టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ : గీసుకొండలో ఉద్రిక్తత | Tension in Geesukonda | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ: గీసుకొండలో ఉద్రిక్తత

Published Wed, Apr 16 2014 3:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Tension in Geesukonda

వరంగల్‌: గీసుకొండలో టీఆర్ఎస్కు చెందిన  రెండు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో అక్కడ  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  రెండు వర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, పరకాల టిఆర్ఎస్ అభ్యర్థి ఎం.సహోదర్‌రెడ్డి సమక్షంలోనే ఈ  ఘటన జరిగింది.

మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్ పార్టీలో చేరే సమయంలోనే తనకు పరకాల శాసనసభ స్థానం టికెట్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు పార్టీ వరంగల్ తూర్పు స్థానం కేటాయించింది. కొండా మురళి దంపతులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం స్థానిక నాయకులకు, కార్యకర్తలకు ఇష్టంలేదు. దాంతో ఇక్కడ తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement