డిగ్రీ పాసవలేదన్న మనస్తాపంతో.. | Degree Student Chandini Missing From Home in Visakhapatnam | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువతి అదృశ్యం

Published Wed, Oct 23 2019 12:07 PM | Last Updated on Wed, Oct 23 2019 12:49 PM

Degree Student Chandini Missing From Home in Visakhapatnam - Sakshi

చాందిని

విశాఖ,గాజువాక : డిగ్రీలో పాసవలేదన్న మనస్తాపంతో ఒక యువతి ఇంటి నుంచి అదృశ్యమైట్టు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా మాకవరపాలెం మండలానికి చెందిన చాందిని (20) డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీలోని చివరి సెమిస్టర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో గాజువాక హైస్కూల్‌ రోడ్‌లో నివాసముంటున్న తన అక్క ఇంటికి ఇటీవల వచ్చింది. సప్లిమెంటరీలో పాస్‌ కావచ్చని భావించిన ఆమె సమయం వృథా కాకుండా కాంపిటేటివ్‌ పరీక్షలకు కూడా సిద్ధమవుతోంది. అయితే మంగళవారం ఉదయం నుంచి ఆమె ఇంట్లో కనిపించలేదు. డిగ్రీ పాస్‌ కాకపోవడం వల్ల తనకు ఉద్యోగం రాదనే విషయం ఆందోళన కలిగిస్తోందని, అందుకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని, తనకోసం వెతకవద్దని ఒక పేపర్‌పై రాసి వెళ్లిపోయినట్టు చాందిని బావ మోహనరావు గాజువాక పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు గాజువాక ఎస్‌ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement