A Movie
-
ఇన్నేళ్లు అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: హీరోయిన్
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఆ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని (41) హీరోయిన్గా నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్లో కూడా ఇప్పటికీ ఈ సినిమాకు గుర్తింపు ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తాజాగా తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ అయింది. ఈ నేపంథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.ఉపేంద్రతో నటించిన 'ఏ' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చాందిని తెలిపింది. తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్ దక్కినట్లు గుర్తుచేసుకుంది. ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారని ఆమె తెలిపింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్ చేశారని చెప్పింది. కానీ తెలిసిన వారి నుంచి తన ఫోటోలు 'ఏ' సినిమా మేకర్స్ చేతికి వెళ్లాయని, ఆ సమయంలో తనను చూడకుండానే వారు సెలక్ట్ చేశారని తెలిపింది. ఇదే సమయంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. 'వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అది మన చేతుల్లో లేదు. దానిని దేవుడు నిర్ణయించాలి. పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను. నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్ మ్యారేజ్లు బాగుంటాయి.' అని చాందిని తెలిపింది. -
జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు లింగం యాదవ్. ‘‘ఏ’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. -
మళ్లీ ఏ
ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఏ’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. 1998లో దాదాపు రూ. 1 కోటీ 25 లక్షలతో రూపోందిన ఈ చిత్రం రూ. 20 కోట్లు వసూలు చేసింది. కొత్త తరహా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని తాజాగా 4కేలో ఉపేంద్ర ఉప్పి క్రియేషన్స్, లింగం యాదవ్ చందు ఎంటర్టైన్మెంట్ విడుదల చేయనున్నాయి. ఈ నెల 21న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.ఈ సందర్భంగా లింగం యాదవ్ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఏ’ ఒక సంచలనం. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాం. ఇక మేం 4కేలో విడుదల చేసిన ప్రభాస్ ‘ఛత్రపతి, యోగి’ చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ‘ఏ’కి కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఉపేంద్ర కల్ట్ సినిమా రీరిలీజ్.. కోటి బడ్జెట్‌తో విడుదల చేస్తే..
కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్‌గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్‌లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్‌లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్‌లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్‌గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి. క్లైమాక్స్‌ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్‌కుమార్‌తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్‌కు పెద్ద ఫ్యాన్‌ను అంటూ ఆయన చెప్పడం విశేషం. -
‘A’ మూవీ రివ్యూ
టైటిల్ : A జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు నిర్మాణ సంస్థ : అవంతి ప్రొడక్షన్స్ నిర్మాతలు : గీతా మిన్సాల దర్శకత్వం : యుగంధర్ ముని సంగీతం : విజయ్ కురాకుల ఎడిటింగ్: ఆనంద్ పవన్ సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె బంగారి విడుదల తేది : మార్చి 05, 2021 నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'A'. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. కొత్త అంశాన్ని తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘A’ మూవీ ప్రేక్షకులు ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం కథ సంజీవ్(నితిన్ ప్రసన్న) గతం మర్చిపోయిన వ్యక్తి. భార్య పల్లవి(ప్రీతి అశ్రాని)తో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇలా జీవితం సాగుతున్న తరుణంలో, ఒకే కల అతడిని పదే పదే వేధిస్తూ ఉంటుంది. అసలు సంజీవ్‌కు ఆ కల ఎందుకు వస్తుందో, అతనికి ఉన్న రోగం ఏంటో తెలుసుకోవడానికి వైద్యులు చాలా ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఫలితం ఉండదు. అతని గతం గుర్తుకు వస్తే ఆ కల ఎందుకు వస్తుందో తెలుసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తారు. దీంతో సంజీవ్ తన గతం తెలుసుకోవాలనుకుంటాడు. దీనికి తన స్నేహితుడి సహాయం తీసుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎమర్జెన్సీ కాలం నాటి అశ్వథ్థామ గురించి తెలుస్తుంది. అతని చరిత్ర ఏంటో తెలిస్తే తన గతానికి సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందని ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. కట్ చేస్తే.. ఆగస్టు 12న బోయినపల్లి పుట్‌పాత్‌పై ఓ చిన్నారి కిడ్నాప్ అవుతుంది. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. విచారణను రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఓ సీనియర్ పోలీసు అధికారికి అప్పగిస్తారు. కేసు విచారణలో పోలీసులు సంజీవ్‌ను అరెస్ట్ చేస్తారు. కానీ ఆ కిడ్నాప్ చేసింది సంజీవ్ కాదని తెలుసుకొని అతన్ని వదిలేస్తారు. అసలు చిన్నారులను కిడ్నాప్ చేస్తుందెవరు? కిడ్నాపర్‌కు సంజీవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? సంజీవ్ గతానికి ఎమర్జెన్సీ కాలం నాటి అశ్వథ్థామకు సంబంధం ఏంటి? సంజీవ్‌ను పదే పదే వేధిస్తున్న కల ఏంటి? చిన్నారులను దేని కోసం కిడ్పాప్ చేశారు? అనేదే మిగత కథ నటీనటులు హీరో సంజీవ్‌కు ఇది తొలి సినిమా. అయినప్పటికీ ఎన్నో సినిమాల అనుభవం ఉన్నవాడిలా నటించాడు. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. 'మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్'' ఫేమ్ ప్రీతి అశ్రాని పల్లవి పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా ఆమె అవలీలగా నటించారు. అలాగే మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ఉత్కంఠ రేపే కథనం, ఆశ్చర్యాన్ని కలిగించే కథ.. ఇలాంటి అంశాలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతుతండడంతో దర్శకనిర్మాతలు కూడా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడానికి ముందుకొస్తున్నారు. ఈ A మూవీ కూడా అలాంటిదే. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ యంగ్ డైరెక్టర్ యుగంధర్ మాత్రం తన డెబ్యూ మూవీతోనే ఓ ప్రయోగం చేశాడు. సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచాడు. సస్పెన్స్‌ను ఆద్యంతం గుప్పిట్లో ఉంచి నడిపించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ స్లోనెరెషన్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ కాస్త నెమ్మదిగా సాగి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ కురాకుల సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మాయ చేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రాఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ, కథనం నితిన్ ప్రసన్న నటన ఇంటర్వెల్ ట్విస్ట్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్ కొన్ని సాగదీత సీన్లు సింపుల్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్