ఉంగరాల కథేంటి? | sunil new movie ungarala rambabu | Sakshi
Sakshi News home page

ఉంగరాల కథేంటి?

Published Sat, Feb 4 2017 6:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

ఉంగరాల కథేంటి?

ఉంగరాల కథేంటి?

అతడి పేరు రాంబాబు. కానీ, జనాలందరూ ‘ఉంగరాల రాంబాబు’ అంటేనే గుర్తు పడతారు. అతడి చేతికి అన్ని ఉంగరాలుంటాయ్‌ మరి! ఆ ఉంగరాల కథేంటి? జాతకాలపై నమ్మకమా లేదా రాంబాబు హోదాకి చిహ్నమా? తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు సునీల్‌. ఆయన హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో యునైటెడ్‌ కిరీటి మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం రథ సప్తమి సందర్భంగా చిత్ర ప్రచార రథాన్ని సంస్థ కార్యాలయంలో ప్రారంభించి, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ – ‘‘వాణిజ్య హంగులతో కూడిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. సునీల్‌ నటన, ఆయన పాత్ర కొత్తగా ఉంటాయి. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రాల తర్వాత క్రాంతి మాధవ్‌ తీస్తున్న ఈ చిత్రంలో ఆయన శైలిలో సాగే హృదయా నికి హత్తుకునే భావోద్వేగా లుంటాయి. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని, వేసవికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. మియా జార్జ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సర్వేశ్‌ మురారి,
శ్యామ్‌ కె. నాయుడు, సంగీతం: జిబ్రాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement