నేనెవరినీ ప్రేమించను | i am don't love with others : mia george | Sakshi
Sakshi News home page

నేనెవరినీ ప్రేమించను

Published Mon, Jun 6 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

నేనెవరినీ ప్రేమించను

నేనెవరినీ ప్రేమించను

నటుడు ఆర్య నిర్మించిన అమరకావ్యం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ కుట్టి మియాజార్జ్. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా ఈ అమ్మడికి ఇక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇండ్రు నేట్రు నాళై చిత్రంతో విజయాల ఖాతాను ఓపెన్ చేసిన మియాజార్జ్‌కు ఇటీవల శశికుమార్‌తో నటించిన వెట్రివేల్ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఒరునాళ్ కూత్తు చిత్ర రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి ఇతి వృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.

సాధారణంగా కేరళ కుట్టీస్ గ్లామర్‌లో రెచ్చిపోయి నటించడానికి వెనుకాడరు. అలాంటిది మియాజార్జ్ మాత్రం స్క్రిన్‌షోకు కాస్త దూరంగా ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని ఈమె వద్ద ప్రస్థావించగా ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు తనను గుర్తు పట్టి పలకరిస్తున్నారన్నారు. గ్లామర్‌గా నటించవద్దు. కుటుంబకథా చిత్రాలే చేయాలని కోరుతున్నారన్నారు. వారి అభిప్రాయాలను తాను గౌరవిస్తానని, అందుకే కుటుంబ కథా పాత్రలకే తను తొలి చాయిస్ అని బదులిచ్చారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఒరునాళ్ కూత్తు చిత్రంలో లక్ష్మీ అనే పాత్రను పోషించానని, తానిప్పటివరకూ 25 చిత్రాలకుపైగా నటించినా ఆ పాత్ర నుంచి ఇంకా బయటకు రాలేక పోతున్నానన్నారు. అంతగా తన మనసుకు దగ్గరగా ఉన్న పాత్ర అది అన్నారు. ఇకపోతే ఎవరినైనా ప్రేమించారా? అని అడుగుతున్నారని, ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదని, ఇకపై కూడా ప్రేమించే అవకాశం లేదని అన్నారు. అలాగే పెళ్లికి కూడా తొందర లేదని మియాజార్జ్ అంటున్నారు.ప్రస్తుతం ఈ భామ రమ్ చిత్రంతో పాటు విజయ్‌ఆంటోనికి జంటగా యమన్ చిత్రంతో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement