ఘరానా మోసగాడు | Satyadev's next is titled Bluff Master | Sakshi
Sakshi News home page

ఘరానా మోసగాడు

Published Sun, Sep 30 2018 5:53 AM | Last Updated on Sun, Sep 30 2018 5:53 AM

Satyadev's next is titled Bluff Master - Sakshi

నందితా శ్వేత, సత్యదేవ్

‘జ్యోతిలక్ష్మీ, ఘాజీ’ చిత్రాల ఫేమ్‌ సత్యదేవ్‌ హీరోగా గోపీ గణేశ్‌ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్లఫ్‌ మాస్టర్‌’. నందితా శ్వేత కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో రమేష్‌ పిళ్లై నిర్మించారు. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా చితీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్‌ మాట్లాడుతూ– ‘‘ఎవరో నలుగరు రచయితలు నాలుగు గోడల మధ్య కూర్చుని రాసిన కథ కాదిది. వాస్తవాలను కథగా మలిచి సినిమా చేశాం. మాయ మాటలు చెప్పి మోసగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు.

మోసపోయిన తర్వాత అయ్యో మోసపోయాం అని బాధితులు బాధపడుతున్నారు. ఇలాంటి వాటికి ప్రతిరూపమే ఈ సినిమా. ఇందులో ఘరానా మోసగాడి పాత్రలో సత్యదేవ్‌ కనిపిస్తారు. సత్య బాగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో పాటలను రిలీజ్‌ చేస్తాం. నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’’ అన్నారు రమేష్‌. ఫృథ్వీ, బ్రహ్మాజీ, ఆదిత్యామీనన్‌ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్‌.డి. వినోద్, అడిషనల్‌ డైలాగ్స్‌: పులగం చిన్నారాయణ,  సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement