ప్రేమికుల రోజున.. | world famous lover release date announced | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజున..

Published Mon, Nov 25 2019 4:02 AM | Last Updated on Mon, Nov 25 2019 4:02 AM

world famous lover release date announced - Sakshi

విజయ్‌ దేవరకొండ

ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు విజయ్‌ దేవరకొండ. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేయస్‌ రామారావు సమర్పణలో కేయస్‌ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క షెడ్యూల్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ ఒకటికి మించి లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement