ఆయనలో అది నాకెంతో నచ్చింది | actress miya george said Actor Vijay Antony enjoy simplicity | Sakshi
Sakshi News home page

ఆయనలో అది నాకెంతో నచ్చింది

Published Wed, Feb 22 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

ఆయనలో అది నాకెంతో నచ్చింది

ఆయనలో అది నాకెంతో నచ్చింది

మియాజార్జి

టీనగర్‌: నటుడు విజయ్‌ ఆంటోని నిరాడంబరత తనకెంతో నచ్చిందని నటి మియాజార్జి తెలిపారు. జీవా శంకర్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, మియాజార్జి నటిస్తున్న చిత్రం ‘ఎమన్‌’. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో రాజు మహాలింగం, విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఫాతిమా విజయ్‌ ఆంటోని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యమన్‌ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదల కానుంది. ఇందులో నటించడం గురించి మియాజార్జి మాట్లాడుతూ యమన్‌ చిత్రంలో తాను నటించేందుకు రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని, అవేమంటే తనను తమిళ చిత్రరంగానికి పరిచయం చేసిన దర్శకులు జీవాశంకర్, విభిన్న తరహా కథలను ఎంపిక చేసి నటించే విజయ్‌ఆంటోని అన్నారు. జీవా శంకర్‌తో కలిసి పనిచేస్తున్న రెండవ చిత్రం యమన్‌ అన్నారు.

‘అమర కావ్యం’ చిత్రం నుంచి ప్రత్యేక తరహా పాత్రలో ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. విజయ్‌ ఆంటోనీ నిరాడంబరమైన వ్యక్తిత్వం నచ్చిందని అన్నారు. అంతేకాకుండా 24 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేసే ఆయనతో నటించడం సంతోషంగా ఉందన్నారు. యమన్‌ చిత్రంలో తాను అంజనా అనే పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో తనకు మొట్టమొదటి సారిగా స్పెషల్‌ సాంగ్‌ను ఇచ్చారని, ఈ పాట తనకు అభిమానుల నుంచి ప్రత్యేక తరహా గుర్తింపునిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement