ్ అర్ధరాత్రి గోదాంకు వచ్చే ముందు అందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి నిషాకు ఫోన్ చేయగా ఆమె మత్తులోనే హా.. అని తప్ప మరో మాట మాట్లాడలేదని తెలుస్తోంది. గోదాం వద్దకు తిరిగివచ్చాక బబ్లూ ఏడ్చుకుంటూ కనిపించడంతో అతడిని గొంతు నులిమి హత్య చేసి బావిలో వేశాడని తెలిసింది. ఇప్పటికే పోలీసులు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోగా.. మిగతావి ఎక్కడ ఉన్నాయనే విషయంలో సంజయ్‌ను తమదైన శైలిలో విచారిస్తున్నారు. దీంతో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిళ్లు
వరంగల్ అర్బన్, గీసుకొండ : గొర్రెకుంట హత్యల కేసులో 9 మంది మృత దేహాలకు ఈనెల 22న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సందర్భంగా మృత దేహాల నుంచి పరీక్షల కోసం గుండె, కాలేయంతో పాటు శరీరం లోపలి పలు అవయవాలు, ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న ద్రవం, బావిలోని నీటి శాంపిళ్లు.. ’విశ్రా’ను సేకరించి తొమ్మిది బాక్సుల్లో భద్రపరిచారు. వీటిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు గీసుకొండ పోలీసులు తీసుకుని వెళ్లారు. నిపుణులు ల్యాబ్‌లో పరీక్షించి 15 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు నమోదు చేయనున్నారు.(హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం) -
రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. రఫీకా కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు వీరు ఆధారాలు సేకరించారు. దీంతో సంజయ్‌పై పోక్సో చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉంది. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) -
రఫిక భర్తను కూడా ఏమైనా చేసి ఉంటాడా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో సామూహిక డెత్ మిస్టరీలో కొత్త కోణాలు, అనుమానాలు బయటకు వస్తున్నాయి. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్కకూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) ఢిల్లీలో ఫర్నిచర్ దుకాణంలో పనిచేసినప్పుడు రఫికతో సంజయ్‌కి పరిచయం ఏర్పడిందన్న ప్రచారం బుధవారం నుంచి తెరపైకి వచ్చింది. అక్కడే ఆమెతో సాన్నిహిత్యం పెరగడంతో పిల్లలతో సహా రఫిక వరంగల్‌కు మకాం మార్చిందంటున్నారు. మృతుల్లో ఒకరైన మహ్మద్ మక్సూద్ ఆలం తన కూతురు బుష్రాను సైతం ఢిల్లీలో ఖాతూన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. రఫిక వ్యవహారం ఢిల్లీలో ఉన్నప్పడే తెలియడంతో వరంగల్‌కు వచ్చాక ఆమెను మక్సూద్ పట్టించుకోలేదని సమాచారం. దీంతో స్తంభంపల్లిలో రఫిక హంతకుడు సంజయ్‌మార్ కాపురం పెట్టిందని తెలిసింది. అయితే నిషా ఆలం తన సొంత సోదరి కుమార్తె కావడంతో అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేదని, చివరకు రఫికా కనిపించకుండా పోవడాన్ని ఆమె నిలదీయడం వల్లే సంజయ్‌కుమార్ ఈ దురాఘతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.(హత్య.. ఆపై హత్యలు) సంజయ్‌కుమార్ నేర చరిత్రపై ఆరా.. మక్సూద్ సమీప బంధువు రఫిక అలియాస్ చోటీ కుటుంబంపై కూపీ లాగుతున్న పోలీసులు, నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ నేరచరిత్రపైనా మళ్లీ ఆరా తీస్తున్నారు. 14 రోజుల రిమాండ్ కోసం మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసింది. నిందితుడి నేరచరిత్రపై రోజుకో రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంజయ్‌కుమార్‌ను మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ కింద అదుపులోకి తీసుకునే యోచన కూడా చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా రఫిక భర్త ఏమయ్యాడనే కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు ఆయనను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఫికా భర్త బతికే ఉన్నాడని, ఢిల్లీలోనే ఉన్నాడని.. అయితే ఆయన మానసిక ప్రవర్తన బాగాలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో స్పష్టత వస్తేనే అందరి అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది.(గొర్రెకుంట.. ఒక్కడే 9 హత్యలు ఎలా చేశాడు?) రఫిక పిల్లలను కలిసి మాట్లాడిన బంధువులు గీసుకొండ(పరకాల) : గొర్రెకుంట ఘటన తర్వాత అనాథలైన రఫిక పిల్లకు గీసుకొండ పోలీసులు రక్షణ కల్పించారు. సిర్దాస్ ఖాతూన్‌ను హన్మకొండ సుబేదారిలోని సఖి సెంటర్లో, ఇద్దరు కుమారులను వరంగల్ నగరం ఆటోనగర్ వద్ద గల జువైనెల్ హోంకు తరలించారు. వారిని కలవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి రఫిక తల్లికి అన్న(మేనమామ)తో పాటు మరో ముగ్గురు బంధువులు బుధవారం ఇక్కడికి వచ్చారు. పోలీసులను సంప్రదించడంతో మాట్లాడటానికి అనుమతించారు. మాట్లాడిన తర్వాత ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి పోషిస్తామని కోరగా కోర్టు అనుమతి తప్పని సరి అని పేర్కొన్నారు. వారిని పోషించే స్తోమత మీకుందని కోర్టు నమ్మితే అనుమతిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. -
ఖైదీ నంబర్ 4414
గొర్రెకుంటలో తొమ్మిది మంది హత్యకు గురైనసంఘటనకు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు పేర్కొన్నారు. ఒక్కడే ఇంత మందిని హత్యచేసి ఉండడని, ఇతరుల సహకారం తీసుకుని ఉంటాడని, ఘటనపై మరింత సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఎంజీఎం : తొమ్మిది మందిని ఒక్కడే పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు పేర్కొన్న వివరణపై పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గొర్రెకుంటలో హత్యకు గురైన వారి మృత దేహాలు ఎంజీఎం మార్చురీలో ఉండగా.. తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు మొదట మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిషా సోదరుడు ఫిరోజ్ షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్‌కుమార్ యాదవ్ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నాడని, ఇంత మందిని ఒక్కడే ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ ఘటనలో సంజయ్‌కుమార్‌కు మరికొంత మంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఆయన మరింత సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.(వరంగల్ జైలుకు సంజయ్ ) మృతదేహాల అప్పగింత గొర్రెకుంటలో హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్ద వారి బంధుమిత్రుల మధ్య నిర్వహించారు. ఉదయం పశ్చిమ బెంగాల్ నుంచి మృతుడి బంధువులు వరంగల్‌కు చేరుకోవడంతో ఎండీ మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలం, కుమారులు ఎండీ షాబాద్ ఆలం, కూతురు బుస్రా ఖాతూ, మనవడు బబ్లూ మృతదేహాలను గీసుగొండ ఇన్చార్జి తహసీల్దార్ సుహాసిని, రాయపర్తి తహసిల్దార్ సత్యనారాయణ, గీసుగొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అర్బన్ పంచనామా అనంతరం అప్పగించారు. పోతనరోడ్డులోని ఖబరస్థాన్‌లో అంత్యక్రియలను పూర్తి చేశారు.(పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?) ఆందోళన అనంతరం షకీల్ మృతదేహం అప్పగింత.. మక్సూద్ కుటుంబ సభ్యులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో షకీల్ భార్య తాహేరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారని, ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయమై అధికారులు ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో షకీల్ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూర్తయిందని షకీల్ సోదరుడు సజ్జర్తో వివరణ తీసుకున్న అనంతరం రెండవ భార్య తాహెర బేగంకు మృతదేహాన్ని అప్పగించారు. ఈమృతదేహానికి సైతం ముస్లిం మత పెద్దలు స్థానిక కార్పొరేటర్ రిజ్వానా షమీమ్ మసూద్, కల్పలత సూపర్‌బజార్ వైస్‌చైర్మన్ ఎం.డీ.షఫీ సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.(మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం) నిందితుడికి 14 రోజుల రిమాండ్ వరంగల్ లీగల్ : తొమ్మిది మందికి మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో వేసి హత్య చేసి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌యాదవ్‌ను గీసుకొండ పోలీసులు మంగళవారం మూడవ ముస్సిఫ్ కోర్టు ఇన్చార్జి జడ్జి కుమారస్వామి ఎదుట హాజరుపర్చారు. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జి జూన్ 8న తిరిగి హాజరుపర్చాలని ఆదేశించారు. నిందితుడిపై హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించడం, విషప్రయోగం ద్వారా కిడ్నాప్ చేయడం, చనిపోయిన వ్యక్తులకు చెందిన వస్తువులను దురుద్దేశ్యంతో స్వాధీనం చేసుకోవడం, దొంగతనం చేసి హత్య నేరానికి పాల్పడిన అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 302, 210 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై సెక్షన్లు.. ఐపీసీ సెక్షన్ 449 : హత్య చేయాలని ఉద్ధేశంతో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం ♦ ఈ నేరం రుజువైతే నిందితుడికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా సెక్షన్ 328 : నేరానికి పాల్పడాలనే ఉద్ధేశంతో విషప్రయోగం చేయడం 10 సంవత్సరాల కారాగార శిక్ష మరియు జరిమానా సెక్షన్ 364 : హత్య చేయడానికి మృతుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి కిడ్నాప్ చేయడం యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా సెక్షన్ 380 : దొంగతనం చేయడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా సెక్షన్ 404 : చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను తెలిసి తీసుకోవడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష సెక్షన్ 302 : హత్యా నేరం ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా సెక్షన్ 210 : బాకీ లేని అప్పు లేదా ఉన్నదానికంటే ఎక్కువ బాకీ డబ్బుల కోసం దురుద్ధేశంగా ఆర్డర్ తీసుకోవడం ,రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా శిక్ష + జరిమానా ఖైదీ నంబర్ 4414 : హై సెక్యూరిటీ బ్యారక్‌కు నిందితుడు వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట వద్ద బావిలోని తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరి హత్య కేసులోని నిందితుడైన సంజయ్‌కుమార్‌యాదవ్‌ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించగా హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచారు. అంతకు ముందు అతడికి ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రిమాండ్ ఖైదీ సంజయ్‌కుమార్‌కు 4414 నంబర్ కేటాయించినట్లు జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. మార్చురీలోనే మరో రెండు మృతదేహాలు.. తొమ్మిది మందిలో బీహార్‌కు చెందిన ఇద్దరి మృతదేహాలు ఎంజీఎం ఫ్రీజర్లలోనే ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు వరంగల్‌కు వస్తున్నారని, ఇక్కడకి చేరుకున్నాక అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
గొర్రెకుంట.. ఒక్కడే 9 హత్యలు ఎలా చేశాడు?
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యలకు సంబంధించి మృతుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం కోల్‌కతా నుంచి వరంగల్ చేరకున్న మక్సూద్ అలం భార్య నిషా బంధువులు.. ఎంజీఎం మార్చురీకి వెళ్లారు. అనంతరం ఈ హత్యలపై వారు మాట్లాడుతూ.. నిందితుడు ఒక్కడే 9 మందిని ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ సామూహిక హత్యల వెనక కుట్ర కోణం దాగుందని భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. (చదవండి : ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు) కాగా, గొర్రెకుంటలోని ఓ వ్యవసాయ బావిలో 9 మంది మృతదేహాలు లభించడం కలకలం రేపిన సంగతి తెలిసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు సంజయ్‌కుమార్ అరెస్ట్ చేశారు. నిషా అలం అక్క కుమార్తె రఫీకాతో సహజీవనం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే ఈ హత్యలకు కారణమని తేల్చారు.(చదవండి : ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు) -
పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?
సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటన సంచలనంగా మారింది. ఏకంగా పది హత్యలు చేసిన హంతకుడిని విచారించిన పోలీసులకు నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. వరంగల్ సీపీ హత్యల వివరాలు వెల్లడించారు. ఈ హత్యల పరంపరలో తొలి హత్యకు బీజం పడింది జిల్లాలో కావడం గమనార్హం. చాగల్లు–బ్రాహ్మణగూడెం మధ్య ప్రాంతంలో మార్చి 7న రైలు నుంచి పడి ఒక మహిళ మృతిచెందింది. పది హత్యల హంతకుడు సంజయ్ చేసిన ఈ హత్య అనంతరం ఏకంగా మక్సూద్ కుటుంబ సభ్యులతో పాటు 9 మందిని హత్య చేశాడు. కిరాతకంగా భోజనం, కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. నిద్రలోకి జారుకున్న వెంటనే గోనెసంచెలో వేసి లాక్కుంటూ వెళ్లి బావిలో పడేశాడు. గోనెసంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మక్సూద్ కుటుంబం కనిపించలేదంటూ ఫ్యాక్టరీ యజమాని ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసును ఛేదించారు. కూతురిపై కన్నేసి.. కుటుంబాన్నే కాటేశాడు మక్సూద్ కుటుంబానికి బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్ నాలుగేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. మక్సూద్ భార్య అక్క కుమార్తె రఫీకా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి వరంగల్‌లో ఉంటుంది. సంజయ్ రఫీకాతో పరిచయం పెంచుకుని కొద్దికాలం సహజీవనం చేశాడు. ఈ క్రమంలో సంజయ్ చూపు రఫీకా కుమార్తెపై పడింది. తన కూతురుతో సంజయ్ సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక రఫీకా అతనితో గొడవపడింది. ఇక ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నాడు. మార్చి 7న పశ్చిమబెంగాల్ తీసుకువెళతానని నమ్మించాడు. ఇద్దరూ గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో కోల్‌కతా బయలుదేరారు. ప్రయాణ సమయంలో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి తెల్లవారుజామున 3 గంటలకు చున్నీని మెడకు బిగించి రఫీకాను రైలు నుంచి కిందకు తోసేశాడు. జిల్లాలోని నిడదవోలు ప్రాంతంలోని చాగల్లు–బ్రాహ్మణగూడెం మద్యలో రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉంది. రైల్వే పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రఫీకా హత్య బయటపడకుండా ఉండేందుకు మక్సూద్ కుటుంబంతో పాటు 9మంది ప్రాణాలు బలితీసుకున్నాడు. చదవండి: గీసుకొండ బావిలో 9 మృతదేహాలు పోస్టుమార్టం నివేదికలో ఏముంది ? రఫీకా రైలులో నుంచి పడి మృతిచెందగా రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యుల ఆచూకీ లభించకపోవటంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఏమి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. సంజయ్ రఫీకాకు మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వటంతో పాటు, చున్నీ బిగించి హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఒకవేళ పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్థారిస్తే రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించారా? లేదా అనేది సందేహంగా మారింది. ఈ అంశంపైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చదవండి: హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం -
మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం
వివాహితతో ఏర్పడిన పరిచయం ఆపై సాన్నిహిత్యంగా.. అది కూడా దాటిపోయి శారీరకంగా సంబంధానికి దారి తీసింది.. అంతటితో ఆగక ఆమె కుమార్తెతోనూ సంబంధం ఏర్పర్చుకోవాలని భావించగా గుర్తించిన వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసిన నిందితుడు, ఆమె కోసం ఆరా తీసిన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యాడు.. ఈ కుటుంబంలోని ఆరుగురికి తోడు పక్కనే ఉన్న పాపానికి మరో ముగ్గురు బలి కాగా.. మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ద బావిలో తేలిన ఘటన రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు బీహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను యాదవ్‌ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తొలుత తాను మహిళను హత్య చేశానని.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియాకు సీపీ రవీందర్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. సాక్షి ప్రతినిధి వరంగల్ / కాజీపేట అర్బన్ / గీసుకొండ : ఒక తప్పు చేస్తే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలి.. అప్పుడే మనిషిలో పరివర్తన వచ్చినట్లు లెక్క! కానీ ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ వెళ్తే దానికి అంతమనేదే ఉండదు. అచ్చంగా తొమ్మిది మృతదేహాలు లభించిన కేసులో నిందితుడు ఇలాగే చేస్తూ పోయాడు. గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో లభించిన మృతదేహాల విషయంలో ఆత్మహత్యలా, హత్యలా అనే కోణం దర్యాప్తు చేసిన పోలీసులకు సీసీ ఫుటేజీల రూపంలో ఓ తీగ దొరికింది. ఆ తీగ ఆధారంగా ముందుకెళ్లగా నిందితుడు దొరికాడు. విచారణ సందర్భంగా.. ఈ తొమ్మిది హత్యలకు గతంలో తానే చేసిన ఓ హత్య నాంది అని నిందితుడు చెప్పడం గమనార్హం. కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ రవీందర్, పక్కన అధికారులు పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు సంజయ్ సైకిల్ కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్‌కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు ఈనెల 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సామగ్రి ఒక్కరొక్కరిని.. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు. 6 బృందాలు... 72 గంటలు తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిపి ఆరు బృందాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సంజయ్‌ను గుర్తించగా.. సోమవారం సాయంత్రం మీడియాకు సీపీ డాక్టర్ వి.రవీందర్ వివరాలు వెల్లడించారు. కాగా, తొలుత హత్యకు గురైన రఫీకా ముగ్గురు పిల్లలను బాలసదనంలోకి చేర్చినట్లు వివరించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ ఇన్చార్జి డీసీసీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్స్పెక్టర్లు శివరామయ్య, కిషన్, ఇన్స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, రమేష్‌కుమార్‌ను సీపీ అభినందించారు. రంజాన్ జరుపుకోకుండానే.. రంజాన్ జరుపుకునేందుకు ముస్లిం కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటాయి. అదే తరహాలో మక్సూ ద్ ఆలం కుటుంబం కూడా కొత్త బట్టలు, సరుకులు కొనుగోలు చేశారు. కానీ వారిని మృత్యువు వెంటాడింది. ఆ కుటుంబంలో ఒక్కరూ బతికి లేకపోవడంతో పండుగ జరుపుకోలేకపోయారు. రెండున్నర అడుగల ఎత్తులో బావిగోడ మృతదేహాలు తేలిన బావి చుట్టూ ప్రహారీ ఉంది. ఒకచోట మాత్రం మట్టితో 2.5 అడుగుల గోడ ఉంది. అక్కడి నుంచే సంజయ్.. మత్తులో ఉన్న వారిని బావిలోకి తోసినట్లు చెబుతున్నారు. పాపం.. ఆ ముగ్గురు తొలుత మక్సూద్ కుటుంబంలోని ఆరుగురిని మాత్రమే సంజయ్ అంతం చేయాలనుకున్నాడు. కానీ వారి ఇంటి పక్కనే ఉండే బీహార్ కార్మికులు శ్రీరాం, శ్యాంతోపాటు పని ఉందని చెప్పడంతో వచ్చిన షకీల్ కూడా బలయ్యారు. మార్చురీలోనే మృతదేహాలు ఎంజీఎం : బావిలో తేలిన తొమ్మిది మంది మృతదేహాలు ఇంకా ఎంజీఎం మార్చురీలోనే ఉన్నా యి. కేసు ఓ కొలిక్కి వచ్చినా సోమవారం రంజా న్ కావడంతో మంగళవారం మృతదేహాల ను ఖ ననం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడేం జరిగిందంటే... దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తొమ్మిది హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడి వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బావిలో నాలుగు మృతదేహాలు తేలిన రోజు నుంచి నిందితుడి వివరాలు వెల్లడించిన సోమవారం వరకు జరిగిన ఘటనల వివరాలివి.. నిందితుడు సంజయ్‌ను తీసుకొస్తున్న పోలీసులు 21 – 05 – 2020 : గురువారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో సాయిదత్తా ట్రేడర్స్ ఆధ్వర్యాన నిర్వహించిన బార్దాన్ సంచులను కేంద్రానికి ఆటోడ్రైవర్‌ను అక్కడకు పంపించారు. నిల్వ ఉన్న సంచులను తీసుకురావాలని సూచించారు. ఆటో డ్రైవర్ ఉదయం 7 గంటలకు వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో యజమానులకు సమాచారం ఇచ్చాడు. దీంతో యజమానులు భాస్కర్, సంతోష్ చేరుకుని చూడగా ఎవరూ లేకపోవడంతో పనిపై బయటకు వెళ్లారని భావించారు. మళ్లీ కాసేపటికి వెళ్లి చూడగా కూడా లేకపోవడంతో బీహార్ కార్మికులు ఉండే భవనం ఎక్కి చూడగా పక్కనే పాడుబడిన వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలడాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాయంత్రం వరకు మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా ఆలం(40), కుమార్తె బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారు బబ్లూ మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు జూపల్లి శివరామయ్య, కిషన్, ఎస్‌లు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్స్క్వార్డ్ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. మ«ధ్యాహ్నం 2నుంచి రాత్రి 8 గంటల వరకు గాలించినా ఏ ఆధారమూ లభించకపోవడంతో నలుగురు ఎలా మృతి చెంది ఉంటారనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. 22 – 05 – 2020 : శుక్రవారం ఉదయం 7 గంటలకు బావి వద్దకు స్థానికులు వెళ్లి చూడగా ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌తో పాటు పోలీసు అధికారులు చేరుకుని సిబ్బందితో గాలించారు. దీంతో తొలుత మక్సూద్ ఆలం స్నేహితుడు, కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ షకీల్(38) మృతదేహం బయటపడినా ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్ సాయంతో తోడుతుండగా చొప్పున నాలుగు మృతదేహాలు లభించాయి. ఇందులో మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్, బీహార్ కార్మికుడు శ్రీరాంకుమార్షా, మక్సూద్ చిన్న కుమారుడు మహ్మద్ సుహేల్, బీహార్ కార్మికుడు శ్యాంకుమార్షా మృతదేహాలను వెలికితీసి వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. బార్దాన్ గోదాంలోని మక్సూద్ కుటుంబం నివాసం ఉండే రెండు గదులతో పాటు, బీహార్ కార్మికులు ఉండే డాబా పైగదులు, బావి పరిసర ప్రాంతాల్లో క్లూస్‌టీం ఆధారాల కోసం పలు నమూనాలు సేకరించింది. వండి తినకుండా మిగిలిపోయిన అన్నం, ఆకుకూర పప్పు, కూల్‌డ్రింక్స్ ఖాళీ బాటిళ్లను తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రవీందర్ సందర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, హరిత సందర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. 23 – 05 – 2020 : శనివారం సంఘటనా స్థలానికి సెంట్రల్ విజిలెన్స్ అధికారుల బృందం, హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ విభాగం అధికారులు చేరుకుని సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు పలు కోణాల్లో పరిశోధనలు చేశారు. మృతదేహాల పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. ప్రాణాలతో ఉండగానే బావిలో పడేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌డేటా ఆధారంగా సంజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని ఘటనాస్థలికి తీసుకుని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. డీసీసీ వెంకటలక్ష్మి నేతృత్వంలో ఐదు గంటల పాటు పరిశీలన జరిపారు. ♦ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సీపీని ఆదేశించారు. ♦ రాత్రి తొమ్మిది మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. నీట మునిగాక మృతి చెందినట్లు ప్రాథమికంగా నివేదిక అందజేశారు. 24 – 05 – 2020 : ఆదివారం ♦ డీజీపీ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పది మంది క్లూస్ టీం బృందాన్ని పంపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సిటీ క్లూస్ టీంతో పాటు ట్రెయినీ ఐపీఎస్ అధికారులు యోగేశ్ గౌతం, అఖిలేష్, రీజినల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ భాస్కర్, పోలీస్ అధికారులు ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాల కోసం అణువణువు అన్వేషించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్వేషణ సాగింది. ♦ సివిల్ పోలీస్ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీకోర్, సీసీఎస్ టీం, క్లూస్‌టీం, హైదరాబాద్ సిటీ క్లూస్‌టీం, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పలు కోణాల్లో కేసు మిస్టరీని ఛేదించడం కోసం కృషి చేశారు. 25 – 05 – 2020 : సోమవారం ♦ నిందితుడు సంజయ్‌కుమార్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు. ఆ తర్వాత హత్యల వెనుక ఉన్న కారణాలను సీపీ వెల్లడించారు. ఒక్కడే అంతా చేశాడా? గీసుకొండ సమీపంలోని గొర్రెకుంట వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన ఘటనలో నిందితుడు ఒక్కడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ ఒక్కడే తొమ్మిది మంది తినే ఆహారంలో నిద్రమాత్రలు కలపడం.. వారు మత్తులోకి జారుకున్నాక ఒక్కరొక్కరిని తీసుకొచ్చి బావిలో పడేయడం.. ఇదంతా తెల్లవారుజాము వరకు జరిగిందని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెబుతుండడంతో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పట్టించిన సీసీ కెమెరాలు తొమ్మిది మంది మృతదేహాలు బావిలో తేలిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేరే రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన వారు కావడం.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తనువు చాలించారని తొలిరోజు ప్రచారం సాగింది. ఇంతలోనే వేరే కారణంగా ఉండొచ్చని తేలగా.. మరుసటి రోజు ఐదు మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ఆరు బందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ పుటేజీల్లో సంజయ్ సైకిల్‌పై వరుసగా ఐదు రోజులుగా వచ్చినట్లు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా తొమ్మిది హత్యలు చేసిన తీరుతో పాటు వీటన్నింటికీ కారణమైన రఫీకా హత్య వివరాలు వెల్లడించాడు. అలాగే, మక్సూద్ కుటుంబం వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులు కూడా కొంత మేర పరిశోధనలో ఉపయోగపడినట్లు సమాచారం. -
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’హత్యల వెనుక దాగిన మరో మిస్టరీ బయటపడింది. నింది తుడు సంజయ్‌కుమార్ యాదవ్(24) సాగించిన 9 హత్యల కిరాతకానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. తాను చేసిన ఒక హత్య గురించి ఎక్కడ పోలీసులకు చెబుతారోనన్న భయంతోనే మిగిలిన వారిని అతను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పది హత్యలను నింది తుడు ఒకే రీతిలో అందరికీ నిద్రమాత్రలు ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్నాకే చేయడం యావత్ రాష్ట్రాన్ని గగుర్పాటుకు గురిచేసింది. వరంగల్ నగర శివారు గీసుగొండ మండలంలోని గొర్రెకుంటలో ఓ వ్యవసాయ బావిలో 9 మంది హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 21న లభించిన నాలుగు, 22న లభించిన ఐదు మృతదేహాలు కలిపి తొమ్మిది మందిని నిందితుడు సంజయ్ హత్య చేసి బావిలో పడేశాడని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇందుకుగల కారణాన్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఒంటరి మహిళకు దగ్గరై... జీవనోపాధి కొసం ఆరేళ్ల క్రితం బిహార్ నుంచి వరంగల్ చేరుకున్న సంజయ్ కుమార్ యాదవ్ మిల్స్ కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనె సంచులు తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. 20 ఏళ్ల కిందటే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి కరీమాబాద్‌లో స్థిరపడి పడి ఇదే కేంద్రంలో పని చేస్తున్న మహ్మద్ మక్సూద్ ఆలం (47) కుటుంబ సభ్యులతో అతనికి పరిచయమైంది. మక్సూద్‌తోపాటు ఇంట్లో ఆయన భార్య నిషా ఆలం(40), కూతురు బుష్రా ఖాతూన్ (20), కుమారులు మహ్మద్ షాబాజ్ ఆలం (19) మహ్మద్ సోహిల్ ఆలం (18), మనవడు (3), ఉండేవారు. ఆ పక్కనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా (37) ముగ్గురు పిల్లలతో ఉండేది. మక్సూద్ కుటుంబంతోపాటు రఫీకాతో కూడా సంజయ్‌కు పరిచయం ఏర్పడింది. రఫీకాకు డబ్బిస్తూ సంజయ్ ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్న రఫీకాకు నిందితుడు సంజయ్ మరింత దగ్గర కావడంతోపాటు కొద్ది రోజుల అనంతరం రఫీకాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అదే క్రమంలో గీసుగొండ మండలం జాన్‌పాక స్తంభంపల్లి ప్రాంతంలో రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని రఫీకా ఆమె ముగ్గురు పిల్లలతో కలసి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. రఫీకా కూతురుపై కన్ను... రఫీకాతో సహజీవనం చేస్తున్న సంజయ్ ఇదే క్రమంలో యుక్త వయసుకు వచ్చిన రఫీకా కుమార్తెపై కన్నేసి.. ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన రఫీకా.. సంజయ్‌తో పలుమార్లు గొడవ పడింది. అయినా సంజయ్ తన పద్ధతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా వ్యవహరిస్తుండంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఎలాగైనా రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్ తమ పెళ్లి విషయాన్ని బంధువులతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్దామని రఫీకాను తీసుకొని మార్చి 6న విశాఖపట్నం వైపు వెళ్లే గరీబ్‌రథ్ రైల్లో వరంగల్ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి అప్పటికే తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫీకాకు ఇచ్చాడు. కుట్రలో భాగంగానే రఫీకాతో కలసి రైలు పుట్బోర్డ్ వద్ద కూర్చొని మాట్లాడసాగాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో రైలు ఏపీలోని నిడదవోలు సమీపంలోకి రాగానే తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం మత్తులో ఉన్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి రైల్లోంచి తోసివేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు నంబర్ 19/2020 ద్వారా నమోదు చేశారు. రఫీకా చనిపోయిందని నిర్ధారించుకున్నాక రాజమండ్రి స్టేషన్లో దిగి తిరిగి మరో రైల్లో సంజయ్ వరంగల్ చేరుకున్నాడు. రఫీకా పశ్చిమ బెంగాల్‌లోని తమ బంధువులు ఇంటికి వెళ్లినట్లు ఆమె పిల్లలను నమ్మించాడు. ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకే ‘గొర్రెకుంట’పథకం... కొద్ది రోజుల అనంతరం తన అక్క కుమార్తె రఫీకా బంధువుల ఇళ్లలో లేదని, రఫీకా ప్రస్తుతం ఎక్కడ ఉందో చెప్పాలని మక్సూద్ ఆలం భార్య నిషా ఆలం.. సంజయ్‌ను నిలదీయడంతోపాటు పోలీసులకు చెబుతానని బెదిరించసాగింది. దీంతో కంగుతున్న సంజయ్ పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను హత్య చేయాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళిక రూపొందించాడు. ప్రణాళికను అమలు పర్చడంలో భాగంగా ఈ నెల 16 నుంచి 20 వరకు మక్సూద్, ఆయన కుటుంబం పని చేస్తున్న గొర్రెకుంటలోని గోనెసంచుల తయారీ గోదాంకు రోజూ వచ్చివెళ్లాడు. అదే సమయంలో గోదాం పరిసరాలను కూడా పరిశీలించి రెక్కీ నిర్వహించాడు. చివరకు మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను చంపి గోదాం పక్కనేపున్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 20న మక్సూద్ ఆలం మొదటి కుమారుడైన షాబాజ్ ఆలం పుట్టిన రోజని తెలియడంతో అదేరోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈ నెల 18న సంజయ్ వరంగల్ చౌరస్తాలోని రెండు, మూడు మెడికల్ షాపుల్లో 60కిపైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. ఈ నెల 20న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకొని మక్సూద్ కుటుంబంతో చాలా సేవు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా వున్న సమయంలో ఎవరికీ తెలియకుండా మొదట మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్ కుటుంబం ఉంటున్న ఇంటి పక్కనే ఉండే బిహార్ యువకులు శ్యాం, శ్రీరాంలు తాను వచ్చిన విషయాన్ని ఎవరికైనా చెబుతారేమోనని భయపడి వారు తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. దీంతో మక్సూద్, ఆయన భార్య నిషా ఆలం, కుమార్తె బుష్రా కాటూన్, కుమారులు షాబాజ్ ఆలం, సోహెల్ ఆలం, మూడేళ్ల మనుమడు... శ్యాం, శ్రీరాంలతోపాటు మక్సూద్ ఆహ్వానం మేరకు పుట్టినరోజు వేడుకకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌వాసి మహమ్మద్ షకీల్ మత్తులోకి జారుకున్నారు. దీంతో ఆర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 5 గంటల మధ్య మత్తులో ఉన్న తొమ్మిది మందిని పాడుపడ్డ బావి వద్దకు ఒక్కరొక్కరినీ తీసుకెళ్లి పడేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక మక్సూద్ గది నుంచి వాల్‌మార్ట్ నుంచి తెచ్చిన కిరాణ సామానుతోపాటు వారి సెల్ఫోన్లు, షకీల్ పర్సు తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు. సీసీ ఫుటేజీ, వాల్‌మార్ట్ సరుకులే కీలకం... ఈ హత్యలపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేయగా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో స్తంభంపల్లిలోని సంజయ్ ఇంట్లో తనిఖీ చేయగా మక్సూద్ ఆలం ఇంట్లో మాయమైన వాల్‌మార్ట్ సరుకులు లభ్యమయ్యాయి. ఇలా కచ్చితమైన ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉన్న సంజయ్‌కుమార్ యాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సీపీ అభినందనలు ఈ కేసును ఛేదించడంలో శ్రమించిన వరంగల్ ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుగొండ, పర్వతగిరి ఇన్స్పెక్టర్లు శివరామయ్య, పుల్యాల కిషన్, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్ టీం ఇన్స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, నందిరాం నాయక్, రాఘవేందర్, రమేష్కుమార్లతోపాటు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అభినందించారు. నిందితుడి వివరాలు సంజయ్ కుమార్ యాదవ్ (24) తండ్రి పేరు : పవన్రామ్, నుర్లపూర్ గ్రామం, బిగుసరాయ్ జిల్లా, బిహర్ రాష్ట్రం ప్రస్తుత నివాసం : స్తంభంపల్లి (జాన్‌పాక), గీసుగొండ మండలం, వరంగల్ రూరల్ జిల్లా మృతుల వివరాలు: 1. మహ్మద్ మక్సూద్ ఆలం (47), తండ్రిపేరు మక్పూల్, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 2. మహ్మద్ నిషా ఆలం (40), భర్తపేరు మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 3. మహ్మద్ బుష్రా ఖాటూన్ (20), మక్సూద్ ఆలం కూతురు, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 4. బిబ్లూ (03), మక్సూద్ ఆలం మనమడు 5. మహ్మద్ షాబాజ్ ఆలం(19), తండ్రి మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 6. మహ్మద్ సోహిల్ ఆలం(18), తండ్రి మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 7. మహ్మద్ షకీల్ (38), తండ్రి రోహిత్, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ అర్బన్ 8. శ్యాం కుమార్ షా (18), తండ్రి లక్ష్మన్ షా, మంజులావూర్, బిహార్ రాష్ట్రం 9. శ్రీరాం కుమార్ షా (21), తండ్రి రామేశ్వర్ షా, జగ్మొహర్, నమన్తవూర్ జిల్లా, బిహార్ -
సంచలన విషయాలను వెల్లడించిన వరంగల్ సీపీ
-
గొర్రెకుంట హత్య కేసులో సంచలన నిజాలు
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుకొండ మండలం గొర్రెకుంట హత్య కేసులో నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు పది మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ కృరత్వాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ మీడియా ముందు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సీపీ మాట్లాడారు. మక్సూద్ కుటుంబంతో పాటు మరో ఐదుగురిని మొత్తం పది మందిని సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేశాడని వరంగల్ సీపీ నిర్ధారించారు. ఇది భయమా శాడిజమా అనేది అంతుపట్టకున్నా నిందితుడు మాత్రం ఒక హత్యనుంచి తప్పించుకోనేందుకు మరో తొమ్మిది హత్యలు చేసాడు కేసు వివరాలను సీపీ తెలియజేస్తూ.. ‘గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మక్సూద్ కుటుంబం కనిపించడం లేదని ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఫిర్యాదు మేరకు మే 21వ తేదీన కేసు నమోదు చేశాం. అదే రోజున సమీపంలోని బావిలో తొలుత (గురువారం) నాలుగు శవాలను బయటకు తీశాం. దానిలో మక్సూద్, భార్య, కూతురు, కుమారుడి శవాలు ఉన్నాయి. మరో రోజు (శుక్రవారం) అదే బావిలో మరో ఐదు శవాలు బయటపడ్డాయి. ఇది హత్య లేక ఆత్మాహత్య..? అని నిర్ధారించడానికి ఆరు టీంలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్ నుంచి క్లూ టీమ్ కూడా రప్పించాం. ఈ క్రమంలోనే కేసును చేధించాం. (గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..!) వివాహేతర సంబంధం.. కూతురిపై కన్ను మక్సూద్ కుటుంబం మొత్తం గోనె సంచీలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు. వీరికి బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ నాలుగేళ్ల కిత్రం పరిచయం అయ్యాడు. మక్సూద్ భార్య అక్క కూతూరు రఫీకా పశ్చిమ బెంగాల్ నుంచి తన కూతురుతో పాటు వచ్చి ఇక్కడే పని చేస్తోంది. దీంతో రఫీకాకు సంజయ్ కూమార్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అది వివాహేతర సంబంధంగా మారింది. వారిద్దరూ కలిసి సహజీవనం సాగించారు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెతో నిందితుడు చనువుగా ఉండడాన్ని ప్రయత్నించాడు. దీనిని గమనించిన రఫీకా, సంజయ్‌తో పలుమార్లు గోడవపడటం జరిగింది. అయిన కుడా సంజయ్ తన పద్దతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా వ్యవహరించాడు. తనను పెళ్ళి చెసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించడంతో, నిందితుడు రఫీకాను అడ్డు తోలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. (వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య) ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి రఫీకాను పెళ్లి చేసుకుంటా అని మార్చి 7న పశ్చిమ బెంగాల్ తీసుకుపోతా అని నమ్మించాడు. ఏడో తేదీన ఇద్దరూ గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కత్తాకు బయలుదేరారు. అప్పటికే రఫీకా కూతూరుపై కన్నుపడంతో ఆమెను అంతం చేయాలని కుట్రపన్నాడు. దీనిలో భాగంగా ప్రయాణ సమయంలో మజ్జికలో నిద్రమాత్రలు ఇచ్చి.. తెల్లవారుజామున 3 గంటలకు చున్నీతో మెడకు బిగించి రఫీకాను రైలు నుంచి కిందకు తోశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదోవులు ప్రాంతంలో రఫీకా మృత దేహాన్ని కూడా అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కేసుగా అది నమోదు అయ్యింది. (చినిగిన వలస బతుకులు!) అన్నంలో నిద్రమాత్రలు కలిపి.. బావిలో ఆ తరువాత సంజయ్‌ను మక్సూద్ కుటుంబం సంజయ్ కుమార్‌ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. రఫీకా ఎక్కడా అంటూ రోజూ నిలదీసేవారు. ఈ క్రమంలోనే వారిపై కక్ష పెట్టుకున్నాడు. బండారం బటయపడుతుందేమో అని వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 20 తేదీన దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. అదే రోజున మక్సూద్ పెద్ద కుమారుడి పుట్టిన రోజు కావడంతో వారందరినీ హతమార్చాలని పథకం రచించాడు. హన్మకొండలో నిద్రమాత్రలు కొన్నాడు. అదే రోజు వాళ్లు వండుకున్న భోజనంలో, కూల్ డ్రింక్‌లో ఎవరికీ తెలియకుండా కలిపాడు. ఈ క్రమంలో మక్సూద్‌తో పాటు బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం కూడా ఉన్నారు. వారిద్దరూ బతికితే తన బండారం బయటపడుతుందని భావించి.. వారి ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాడు. నిద్ర మాత్రలు కలిపిన భోజనం తినడంతో రాత్రి 12కు లోపు వాళ్లంతా నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత గోనె సంచిలో పెట్టి మక్సూద్ కుటుంబాన్ని బావిలో వేశాడు. అనంతరం ఇద్దరు బిహార్ యువకులను కూడా బావిలో తోశాడు. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ తతంగం జరిగింది. ఆ తరువాత సైకిల్‌పై సంజయ్ బయటకు వెళ్లిపోయాడు. నిందితుడు చేసింది చాలా ఘోరమైన చర్య. తప్పకుండా కఠిన చర్య పడేలా చూస్తాం.’ అని వరంగల్ సీపీ తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృతుల ఘటన ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పోలీసులను శనివారం ఆదేశించగా, కేంద్ర హోంశాఖ సైతం ఈ ఘటనపై ఆరా తీసింది. ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ‘క్లూ’స్ టీంను పంపించారు. ఆదివారం ఉదయమే వరంగల్‌కు చేరుకున్న ‘క్లూ’స్ టీం మొదట ఎంజీఎంలో మృతదేహాల నుంచి, ఆ తర్వాత గొర్రెకుంటలో ఘటన ప్రదేశమైన బావి, పక్కనే వారు నివాసం ఉండే ఇళ్ల నుంచి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కేసు విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ ‘క్లూ’స్ టీం హై సెక్యూరిటీ మధ్య నేర స్థలంలో ఆధారాలు సేకరించింది. ఈ బృందంలో క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్‌తో పాటు ఎక్స్‌ఫర్ట్స్ ఉన్నారు. పాడుపడిన వ్యవసాయ బావితో పాటు, మృతులు నివాసం ఉండే ఇండ్లను ఉదయమే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బృందం ‘క్రైం సీన్ డు నాట్ క్రాస్’ అన్న రిబ్బన్ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫొటోగ్రఫీ, వీడియో కెమెరాల ద్వారా నేరస్థలంలో సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడ కనిపించిన భౌతిక ఆధారాలను సేకరించారు. అంతకు ముందు ఎంజీఎంలో మృతదేహాలపై ఫింగర్ప్రింట్లతో పాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను సేకరించినట్లు ఆసుపత్రివర్గాల ద్వారా తెలిసింది. -
కనిపించని సంజయ్‌కుమార్ భార్య..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీప బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనపై మిస్టరీ వీడింది. అందరూ అనుమానిస్తున్నట్లుగానే బావిలో శవాలుగా తేలిన వారంతా హత్యకు గురైనట్లు తేలింది. ఈ మేరకు తానే హత్య చేశానని నిందితుడు, బీహార్‌కు చెందిన కార్మికుడు సంజయ్‌కుమార్ యాదవ్ ఆదివారం అంగీకరించినట్లు తెలిసింది. కుట్రపూరి తంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెకుంటలో మృతుల ఘటన మిస్టరీ వీడింది. ఈ హత్యలకు పాల్పడింది తానేనని బీహార్‌కు చెందిన కార్మికుడు సంజయ్‌కుమార్ యాదవ్ ఆదివారం అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఏడుగురిని చంపేయాలని భావించినా తర్వాత ఇద్దరు బీహారీలను సైతం మట్టుపెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇందుకు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం వరంగల్ నగరంలో నాలుగైదు మెడికల్ షాపుల నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేసిన సంజయ్, హత్య చేసే రోజు కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. నిద్రమాత్రల కారణంగా అపస్మారక స్థితికి చేరిన వారిని స్నేహితులతో కలిసి గోనే సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా హత్యలకు కారకుడు సంజయ్‌కుమార్ యాదవే అయినా.. అతని వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. హత్యలకు కారణం ఆర్థిక లావాదేవీలా? వివాహేతర సంబంధాలా? అన్న చర్చ జరుగుతుండగా, అయితే ఢిల్లీలో ఉన్న మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ ప్రమేయం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా సంజయ్‌కుమార్ యాదవ్‌తో పాటు మక్సూద్ ఆలం మరదలు, యాకూబ్, మంకుషా, ఆటోడ్రైవర్ మోహన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమచారం. పూర్తి వివరాల కోసం వారిని విచారిస్తున్నట్లు తెలిసింది.(గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్.. ) స్తంభంపల్లి ఇంట్లో ఆధారాలే కీలకం.. సంజయ్‌కుమార్ యాదవ్ నివాసం ఉండే స్తంభంపల్లిలో అతడు నివాసం ఉండే ఇంట్లో లభ్యమైన ఆధారాలే పోలీసుల విచారణకు కీలకంగా మారినట్లు తెలిసింది. తొమ్మిది మంది మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు గొర్రెకుంట బావికి సమీపాన రాంచందర్ అనే వ్యక్తి ద్వారా లభ్యమైన రెండు సెల్ఫోన్లు దొరకడం.. ఆ సెల్ఫోన్లు మక్సూద్ ఆలం. ఆయన భార్య నిషా ఆలంలకు చెందినవి కావడం.. ఆ ఫోన్ల కాల్‌డేటా ఆధారంగా కూపీ లాగారు. అలాగే హత్య జరిగే కొద్ది గంటల ముందు(20న సాయంత్రం 7 గంటలకు) వెంకట్రామ థియేటర్ సమీపంలో యాకూబ్, డ్రైవర్ షకీల్, సంజయ్‌కుమార్ కలుసుకుని గొర్రెకుంటలో మక్సూద్ ఇంటికి వెళ్లడం, ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్‌కుమార్ మాత్రమే వెంకట్రామ థియేటర్ చౌరస్తా నుంచి ఇంటికి వెళ్లడం రికార్డయిన సీసీ ఫుటేజీలు పోలీసుల పరిశోధనకు ఉపకరించినట్లు సమాచారం. మక్సూద్ ఆలం వారం రోజుల క్రితం రంజాన్ పండుగ కోసం ఓ షాపింగ్ మాల్లో సుమారు రూ.25 వేల సామగ్రి ఖరీదు చేసినట్లు తెలిసింది. అయితే హత్యలు జరిగిన మరుసటి రోజు(21న) ఉదయం మక్సూద్ ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్ప సిలిండర్‌తో సహా సామగ్రి పోలీసులకు కనిపించలేదు. ఆ సిలిండర్, సామగ్రి సంజయ్‌కుమార్ యాదవ్ ఇంట్లో కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో ఆ ఇంట్లో అతని భార్య కనిపించకపోవడంతో సంజయ్‌ను వాకబు చేయగా, బీహార్‌కు వెళ్లినట్లు చెప్పినట్లు తెలిసింది. పోలీసులు బీహార్‌లో ఆయన భార్య బంధువులను కూడా ఫోన్లో వాకబు చేయగా, ఆమె అక్కడకు రాలేదని చెపినట్లు సమాచారం. ఏ రోజు ఏం జరిగింది.. తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏమిటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం(55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. మరుసటి రోజు శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం(18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బీహార్ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా(21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం, సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్ (30) అనే డ్రైవర్ మృదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ కాల్‌డేటా, స్తంభంపల్లిలో నివాసం ఉంటున్న సంజయ్‌కుమార్ యాదవ్ ఇంట్లో దొరికిన ఆధారాలతో అనుమానితుడిగా విచారించడంతో గొర్రెకుంట గుట్టు రట్టయ్యింది. -
మత్తు మందిచ్చి.. బావిలో పడేసి..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 మరణాల వెనుకున్న మిస్టరీ వీడింది. వరంగల్ నగర శివారు గొర్రెకుంటలోని ఓ పాడుపడిన వ్యవసాయ బావిలో ఈ నెల 21, 22 తేదీల్లో 9 మృతదేహాలు బయటపడటం వెనుక జరిగింది సామూహిక హత్యలేనని తేలింది. మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానిస్తున్న సంజయ్‌కుమార్ యాదవ్ తన బిహార్ స్నేహితులతో కలసి వారిని హత్య చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని ప్రధాన నిందితుడు ఈ కేసు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచా రణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ నెల 20న రాత్రి ముందుగా కూల్‌డ్రింక్స్‌లో నిద్ర మాత్రలు ఇచ్చి వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నాక స్నేహితుల సాయంతో గోనెసంచుల్లో పెట్టి పాడుపడిన వ్యవసాయబావిలో పడేసినట్లు నింది తులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సంజయ్‌కుమార్‌కు ఎవరెవరు సహకరించారనేది ఇంకా తెలియాల్సి ఉండగా సంజయ్‌తోపాటు మిడిదొడ్డి యాకూబ్, మంకుషా, మక్సూద్ మరదలు, ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మక్సూద్ కుమారుడు సోహిల్ ఆలం పుట్టినరోజు 10 రోజుల క్రితం జరగ్గా అదేరోజు 9 మంది హత్యకు నిందితులు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గుట్టువిప్పిన పోస్టుమార్టం సంజయ్‌కుమార్, ఇతర నిందితులు సాగించిన సామూహిక హత్యాకాండను పోస్టుమార్టం నివేదికలు నిగ్గుతేల్చాయి. మరణించిన తొమ్మిది మందిలో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్ వెల్లడించారు. మిగతా ఇద్దరిని మాత్రం వారు చనిపోయాక నిందితులు బావిలో పడేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ హత్యల కోసం ఈ నెల 20న రాత్రి 7 గంటలకు సంజయ్‌కుమార్ యాదవ్ డ్రైవర్ షకీల్‌కు ఫోన్ చేసి వెంకట్రామ థియేటర్ చౌరస్తాకు రావాలని సూచించగా అతను యాకూబ్ పాషాతో కలసి గొర్రెకుంట గోనెసంచుల గోదాం వద్దకు వచ్చినట్లు సమాచారం. ఆ ముగ్గురు కలసి వెంకట్రామ థియేటర్ చౌరస్తా సమీపంలో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డవగా 21న ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్‌కుమార్ మాత్రమే తిరిగి వచ్చినట్లు రికార్డయినట్లు సమాచారం. అదే విధంగా గొర్రెకుంట బావికి కిలోమీటర్ దూరంలో లభ్యమైన సెల్‌ఫోన్ కాల్‌డేటా కూడా హంతకుడిని కనిపెట్టడంలో కీలకంగా మారినట్లు తెలిసింది. ఈ క్లూల ద్వారా కూడా పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు చెబుతున్నారు. కాగా, గొర్రెకుంటలో 9 మంది సామూహిక హత్యల వెనుక ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయా లేక వివాహేతర సంబంధాలా అనే విషయం తెలియాల్సి ఉంది. మహ్మద్ మక్సూద్ ఆలం గోనెసంచులు కుడుతూ జీవనం గడుపుతున్నా ఇటీవలే ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రంజాన్ సందర్భంగా ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు రూ. 25 వేల విలువైన సామగ్రి ఖరీదు చేసినట్లు సమాచారం. అలాగే భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్‌కు సంజయ్‌కుమార్ యాదవ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. బుష్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు కూడా తెలిసింది. ఇంటి పైవాటాలో ఉంటున్న బిహార్‌కు చెందిన కార్మికులు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకొని బుష్రాపై కన్నేసినట్లు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్‌కుమార్ పథకం ప్రకారం 9 మందిని హతమార్చినట్లు మరో ప్రచారం ఉంది. ఏదేమైనా నేడో, రేపో ఈ ఘటనపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. కాగా, హైదరాబాద్ సిటీ క్లూస్ టీం ఆదివారం గొర్రెకుంటలో పలు ఆధారాలను సేకరించింది. ఎంజీఎంలో ఉన్న 9 మృతదేహాలపై ఫింగర్‌ప్రింట్స్‌తోపాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను కూడా సేకరించినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది. -
వరంగల్ హత్యల కేసు: వీడిన మిస్టరీ
-
గొర్రెకుంట గుట్టు వీడింది: సంచలన నిజం
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. 9 మందిని తానే హత్య చేశానని కేసులో నిందితుడిగా ఉన్న బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పట్లు సంజయ్ చెప్పాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే ఢిల్లీలో మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ డైరెక్షన్లోనే వారందరినీ దారుణంగా హత్య చేశానని సంజయ్ చెప్పడం కొసమెరుపు. ఇక మక్సూద్ భార్య, కూతురితో సంజయ్ వాట్సప్ చాటంగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తొలుత ఇద్దరు బిహారీలను వదిలేద్దామని సంజయ్ భావించగా.. కేసు బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం సంజయ్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్ పోలీసులు కేసును చేధించడం గమనార్హం. సంఘటన వివరాలు.. తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్ (20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. (విషప్రయోగం చేసి చంపారనే అనుమానం?) శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం,సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్(30) అనే డ్రైవర్ మృతదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అనుమానితుడి భావిస్తున్న సంజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కోణంలోనే తొలి నుంచి విచారించారు. పోలీసులు భావించిన విధంగానే వారు హత్యకు గురైయ్యారు. -
గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ
-
గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా.. ఆత్మహత్యా.. ఒకవేళ హత్యకు గురైతే చంపిందెవరు.. ఆత్మహత్యకు పాల్పడితే అందుకు కారణమేమిటి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఇద్దరు బీహార్ కార్మికులు, ఓ డ్రైవర్ సహా మొత్తం తొమ్మిది మంది మృతి వెనుక అసలు విషయమేమిటి... ఇలా అనేక సందేహాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. అయితే బావిలో నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్లే వీరంతా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. ఏడు మృతదేహాల్లో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ పాడుపడిన బావిలో తొమ్మిది మంది మృతి చెందిన దుర్ఘటనపై విచారణ ఇంకా కొలిక్కి రాని విషయం తెలిసిందే. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన విధంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాల(సిట్) పరిశోధన ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ ఘటన వరంగల్ పోలీసులకు సవాల్‌గా మారగా, త్వరలోనే ఆ తొమ్మిది మంది కార్మికుల మృతిపై మిస్టరీ వీడనుందని అంటున్నారు. పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిపాటి పురోగతి సాధించారు. ఇప్పటికే మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాటూన్ ప్రియుడు యాకూబ్‌తో పాటు బీహార్‌కు చెందిన కార్మికులు సంజయ్ కుమార్ యాదవ్, మంకుషా లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వరంగల్‌కు చెందిన మరో ఇద్దరిని శనివారం పట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్‌కు చెందిన ఆ ఇద్దరి వద్ద నుంచే మృతులలో ఇద్దరికి చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు సెల్ఫోన్లు తొమ్మది మంది మృతి చెందిన బావి సమీపంలో దొరికినట్లు ఆ ఇద్దరు వెల్లడించినట్లు తెలిసింది. సెల్ఫోన్లు చేజిక్కించుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. (చనిపోయారా.. చంపేశారా?) కాగా ఆ రెండు సెల్ఫోన్లలో ఒకటి మక్సూద్ ఆలంకు చెందినది కాగా, మరోటి ఆయన కూతురు బుష్రా ఖాతూన్‌గా ప్రచారం ఉంది. ఆ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న ‘సిట్’, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఫోన్‌కాల్స్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 6 గంటల తరువాత మక్సూద్ వీరితో ఫోన్లో మాట్లాడాడు. పోలీసులు బీహారీ యువకులను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మరోసారి విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో మంకుషా వాంగ్మూలం కీలకంగా మారింది. ఫోరెన్సిక్, నిఘావర్గాల ఆరా... గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై ఫోరెన్సిక్, కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీశారు. తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రజామాలిక్ బృందం, వారి మృతికి కారణమైన బావిని పరిశీలించింది. బార్దాన్ సంచుల గోదాము, ఆ గోదాం ఆవరణలో వారు నివాసం ఉండే క్వార్టర్లను కూడా వారు పరిశీలించారు. పాడు పడిన వ్యవసాయ బావిలో తొమ్మిది మంది మృతదేహాలు తేలిన ఘటనపై నివేదిక పంపేందుకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాల అధికారులు సైతం సందర్శించారు. (గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...) సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ రీజనల్ ఇంటలిజెన్స్ అధికారులు వేర్వేరుగా పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ‘సిట్’ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అందులో ఇద్దరినీ శనివారం ఉదయం గొర్రెకుంటలోని 9 మంది మృతి చెందిన బావి వద్దకు తీసుకు వచ్చి పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్ యాదవ్, మంకుషాలను సంఘటన వద్దకు తీసుకు వచ్చిన పోలీసులు ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ తరహాలో ఆరా తీశారు. కాగా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు సెల్‌ఫోన్ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. ఫోన్ కాల్స్ వివరాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ మక్సూద్ తనయ బుష్రా ఖాతూన్, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. -
ప్రాణాలతో వుండగానే బావిలో...
-
గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...
సాక్షి ప్రతినిధి, వరంగల్: తీవ్ర కలకలం రేపిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై అసలేం జరిగిందనే దానిపై కేంద్ర హోం శాఖ శనివారం ఆరా తీసినట్లు సమాచారం. వ్యవసాయ బావిలో తొమ్మిది మృతదేహాలు తేలిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు శనివారం గొర్రెకుంటలోని బావిని పరిశీలించారు. కాగా, తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు. వాళ్లంతట వాళ్లే కావాలని బావిలోకి దూకారా.. లేదంటే మత్తు, విషం లాంటిది ప్రయోగించి బతికి ఉండగానే బావిలో పడేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) పోలీసుల అదుపులో ముగ్గురు.. ఈ కేసులో మూడు రోజులు గడిచినా పురోగతి లేదు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసు ప్రత్యేక బృందాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు బావిలో శవమై తేలిన బుష్రా ఖాతూన్ ప్రియుడు యాకూబ్ కాగా, మరో ఇద్దరు బిహార్‌కు చెందిన కార్మికులు. యాకూబ్‌ను శుక్రవారమే అదుపులోకి తీసుకోగా, శనివారం సంజయ్ కుమార్ యాదవ్, మంకుషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు రెండు సెల్ఫోన్లు దొరికినట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి మక్సూద్‌ది కాగా, మరొకటి బుష్రా ఖాతూన్‌దిగా చెబుతున్నారు. ఆ రెండు ఫోన్ల కాల్‌డేటా వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. (చనిపోయారా.. చంపేశారా?) గొర్రెకుంటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ ముగ్గురు ఆనుమానితులు అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు, శనివారం ఉదయం గొర్రెకుంటలోని బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్ యాదవ్, మంకుషాను సంఘటన వద్దకు తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. మొదటి అంతస్తులోని మరణించిన ఇద్దరు బిహారీల గదిని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. బంగ్లా మీది నుంచి ఎవరైనా బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. (గీసుకొండ ఘటనపై పలు అనుమానాలు) పకడ్బందీగా దర్యాప్తు చేయండి: హోంమంత్రి వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్ పొలీసు కమిషనర్ వి.రవీందర్‌ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సెల్‌ఫోన్ సంభాషణలే కీలకం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల వారంతా చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ రజామాలిక్ పేర్కొన్నారు. బావిలోనే తుది శ్వాస విడిచారని, అయినా వారి విస్రాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, వారిపై ఫుడ్ పాయిజన్ జరిగిందా.. లేదా అనేది తేలాలంటే ఫోరెన్సిక్ నివేదిక రావాలని తెలిపారు. నలుగురు మృతుల ఒంటిపై గాయాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసుల పరిశోధనకు సెల్‌ఫోన్ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. బుష్రా ఖాతూన్, ఆమెతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తో పాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో వాటి కోసం గాలిస్తున్నారు. మార్చురీలోనే మృతదేహాలు తొమ్మిది మృతదేహాలు కూడా శనివారం రాత్రి వరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరిచారు. శనివారం ఉదయం మృతదేహాలను ఖననం చేస్తారని భావించారు. కానీ మక్సూద్ బంధుమిత్రులు పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నారనే సమాచారంతో మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, కేసు ఓ కొలిక్కి వచ్చేవరకు మృతదేహాలను భద్రపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.