కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.
ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్‌గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్‌లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్‌లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్‌లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్‌గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి.
క్లైమాక్స్‌ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్‌కుమార్‌తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్‌కు పెద్ద ఫ్యాన్‌ను అంటూ ఆయన చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment