విజయ్ దేవరకొండ, ఐశ్వర్యా రాజేశ్
‘‘మా ఆయన పేరు శీనయ్య. ఆయన ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుడు’’ అంటోంది సువర్ణ. ఈ భార్యాభర్తల కథేంటి? అసలు వాళ్ల ప్రేమకథేంటి? తెలియాలంటే వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం వరకూ వెయిట్ చేయాలి. విజయ్ దేవరకొండ హీరోగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మించారు. ఈ సినిమాలోని హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తోంది చిత్రబృందం. గురువారం ఐశ్వర్యా రాజేశ్, విజయ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సువర్ణ అనే గృహిణి పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment