భూగోళం ఊగేలా... | 'ungarala rambabu'. first song was released today in Hyderabad | Sakshi
Sakshi News home page

భూగోళం ఊగేలా...

Published Mon, Jun 5 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

భూగోళం ఊగేలా...

భూగోళం ఊగేలా...

సునీల్‌ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఇందులోని తొలి పాట ‘హూలాలా హూలాలా... భూగోళం ఊగేలా...’ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సునీల్‌ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు నన్నెప్పుడూ ‘అందాల రాముడు’ అని పిలిచేవారు.

ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి పది నిమిపాలు గడిపితే నాలో కొత్త ఉత్సాహం వచ్చేది. ఈ వేడుకకు దాసరిగారు వచ్చినట్లుగా భావిస్తున్నా. ఈ పాటను ఆయనకు అంకితం ఇస్తున్నాం. సంగీత దర్శకుడు జిబ్రాన్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇకపై, ప్రతి మూడు రోజులకు ఒక్కో పాటను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘సునీల్‌గారి నటన, డ్యాన్స్‌ సూపర్‌. మంచి కథ, కథనంతో దర్శకుడు సినిమా తీశారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు పరుచూరి కిరీటి. ఈ సినిమాలో మియా జార్జ్‌ హీరోయిన్‌గా, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement