మళ్లీ మళ్లీ... కాంబినేషన్‌లో విజయ్‌ | Vijay combination kranthi madhav | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ... కాంబినేషన్‌లో విజయ్‌

Published Wed, Dec 28 2016 11:11 PM | Last Updated on Sun, Jul 14 2019 1:11 PM

మళ్లీ మళ్లీ... కాంబినేషన్‌లో విజయ్‌ - Sakshi

మళ్లీ మళ్లీ... కాంబినేషన్‌లో విజయ్‌

‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అన్నట్టు.. ‘పెళ్ళిచూపులు’ చిత్రం విజయ్‌ దేవరకొండ లైఫ్‌ని మార్చేసింది. ఆ చిత్రం ఇచ్చిన హిట్‌తో పెద్ద బ్యానర్లలో నటించే అవకాశాలు వస్తున్నాయి విజయ్‌కి. ప్రస్తుతం తను నటించిన ‘ద్వారక’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్‌ను మరో అవకాశం వరించింది. 

‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని కేయస్‌ రామారావు నిర్మించనున్నారు. క్రాంతి మాధవ్‌తో ఆయన నిర్మించిన ‘మళ్లీ మళ్లీ....’ ఫీల్‌గుడ్‌ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement