ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Tollywood Movie14 Days Love Will be Release On January Month | Sakshi
Sakshi News home page

14 Days Love: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Fri, Dec 29 2023 6:12 PM | Last Updated on Fri, Dec 29 2023 6:19 PM

Tollywood Movie14 Days Love Will be Release On January Month - Sakshi

మనోజ్, చాందిని  హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం "14 డేస్ లవ్". ఈ చిత్రాన్ని నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కించారు. సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దాసరి హరిబాబు  నిర్మించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 

కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అన్న కోణంలో దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కుటుంబ సంప్రదాయ విలువలతో రూపొందించినఈ చిత్రం జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్,  అంజలి,  ఐడ్రీమ్ రాజా, శ్రీధర్ కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement