నా టీమ్‌కు సక్సెస్‌ రావాలి | Director Puri Jagannadh Launches Bluff Master Title Logo | Sakshi
Sakshi News home page

నా టీమ్‌కు సక్సెస్‌ రావాలి

Published Tue, Aug 7 2018 1:14 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

Director Puri Jagannadh Launches Bluff Master Title Logo - Sakshi

సత్య దేవ్, పూరి జగన్నాథ్, గోపీ గణేశ్, శివలెంక కృష్ణప్రసాద్‌

ఆశ అత్యాశగా మారినప్పుడే అనర్థాలు ఏర్పడతాయి. అలాంటి అత్యాశపరులను టార్గెట్‌ చేసే వ్యక్తి కథే ‘బ్లఫ్‌ మాస్టర్‌’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ సినిమాకు అఫీషియల్‌ రీమేక్‌ ఇది.   శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో సత్య దేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేశ్‌ పట్టాభి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రమేశ్‌ పిళ్లై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను దర్శకుడు పూరి జగన్నాథ్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ – ‘‘గణేశ్‌ దర్శకుడిగా నాకు ఇష్టం. నా ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేశాడు. సత్య, సునీల్‌ కశ్యప్‌ ఇలా నా టీమ్‌ మెంబర్స్‌ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి.

కృష్ణప్రసాద్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘డబ్బింగ్‌ పూర్తయింది. ఈ నెలలోనే పాటలు, టీజర్‌ను రిలీజ్‌ చేస్తాం. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌. ‘‘మా బాస్‌ పూరిగారి చేతుల మీదగా లోగో రిలీజ్‌ కావడం హ్యాపీగా ఉంది. ఆయన పుట్టిన రోజే ఈ సినిమా రిలీజ్‌ కావడం ఇంకా హ్యాపీ. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న సినిమాలో హీరోగా చేయడం నా అదృష్టం’’ అన్నారు సత్యదేవ్‌. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌. కెమెరా: దాశరధి శివేంద్ర, డైలాగ్స్‌: పులగం చిన్నారాయణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement