నేను గొప్ప నటుణ్ణి కాదు | Vijay Anthony impresses with Yaman's new trailer | Sakshi
Sakshi News home page

నేను గొప్ప నటుణ్ణి కాదు

Published Sun, Feb 12 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

నేను గొప్ప నటుణ్ణి కాదు

నేను గొప్ప నటుణ్ణి కాదు

– విజయ్‌ ఆంటోని
‘‘నిజాయితీగా చెప్పాలంటే... నేను గొప్ప నటుణ్ణి కాదు. టీవీల్లో చిన్నారులు నాకంటే వందరెట్లు బాగా చేస్తున్నారు. కానీ, హీరోగా మంచి స్థానంలో మీముందున్నానంటే కారణం... నేను ఎంపిక చేసుకునే కథలే. ‘బిచ్చగాడు’ విజయానికీ కథే కారణం, నేను కాదు’’ అన్నారు విజయ్‌ ఆంటోని. జీవశంకర్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘యమన్‌’. ద్వారకా క్రియేషన్స్‌ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. విజయ్‌ ఆంటోని స్వరపరిచిన పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.

విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ – ‘‘రాజకీయ నేపథ్యంతో కూడిన కమర్షియల్‌ చిత్రమిది. యాక్షన్, సస్పెన్స్‌లతో కథ సాగుతుంది. నా గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఐదు పాటలున్నాయి’’ అన్నారు. ‘‘గతేడాది శివరాత్రికి ‘బిచ్చగాడు’ విడుదలైంది. ఈ శివరాత్రికి వస్తోన్న ‘యమన్‌’ ఆ సిన్మా కంటే పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు మిర్యాల రవీందర్‌రెడ్డి. చిత్ర కథానాయిక మియా జార్జ్, బీఏ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement