ఉంగరాల’కి వాయిస్‌ | ungarala rambabu released on 15th of this month | Sakshi
Sakshi News home page

ఉంగరాల’కి వాయిస్‌

Published Sat, Sep 2 2017 12:12 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

ఉంగరాల’కి వాయిస్‌

ఉంగరాల’కి వాయిస్‌

ఒక హీరో సినిమాకి మరో హీరో మాట సాయం చేయడం కామన్‌గా జరుగుతుంటుంది. అయితే, ఓ హీరో సినిమాకి నిర్మాత మాట సాయం చేయడం విశేషం. సునీల్, మియా జార్జ్‌ జంటగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన ‘ఉంగరాల రాంబాబు’ ఈ నెల 15న విడుదలవుతోంది.  ఈ చిత్రానికి నిర్మాత ‘దిల్‌’ రాజు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. పరుచూరి కిరీటి మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమాకి మాట సాయం చేసేందుకు అంగీకరించిన రాజుగారికి ధన్యవాదాలు.

ఆయనతోనే వాయిస్‌ ఓవర్‌ చెప్పించడానికి ఓ ప్రత్యేకత ఉంది. అది సినిమా రిలీజ్‌ రోజే తెలుస్తుంది. సినిమా విషయానికొస్తే.. కామెడీ అంటే ఏదో çసపరేట్‌గా వచ్చే ట్రాక్‌లు కాకుండా కథలో ఇమిడి ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్‌లో వచ్చే డైలాగ్‌ ఈ దేశాన్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. చాలా గ్యాప్‌ తర్వాత సునీల్‌ పాత్ర నవ్విస్తూ, ఆలోచింపజేస్తుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి, అలీ, ‘వెన్నెల’ కిశోర్, రాజీవ్‌ కనకాల, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: జిబ్రాన్, కెమెరా: సర్వేశ్‌ మురారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement