సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యలకు సంబంధించి మృతుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం కోల్‌కతా నుంచి వరంగల్ చేరకున్న మక్సూద్ అలం భార్య నిషా బంధువులు.. ఎంజీఎం మార్చురీకి వెళ్లారు. అనంతరం ఈ హత్యలపై వారు మాట్లాడుతూ.. నిందితుడు ఒక్కడే 9 మందిని ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ సామూహిక హత్యల వెనక కుట్ర కోణం దాగుందని భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. (చదవండి : ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు)
కాగా, గొర్రెకుంటలోని ఓ వ్యవసాయ బావిలో 9 మంది మృతదేహాలు లభించడం కలకలం రేపిన సంగతి తెలిసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు సంజయ్‌కుమార్ అరెస్ట్ చేశారు. నిషా అలం అక్క కుమార్తె రఫీకాతో సహజీవనం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే ఈ హత్యలకు కారణమని తేల్చారు.(చదవండి : ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు)
Comments
Please login to add a commentAdd a comment