అప్పుడు తెలుగంటే భయం!
‘‘గతంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుందీ ‘యమన్’. ఇందులో నేను అంజనా అనే హీరోయిన్‌గా నటించా. రియల్ లైఫ్‌లో నేను హీరోయిన్ కావడంతో పాత్రతో సులభంగా కనెక్ట్ అయ్యా. కానీ, అంజనాతో నాకెలాంటి పోలికలూ లేవు. నేను హీరోయిన్ అయినా సాధారణ అమ్మాయిలానే ఉంటా’’ అన్నారు మియా జార్జ్. విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘యమన్’ చిత్రాన్ని తెలుగులో మిర్యాల రవీందర్‌రెడ్డి విడుదల చేస్తున్నారు. రేపు రిలీజవుతున్న ఈ సినిమా గురించి మియా చెప్పిన ముచ్చట్లు.
అనుకోకుండా అంజనా ఓ సమస్యలో చిక్కుకున్నప్పుడు హీరో సహాయం కోరుతుంది. తర్వాత అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడామె లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? హీరో లైఫ్‌లో ఆమె పాత్ర ఏంటి? అనేవి ఆసక్తికరం. తప్పు చేసినవాడికి శిక్ష తప్పదనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
మలయాళం, తమిళంలో కలిపి ఓ 20 సినిమాల వరకూ చేశా. కానీ, ఒక్క సినిమాలోనూ పాటలకు డ్యాన్స్ చేయలేదు. హీరోయిన్‌గా నాలుగేళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో డ్యాన్స్ చేశా. చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో విడుదలవుతోన్న నా తొలి చిత్రమిది. నిజానికి, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ ముందు విడుదల అవుతుందనుకున్నా. ఇంకా ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
‘ఉంగరాల రాంబాబు’కి ముందు తెలుగులో కొన్ని ఛాన్సులు వచ్చాయి. నాకు తెలుగు రాదు. ఆ భయంతో చేయలేదు. మలయాళం, తమిళ భాషలు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. అందువల్ల, తమిళ సినిమాలు చేశా. అప్పుడు తెలుగులోనూ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ‘ఉంగరాల రాంబాబు’ తర్వాత మరిన్ని తెలుగు చిత్రాలు చేయాలనుంది.