వైవిధ్యమైన రణస్థలి | Sakshi
Sakshi News home page

వైవిధ్యమైన రణస్థలి

Published Fri, Nov 25 2022 4:00 AM

C Ashwini Dutt Speech In Ranasthali Pre Release Event - Sakshi

‘‘రణస్థలి’ టీజర్, ట్రైలర్‌ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తుకు వస్తోంది. ఇందులోని కొన్ని సీన్స్‌ చూసిన తర్వాత సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని నిర్మాత సి. అశ్వినీదత్‌ అన్నారు. ధర్మ, అమ్ము అభిరామి, చాందినీ రావు హీరో హీరోయిన్లుగా పరశురాం శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలి’. సూరెడ్డి విష్ణు సమర్పణలో అనుపమ సూరెడ్డి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అశ్వినీదత్‌ మాట్లాడుతూ– ‘‘విజయా పిక్చర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా 50 ఏళ్లు నడిపిన వెంకటరత్నంగారి అబ్బాయి విష్ణు సినిమా రంగంలోకి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటీనటులు కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు’’ అన్నారు సూరెడ్డి విష్ణు, సహనిర్మాత లక్ష్మీజ్యోతి శ్రీనివాస్‌. ‘‘పూరి జగన్నాథ్‌గారు నా గురువు. రొటీన్‌గా వచ్చే కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు పరశురాం శ్రీనివాస్‌. ఈ వేడుకలో హీరోలు ఆకాష్‌ పూరి, నందు, గౌతమ్, నటుడు సమ్మెట గాంధీ, కెమెరామేన్‌ బాలాజీ, చిత్రయూనిట్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేశవ్‌ కిరణ్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement