కథను నమ్మితే సినిమా హిట్టే | vijay antony has once again choosen a script which suits him | Sakshi
Sakshi News home page

కథను నమ్మితే సినిమా హిట్టే

Published Mon, Feb 27 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

కథను నమ్మితే సినిమా హిట్టే

కథను నమ్మితే సినిమా హిట్టే

ఎవరీ విజయ్‌ ఆంటోని? తెలుగోడు కాదు, తమిళియన్‌... ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు... అసలు హీరో కావాలని ఫిల్మ్‌ ఇండస్ట్రీకి రాలేదు... ఓ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు... ఇప్పుడతను తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ హాట్‌షాట్‌ హీరో! గతేడాది శివరాత్రికి ‘బిచ్చగాడు’, ఈ ఏడాది శివరాత్రికి ‘యమన్‌’ (ఈ 24న విడుదలైంది)... హీరోగా తెలుగులో సూపర్‌ సక్సెస్‌లు అందుకున్నారు విజయ్‌ ఆంటోని. సంగీత దర్శకుడిగా తెలుగులో ‘మహాత్మ’, ‘దరువు’ చిత్రాలతో పాటు ఎన్నో తమిళ చిత్రాలకు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించిన ఆయన.. ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్‌లు కొడుతున్నారు. ప్రేక్షకుల్లో మంచి సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నారు.

విజయ్‌ ఆంటోని సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటి?
ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్‌ లేదు. పోనీ, మంచి హైటు–వెయిటు, రంగు–రూపు ఉన్నాయా? అని చూస్తే... లేవనే చెప్పాలి. జస్ట్, ప్రేక్షకుల్లో ఒకరిలా.. సాదాసీదాగా ఉంటారు. మరి, వరుసగా ఇన్ని హిట్స్‌ ఎలా వస్తున్నాయంటే... విజయ్‌ ఆంటోని కథను నమ్మి సినిమాలు చేస్తారు.

ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా ‘నకిలి’ నుంచి తాజా ‘యమన్‌’ వరకూ... ప్రతి సినిమాలోనూ కథే హీరో. ఆరు పాటలు, ఫైట్లు, నాలుగు కామెడీ ఎపిసోడ్స్, రెండు సెంటిమెంట్‌ సీన్లు.. అనుకుంటున్న టైమ్‌లో కథే ప్రధానంగా సినిమాలు చేస్తున్నారాయన. కథను నమ్ముకుంటే సినిమా హిట్‌ అనే ఫార్ములాను నిరూపించారు. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు విజయ్‌ ఆంటోనీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎంతగా అభిమానిస్తున్నారంటే... తమిళంలోకన్నా తెలుగు లోనే ‘బిచ్చగాడు’ భారీ హిట్‌ సాధించింది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్‌ ఆంటోని నటించిన ‘భేతాళుడు’ టాక్‌ ఎలా ఉన్నా... మంచి వసూళ్లు వచ్చాయి. టేకింగ్‌ పరంగా మంచి పేరొచ్చింది. ఇప్పుడీ ‘యమన్‌’కు టాక్‌తో పాటు కలెక్షన్స్‌ కూడా బాగున్నాయి.

‘యమన్‌’ విషయానికి వస్తే... రాజకీయ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌ చిత్రమిది. రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో దూరంగా ఉండరు. పక్కనే ఉంటా రనేది కథ. సహజత్వానికి దగ్గరగా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో తీశారు. తమిళంతో సమానంగా తెలుగులో ఓపెనింగ్స్‌ వచ్చాయి. కథ, డైలాగులు, విజయ్‌ ఆంటోని నటనకు మంచి పేరొచ్చింది. వెబ్‌ మీడియా ఈ చిత్రానికి మంచి రేటింగ్స్‌ ఇచ్చింది.

శుక్రవారం ఎంత వసూళ్లు ఉన్నాయో శనివారం కూడా అంతే ఉన్నాయి. ఆదివారం వసూళ్లు మరింత పెరిగాయి. ఈ రోజు (సోమవారం) అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగున్నాయి. వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మా ద్వారకా క్రియేషన్స్‌ సంస్థ ద్వారా ‘యమన్‌’ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement