రీమేక్ సినిమాతో వస్తున్న హ్యాండ్సమ్ హీరో | Adavi Sesh in Sathuranga Vettai Remake | Sakshi
Sakshi News home page

రీమేక్ సినిమాతో వస్తున్న హ్యాండ్సమ్ హీరో

Published Thu, Feb 2 2017 2:02 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

రీమేక్ సినిమాతో వస్తున్న హ్యాండ్సమ్ హీరో - Sakshi

రీమేక్ సినిమాతో వస్తున్న హ్యాండ్సమ్ హీరో

క్షణం సినిమాతో సైలెంట్ హిట్ కొట్టిన అడవి శేష్.. మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన చిన్న సినిమా చతురంగ వేట్టైని తెలుగు రీమేక్ చేస్తున్నాడు శేష్. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది.

వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను గోపి గణేష్ దర్శకత్వంలో తెలుగులో రూపొందిస్తున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్లో సినిమాను ప్రారంభించి జూలైలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement