Mia George
-
డబ్బే ముఖ్యం కాదు
సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా క్రాంతిమాధవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో పిసినారి. డబ్బే సర్వస్వం అనుకునే వ్యక్తి.. మనిషికి డబ్బే ముఖ్యం కాదనుకునే స్థితికి ఎలా వచ్చాడన్నదే కథ. మనం అనుకునే స్వభావం మనలో తక్కువగా ఉంటుంది. నేను అనుకునే స్థితిలో చాలా మంది ఉన్నారు. నేను నుంచి మనంగా మారడమే సినిమా. ‘ఓనమాలు’ చేశాక నేను వంద సినిమాలైతే చేయలేనని అర్థం అయ్యింది. పది సినిమాలైతే చేస్తాననే నమ్మకం ఉంది. ఆ పది సినిమాల్లో అన్ని జోనర్లలో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. నేను విద్యార్థిగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా సినిమాల గురించి మంచిగానో, చెడుగానో రాశారంటే అందులో నుంచి నేనూ కాస్త నేర్చుకోవాలి. సాధారణ జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ క్రియేటివ్‌గా ఆలోచించి ఓ కథ రాయడానికో, సినిమా తీయడానికో కావాల్సినంత సామర్థ్యం ఉంటుంది. రెగ్యులర్ సినిమాను చూపించాలనుకున్నప్పుడు అది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలనేదే నా ఆలోచన. సునీల్ ఈ చిత్రంలో రాంబాబు పాత్రలో ఒదిగిపోయారు’’ అని చెప్పారు. తదుపరి విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నా అని క్రాంతిమాధవ్ అన్నారు. -
పెళ్లి కాని యువతుల కథ
‘‘జీవితంలో మరచిపోలేని, మధురమైన రోజు పెళ్లిరోజు. పెళ్లికాని ముగ్గురు యువతులు పెళ్లిరోజు కోసం ఎలాంటి కలలు కన్నారు? వాటిని ఎలా సాకారం చేసుకున్నారు? అనే కథతో ఈ సినిమా తీశాం’’ అన్నారు దర్శకుడు నెల్సన్ వెంకటేశన్. దినేశ్, మియా జార్జ్, రిత్విక, నివేథా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో సురేష్ బల్లా, మృదుల మంగిశెట్టి నిర్మించిన చిత్రం ‘పెళ్లి రోజు’. ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మా చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు కృషి చేసిన ప్రవీణ్ కుమార్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి మాటలు: వెంకట్ మల్లూరి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, డా. చల్లా భాగ్యలక్ష్మి, సహనిర్మాత: జె.వినయ్. -
ఉంగరాల’కి వాయిస్
ఒక హీరో సినిమాకి మరో హీరో మాట సాయం చేయడం కామన్‌గా జరుగుతుంటుంది. అయితే, ఓ హీరో సినిమాకి నిర్మాత మాట సాయం చేయడం విశేషం. సునీల్, మియా జార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన ‘ఉంగరాల రాంబాబు’ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిర్మాత ‘దిల్’ రాజు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. పరుచూరి కిరీటి మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమాకి మాట సాయం చేసేందుకు అంగీకరించిన రాజుగారికి ధన్యవాదాలు. ఆయనతోనే వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఓ ప్రత్యేకత ఉంది. అది సినిమా రిలీజ్ రోజే తెలుస్తుంది. సినిమా విషయానికొస్తే.. కామెడీ అంటే ఏదో çసపరేట్గా వచ్చే ట్రాక్‌లు కాకుండా కథలో ఇమిడి ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్లో వచ్చే డైలాగ్ ఈ దేశాన్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత సునీల్ పాత్ర నవ్విస్తూ, ఆలోచింపజేస్తుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, అలీ, ‘వెన్నెల’ కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: జిబ్రాన్, కెమెరా: సర్వేశ్ మురారి. -
సునీల్ డ్యాన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది
– వీవీ వినాయక్ ‘‘సునీల్ నాకు సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ తెలుసు. తనలో మంచి డ్యాన్సర్ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తనలోని నృత్య ప్రతిభను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. తెరపై సునీల్ డ్యాన్సులు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా హిట్ అయి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అని దర ్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సునీల్, మియా జార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్‌ను వినాయక్ విడుదల చేశారు. సునీల్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఎప్పటికైనా సక్సెస్ అవుతామని నేను, వినాయక్‌గారు అనుకునేవాళ్లం. అలాగే అయ్యాం. నా చిత్రాల్లో కామెడీ ఉండటం కామన్. కానీ, ‘ఉంగరాల రాంబాబు’లో మరింత ఎక్కువ వినోదం ఉంటుంది. ఈ సినిమాతో క్రాంతిమాధవ్‌గారు గొప్ప దర్శకుల జాబితాలో చేరతారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రెండు, మూడు పాయింట్లను కలిపి ఈ సినిమా చేశా. వైవిధ్యమైన కామెడీ అలరిస్తుంది. పోసానిగారి పాత్ర హైలెట్. జిబ్రాన్ మంచి సంగీతం అందించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. పరుచూరి కిరీటి, మియాజార్జ్ పాల్గొన్నారు. -
భూగోళం ఊగేలా...
సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరిటీ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఇందులోని తొలి పాట ‘హూలాలా హూలాలా... భూగోళం ఊగేలా...’ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సునీల్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు నన్నెప్పుడూ ‘అందాల రాముడు’ అని పిలిచేవారు. ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి పది నిమిపాలు గడిపితే నాలో కొత్త ఉత్సాహం వచ్చేది. ఈ వేడుకకు దాసరిగారు వచ్చినట్లుగా భావిస్తున్నా. ఈ పాటను ఆయనకు అంకితం ఇస్తున్నాం. సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇకపై, ప్రతి మూడు రోజులకు ఒక్కో పాటను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘సునీల్‌గారి నటన, డ్యాన్స్ సూపర్. మంచి కథ, కథనంతో దర్శకుడు సినిమా తీశారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు పరుచూరి కిరీటి. ఈ సినిమాలో మియా జార్జ్ హీరోయిన్గా, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించారు. -
అప్పుడు తెలుగంటే భయం!
‘‘గతంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుందీ ‘యమన్’. ఇందులో నేను అంజనా అనే హీరోయిన్గా నటించా. రియల్ లైఫ్‌లో నేను హీరోయిన్ కావడంతో పాత్రతో సులభంగా కనెక్ట్ అయ్యా. కానీ, అంజనాతో నాకెలాంటి పోలికలూ లేవు. నేను హీరోయిన్ అయినా సాధారణ అమ్మాయిలానే ఉంటా’’ అన్నారు మియా జార్జ్. విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘యమన్’ చిత్రాన్ని తెలుగులో మిర్యాల రవీందర్‌రెడ్డి విడుదల చేస్తున్నారు. రేపు రిలీజవుతున్న ఈ సినిమా గురించి మియా చెప్పిన ముచ్చట్లు. అనుకోకుండా అంజనా ఓ సమస్యలో చిక్కుకున్నప్పుడు హీరో సహాయం కోరుతుంది. తర్వాత అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడామె లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? హీరో లైఫ్‌లో ఆమె పాత్ర ఏంటి? అనేవి ఆసక్తికరం. తప్పు చేసినవాడికి శిక్ష తప్పదనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళం, తమిళంలో కలిపి ఓ 20 సినిమాల వరకూ చేశా. కానీ, ఒక్క సినిమాలోనూ పాటలకు డ్యాన్స్ చేయలేదు. హీరోయిన్గా నాలుగేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో డ్యాన్స్ చేశా. చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో విడుదలవుతోన్న నా తొలి చిత్రమిది. నిజానికి, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ ముందు విడుదల అవుతుందనుకున్నా. ఇంకా ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘ఉంగరాల రాంబాబు’కి ముందు తెలుగులో కొన్ని ఛాన్సులు వచ్చాయి. నాకు తెలుగు రాదు. ఆ భయంతో చేయలేదు. మలయాళం, తమిళ భాషలు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. అందువల్ల, తమిళ సినిమాలు చేశా. అప్పుడు తెలుగులోనూ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ‘ఉంగరాల రాంబాబు’ తర్వాత మరిన్ని తెలుగు చిత్రాలు చేయాలనుంది. -
నేను గొప్ప నటుణ్ణి కాదు
– విజయ్ ఆంటోని ‘‘నిజాయితీగా చెప్పాలంటే... నేను గొప్ప నటుణ్ణి కాదు. టీవీల్లో చిన్నారులు నాకంటే వందరెట్లు బాగా చేస్తున్నారు. కానీ, హీరోగా మంచి స్థానంలో మీముందున్నానంటే కారణం... నేను ఎంపిక చేసుకునే కథలే. ‘బిచ్చగాడు’ విజయానికీ కథే కారణం, నేను కాదు’’ అన్నారు విజయ్ ఆంటోని. జీవశంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘యమన్’. ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరిచిన పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ – ‘‘రాజకీయ నేపథ్యంతో కూడిన కమర్షియల్ చిత్రమిది. యాక్షన్, సస్పెన్స్‌లతో కథ సాగుతుంది. నా గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఐదు పాటలున్నాయి’’ అన్నారు. ‘‘గతేడాది శివరాత్రికి ‘బిచ్చగాడు’ విడుదలైంది. ఈ శివరాత్రికి వస్తోన్న ‘యమన్’ ఆ సిన్మా కంటే పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు మిర్యాల రవీందర్‌రెడ్డి. చిత్ర కథానాయిక మియా జార్జ్, బీఏ రాజు పాల్గొన్నారు. -
