
విజయ్ ఖాతాలో మరో క్రేజీ మూవీ
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, పెళ్లిచూపులు సక్సెస్తో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్కు ఓకే చెప్పాడు.
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు లాంటి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ద్వారక సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్, ఆ సినిమా తరువాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో క్రాంతి మాధవ్ తెరకెక్కించే సినిమాలో హీరోగా నటిస్తాడు.