సంఘటనా స్థలానికి వెళ్తున్న క్లూస్ టీం సభ్యులు
వరంగల్ అర్బన్, గీసుకొండ : గొర్రెకుంట హత్యల కేసులో 9 మంది మృత దేహాలకు ఈనెల 22న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సందర్భంగా మృత దేహాల నుంచి పరీక్షల కోసం గుండె, కాలేయంతో పాటు శరీరం లోపలి పలు అవయవాలు, ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న ద్రవం, బావిలోని నీటి శాంపిళ్లు.. ’విశ్రా’ను సేకరించి తొమ్మిది బాక్సుల్లో భద్రపరిచారు. వీటిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు గీసుకొండ పోలీసులు తీసుకుని వెళ్లారు. నిపుణులు ల్యాబ్‌లో పరీక్షించి 15 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు నమోదు చేయనున్నారు.(హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం)
Comments
Please login to add a commentAdd a comment