నేనెవరినీ ప్రేమించను
నటుడు ఆర్య నిర్మించిన అమరకావ్యం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ కుట్టి మియాజార్జ్. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా ఈ అమ్మడికి ఇక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇండ్రు నేట్రు నాళై చిత్రంతో విజయాల ఖాతాను ఓపెన్ చేసిన మియాజార్జ్‌కు ఇటీవల శశికుమార్‌తో నటించిన వెట్రివేల్ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఒరునాళ్ కూత్తు చిత్ర రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి ఇతి వృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. సాధారణంగా కేరళ కుట్టీస్ గ్లామర్‌లో రెచ్చిపోయి నటించడానికి వెనుకాడరు. అలాంటిది మియాజార్జ్ మాత్రం స్క్రిన్షోకు కాస్త దూరంగా ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని ఈమె వద్ద ప్రస్థావించగా ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు తనను గుర్తు పట్టి పలకరిస్తున్నారన్నారు. గ్లామర్‌గా నటించవద్దు. కుటుంబకథా చిత్రాలే చేయాలని కోరుతున్నారన్నారు. వారి అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, అందుకే కుటుంబ కథా పాత్రలకే తను తొలి చాయిస్ అని బదులిచ్చారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఒరునాళ్ కూత్తు చిత్రంలో లక్ష్మీ అనే పాత్రను పోషించానని, తానిప్పటివరకూ 25 చిత్రాలకుపైగా నటించినా ఆ పాత్ర నుంచి ఇంకా బయటకు రాలేక పోతున్నానన్నారు. అంతగా తన మనసుకు దగ్గరగా ఉన్న పాత్ర అది అన్నారు. ఇకపోతే ఎవరినైనా ప్రేమించారా? అని అడుగుతున్నారని, ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదని, ఇకపై కూడా ప్రేమించే అవకాశం లేదని అన్నారు. అలాగే పెళ్లికి కూడా తొందర లేదని మియాజార్జ్ అంటున్నారు.ప్రస్తుతం ఈ భామ రమ్ చిత్రంతో పాటు విజయ్‌ఆంటోనికి జంటగా యమన్ చిత్రంతో నటిస్తున్నారు. -
విజయ్ ఆంటోనీతో మియాజార్జ్
ఒక చిత్రం అపజయం పాలైతే ఇక ఆ చిత్ర హీరోయిన్‌కు అవకాశాలు అంతే అన్నది పాత మాట. టాలెంట్‌తో పాటు అదృష్టం కలిసొస్తే వచ్చే అవకాశాలను ఆపడం ఎవరితరం కాదన్నది ఇప్పటి మాట. ఇక కేరళ కుట్టీలకు బాగా అచ్చొచ్చిన పరిశ్రమ కోలీవుడ్. ఇక్కడ వారి హవానే రాజ్యమేలుతోంది. అమరకావ్యం చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన నటి మియాజార్జ్. ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో ఇక మాలీవుడ్‌కు మూటాముల్లె సర్దుకోవాల్సిందే అనే ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. మియాజార్జ్ను కోలీవుడ్ వదులు కోవడానికి ఇష్టపడడంలేదు. అవకాశాలు ఆమెను వరిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఇండ్రు నేట్రు నాళై చిత్రంతో విజయాన్ని చవి చూసిన మియాజార్జ్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలున్నాయి. వాటిలో ఒరునాళ్ కూత్తు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక శశికుమార్‌తో వెట్ట్రివేల్ చిత్రంతో పాటు యమన్ అనే చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. విజయ్ 60వ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని మియాజార్జ్నే స్పష్టం చేశారు. అయితే తాజాగా విజయ్ఆంటోనీతో జత కట్టే అవకాశం వరించింది. దీనికి జీవా శంకర్ దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఆయన ఇంతకు ముందు విజయ్‌ఆంటోని హీరోగా నాన్ చిత్రానికి, మియాజార్జ్ హీరోయిన్గా అమరకావ్యం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరోహీరోయిన్లుగా చిత్రం చేయనున్నారు. ఇది తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారాయన. మంచి కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 75 రోజుల్లో ఏకధాటిగా చిత్రీకరణ పూర్తి చేసి ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
'ఇంద్రు నేత్రు నాలాయ్' స్టిల్స్