సీమతన్నీ మొదలైంది! | seema thanni film was started on Sunday morning with pooja programs in Chennai. | Sakshi
Sakshi News home page

సీమతన్నీ మొదలైంది!

Published Mon, Jul 17 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

సీమతన్నీ మొదలైంది!

సీమతన్నీ మొదలైంది!

తమిళసినిమా: సీమతన్నీ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విదార్థ్, విజయ్‌వసంత్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం సీమతన్నీ. వా రికి జంటగా చాందిని, సుభిక్ష నాయికలుగా నటిస్తున్న ఇందులో యోగిబా బు, హలో కందస్వామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రేట్‌ ఎంపరర్‌ ప్రొడక్షన్‌ పతాకంపై సి.ప్రేమ్‌కుమార్‌ భా రీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వా రా విజయ్‌మోహన్‌ దర్శకుడిగా పరి చయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం వివరాలను తెలుపుతూ ఒక రేషన్‌ షాప్‌నే సొంత ఇల్లుగా భావించి జీవిస్తున్న ఇద్దరు అనాథమిత్రులు, 10 ఇళ్లల్లో పనిచేసుకుని జీవించే తంగమారి అనే ఒక యువతి జీవి తాలను ఆవిష్కరించే చిత్రంగా సీమతన్నీ ఉంటుందన్నారు. ఇందులో మలర్‌వళీగా నటి చాం దిని పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. దర్శకుడు సర్గుణం అతిథిగా విచ్చేసి క్లాప్‌కొట్టి చిత్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికి తిరుమూర్తి సంగీతాన్ని, మంజల్‌ చిత్రం తరువాత మాసాని ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement