జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర | Sakshi
Sakshi News home page

జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర

Published Sun, Jun 16 2024 6:23 AM

Upendra A to rerelease on June 21

ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా రీ రిలీజ్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్‌ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రీ రిలీజ్‌ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్‌ స్థాపకుడు లింగం యాదవ్‌. ‘‘ఏ’ రిలీజ్‌ ప్రమోషన్స్‌ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్‌ వచ్చి సినిమాను ప్రమోట్‌ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement