Kranti Madhav
-
మా ఆయన గొప్ప ప్రేమికుడు
‘‘మా ఆయన పేరు శీనయ్య. ఆయన ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుడు’’ అంటోంది సువర్ణ. ఈ భార్యాభర్తల కథేంటి? అసలు వాళ్ల ప్రేమకథేంటి? తెలియాలంటే వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం వరకూ వెయిట్ చేయాలి. విజయ్ దేవరకొండ హీరోగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మించారు. ఈ సినిమాలోని హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తోంది చిత్రబృందం. గురువారం ఐశ్వర్యా రాజేశ్, విజయ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సువర్ణ అనే గృహిణి పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది. -
రాంబాబు రాత మారిందా?
తలరాత మారాలంటే చేతి గీతలు అరిగేలా కష్టపడాలంటారు. కానీ మనోడు గీతలు అరగకుండా చూసుకునే టైప్. చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే చాలు అలిగి వెళ్ళిన అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని నమ్మే రకం. అంతే కాదండోయ్ అడ్రస్ పొరపాటున కూడా మిస్ అవ్వకూడదని వేలకు వేలు పెట్టి ప్రతి వేలికీ ఓ ఉంగరం పెట్టుకుంటాడు. మరి రాంబాబుని అదృష్టలక్ష్మి వరించిందా? అతని రాత మారిందా? ఉంగరాలు అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. మియాజార్జ్ కథానాయిక. యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై పరుచూరి కిరిటీ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే చివరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘మంచి వినోదాత్మక చిత్రమిది. సునీల్ కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. దర్శకులు క్రాంతి మాధవ్ అద్భుతంగా తెరకెక్కించారు. మియాజార్జ్ నటన సినిమాకు ఫ్లస్ పాయింట్. జిబ్రాన్ మంచి పాటలిచ్చారు’’ అని అన్నారు. -
ఉంగరాల కథేంటి?
అతడి పేరు రాంబాబు. కానీ, జనాలందరూ ‘ఉంగరాల రాంబాబు’ అంటేనే గుర్తు పడతారు. అతడి చేతికి అన్ని ఉంగరాలుంటాయ్ మరి! ఆ ఉంగరాల కథేంటి? జాతకాలపై నమ్మకమా లేదా రాంబాబు హోదాకి చిహ్నమా? తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు సునీల్. ఆయన హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం రథ సప్తమి సందర్భంగా చిత్ర ప్రచార రథాన్ని సంస్థ కార్యాలయంలో ప్రారంభించి, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘వాణిజ్య హంగులతో కూడిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. సునీల్ నటన, ఆయన పాత్ర కొత్తగా ఉంటాయి. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రాల తర్వాత క్రాంతి మాధవ్ తీస్తున్న ఈ చిత్రంలో ఆయన శైలిలో సాగే హృదయా నికి హత్తుకునే భావోద్వేగా లుంటాయి. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని, వేసవికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. మియా జార్జ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సర్వేశ్ మురారి, శ్యామ్ కె. నాయుడు, సంగీతం: జిబ్రాన్. -
మళ్లీ మళ్లీ... కాంబినేషన్లో విజయ్
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అన్నట్టు.. ‘పెళ్ళిచూపులు’ చిత్రం విజయ్ దేవరకొండ లైఫ్‌ని మార్చేసింది. ఆ చిత్రం ఇచ్చిన హిట్‌తో పెద్ద బ్యానర్లలో నటించే అవకాశాలు వస్తున్నాయి విజయ్‌కి. ప్రస్తుతం తను నటించిన ‘ద్వారక’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ను మరో అవకాశం వరించింది. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కేయస్ రామారావు నిర్మించనున్నారు. క్రాంతి మాధవ్‌తో ఆయన నిర్మించిన ‘మళ్లీ మళ్లీ....’ ఫీల్‌గుడ్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. -
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
‘ఓనమాలు’ చిత్రంతో సెన్సిబుల్ డెరైక్టర్ అనిపించుకున్న క్రాంతిమాధవ్ మరో విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శర్వానంద్, నిత్యామీనన్ నటిస్తున్నారు. వీరిద్దరూ కథ వినగానే సెకండ్ థాట్ లేకుండా ప్రాజెక్ట్‌కి పచ్చ జెండా ఊపారట. అగ్ర నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. చిరంజీవి-కేఎస్ రామారావు కాంబినేషన్లో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రంలోని ఓ పాట పల్లవి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ని ఈ చిత్రానికి టైటిల్‌గా అనుకుంటున్నారట.