
చాందిని
అనిరుద్, చాందిని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘కిరాక్’. హారిక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి దేవా కట్టా కెమెరా స్విచాన్ చేయగా, కె.అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండే ప్రేమకథ ఇదని దర్శకుడు చెప్పారు. సింగిల్ షెడ్యూల్‌తో పూర్తి చేసి, మార్చిలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. కాశీ విశ్వనాథ్, నవీన్, రాహుల్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: డా.ఆర్, కెమెరా: హరీష్ గొట్టిపాటి, సంగీతం: అజయ్ అరసాద, ఎడిటింగ్: నందమూరి రామ్.