
న్యూఢిల్లీ: టెక్నాలజీ ఆధారిత మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ తాజాగా బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ సేవలు అందించే వైబ్రెంట్ స్క్రీన్‌ను కొనుగోలు చేసింది. తమ స్టాఫింగ్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు.
సీఐఈఎల్ హెచ్‌ఆర్ ఇటీవల జాంబే, ఆర్‌జీ స్టాఫింగ్, కోర్స్‌ప్లే, థామస్ అసెస్‌మెంట్స్ / పీపుల్ మెట్రిక్స్ మొదలైన సంస్థలను కొనుగోలు చేసింది. వైబ్రెంట్ స్క్రీన్ సుమారు 24 సంవత్సరాలుగా ఉద్యోగాలు, విద్య, క్రిమినల్ రికార్డులు, డేటాబేస్ లిస్టింగ్, క్రెడిట్ హిస్టరీ, ఐడెంటిటీ ధృవీకరణ మొదలైన వాటి కోసం వెరిఫికేషన్ సేవలు అందిస్తోంది. ఫార్చూన్ 500 కంపెనీలతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో కంపెనీకి 240 పైచిలుకు క్లయింట్లు ఉన్నాయి.
మరోవైపు, సీఐఈఎల్ హెచ్‌ఆర్‌కి ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. ఇష్యూ కింద తాజాగా షేర్ల జారీ ద్వారా రూ. 335 కోట్లు సమీకరించనుండగా, ప్రమోటర్లు..ఇతరత్రా షేర్‌హోల్డర్లు 47.4 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద విక్రయించనున్నారు.