రాంబాబు రాత మారిందా? | Sunil Ungarala Rambabu in Kranti Madhav direction | Sakshi
Sakshi News home page

రాంబాబు రాత మారిందా?

Apr 29 2017 11:31 PM | Updated on Sep 5 2017 9:59 AM

రాంబాబు రాత మారిందా?

రాంబాబు రాత మారిందా?

తలరాత మారాలంటే చేతి గీతలు అరిగేలా కష్టపడాలంటారు. కానీ మనోడు గీతలు అరగకుండా చూసుకునే టైప్‌.

తలరాత మారాలంటే చేతి గీతలు అరిగేలా కష్టపడాలంటారు. కానీ మనోడు గీతలు అరగకుండా చూసుకునే టైప్‌. చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే చాలు అలిగి వెళ్ళిన అదృష్టం అడ్రస్‌ వెతుక్కుంటూ వస్తుందని నమ్మే రకం. అంతే కాదండోయ్‌ అడ్రస్‌ పొరపాటున కూడా మిస్‌ అవ్వకూడదని వేలకు వేలు పెట్టి ప్రతి వేలికీ ఓ ఉంగరం పెట్టుకుంటాడు.

మరి రాంబాబుని అదృష్టలక్ష్మి వరించిందా? అతని రాత మారిందా? ఉంగరాలు అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. సునీల్‌ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. మియాజార్జ్‌ కథానాయిక. యునైటెడ్‌ కిరీటి మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై పరుచూరి కిరిటీ నిర్మించారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం మే చివరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘మంచి వినోదాత్మక చిత్రమిది. సునీల్‌ కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. దర్శకులు క్రాంతి మాధవ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. మియాజార్జ్‌ నటన సినిమాకు ఫ్లస్‌ పాయింట్‌. జిబ్రాన్‌ మంచి పాటలిచ్చారు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement