
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. రఫీకా కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు వీరు ఆధారాలు సేకరించారు. దీంతో సంజయ్‌పై పోక్సో చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉంది. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే.
ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414)
Comments
Please login to add a commentAdd a comment