'సై రా' సునీల్..? | sunil role in sye raa narasimha reddy | Sakshi
Sakshi News home page

'సై రా' సునీల్..?

Published Sun, Sep 17 2017 8:45 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

'సై రా' సునీల్..?

'సై రా' సునీల్..?

ఉంగరాల రాంబాబు సినిమాతో మరోసారి నిరాశపరిచిన హీరో సునీల్, ఇక క్యారెక్టర్ రోల్స్ లో నటించేందుకు రెడీ అని ప్రకటించేశాడు. త్వరలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తానని తెలిపిన సునీల్ ఓ భారీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'లో నటించే అవకాశం మిస్ చేసుకున్న ఈ కామెడీ స్టార్ ఇప్పుడు చిరు 151వ సినిమా 'సై రా నరసింహారెడ్డి'లో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

అయితే పూర్తిగా సీరియస్ మోడ్ లో సాగే ఈ సినిమాలో సునీల్ ఏ తరహా పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ముందే చెప్పినట్టుగా కమెడియన్ రోల్ లో నటిస్తాడా..? లేక సీరియస్ పాత్రలోనే కనిపిస్తాడా చూడాలి. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి హేమా హేమీలు నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement