8 ఏ‍ళ్ల పిల్లాడికి తండ్రిగా ‘అర్జున్‌ రెడ్డి’ | Vijay Devarakonda To Play Father Role | Sakshi
Sakshi News home page

8 ఏ‍ళ్ల పిల్లాడికి తండ్రిగా ‘అర్జున్‌ రెడ్డి’

Published Tue, Feb 19 2019 3:59 PM | Last Updated on Tue, Feb 19 2019 6:21 PM

Vijay Devarakonda To Play Father Role - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న  విజయ్‌ దేవరకొండ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ప్రతీ చిత్రలోనూ ఏదో ఒక వేరియేషన్‌ చూపిస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలో తన వయసుకు మించిన పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం విజయ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్‌ కామ్రేడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాతో పాటు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఫేం కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ సరసన  రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్‌ ఎనిమిదేళ్ల పిల్లాడికి తండ్రిగా కనిపించనున్నాడట. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement