ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కాజీపేట అర్బన్ : కంచె చేను మేసిన చందంగా కన్న తండ్రి, మేనమామ కలిసి మైనర్లు అయిన కవలలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇది. దీనికి సంబంధించి వరంగల్ ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా షీ టీమ్స్ ఏసీపీ బాబురావు శుక్రవారం రాత్రి వివరాలు వెల్లడించారు. వరంగల్ కాశిబుగ్గలోని శ్రీనివాసకాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కవలల కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడేళ్ల నుంచి మేనమామ, ఏడాది కాలంగా తండ్రి బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే, ఎవరికైనా చెబితే ఏమవుతుందోనన్న భయంతో బాలికలు లోలోపల కుమిలిపోతున్నారు. ఇటీవల వేధింపులు తీవ్రంగా కావడంతో తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు విషయాన్ని వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు షీ టీంకు సమాచారం ఇవ్వగా.. నిందితులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.
మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
మామునూరు: అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 58 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన శుక్రవారం మధ్యా హ్నం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. తిమ్మాపురం గ్రామంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటి పక్కన ఉన్న పొలంలో ఐనవో లు మండలం గర్నెపల్లికి చెందిన చిదురాల యాకయ్య(58) పాలేరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా మొక్కజొన్న కంకులు ఇస్తానని చేనులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించా డు. ఇంతలోనే పానను పిలుస్తూ తల్లి రాగా యాకయ్య పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆయనను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించా రు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment