ఇన్నేళ్లు అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: హీరోయిన్‌ | Upendra A Movie Actress Chandini Comment On Her Marriage | Sakshi
Sakshi News home page

ఇన్నేళ్లు అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: హీరోయిన్‌

Published Sat, Jun 22 2024 7:18 PM | Last Updated on Sat, Jun 22 2024 7:29 PM

Upendra A Movie Chandini Comment Her Marriage

ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఆ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని (41) హీరోయిన్‌గా నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో కూడా ఇప్పటికీ ఈ సినిమాకు గుర్తింపు ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తాజాగా తెలుగులో రీ రిలీజ్‌ చేశారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్‌ అయింది. ఈ నేపంథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఉపేంద్రతో నటించిన 'ఏ' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చాందిని తెలిపింది. తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్‌ దక్కినట్లు గుర్తుచేసుకుంది. ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారని ఆమె తెలిపింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్‌ చేశారని చెప్పింది. కానీ తెలిసిన వారి నుంచి తన ఫోటోలు 'ఏ' సినిమా మేకర్స్‌ చేతికి వెళ్లాయని, ఆ సమయంలో తనను చూడకుండానే వారు సెలక్ట్‌ చేశారని తెలిపింది. 

ఇదే సమయంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. 'వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అది మన చేతుల్లో లేదు. దానిని దేవుడు నిర్ణయించాలి. పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను. నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్‌ మ్యారేజ్‌లు బాగుంటాయి.' అని చాందిని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement